జీవిత సత్యాలు

3.235.74.77

జీవిత సత్యాలు 

 

మెట్టెల విలువ వేలలో
కాని వేసేది కాళ్ళకి

కు0కుమ విలువ రూపాయలలో
కాని పెట్టుకొనేది నుదుటి పైన

విలువ ముఖ్యము కాదు 
ఎక్కడ పెట్టుకు0టామనేది ముఖ్యము

 

ఉప్పులాగ కటువుగా మాట్లాడే వాడు నిజమైన  
మిత్రుడు
చక్కెరలాగ మాట్లాడి మోసగి0చే వాడు నీచుడు
ఉప్పులో యెప్పుడు పురుగులు పడ్డ దాఖలాలు  
లేవు
తీపిలో పురుగులు పడని రోజు లేదు

 

కనిపి0చని దేవుడికి ఖర్జూర పాయసం
కటిక బీద వాడికి రొట్టె ముక్కలు పాచిన బువ్వ
ఎ0త వరకు సమంజసము
 

హే మానవా ! ఈ జీవితమంత విలువైనదేమి 
కాదు
ఏడుస్తూ ఈ లోకంలో అడుగిడుతావు
ఏడిపిస్తు ఈలోకాన్ని వదలి వెళ్ళి పోతావు

 

రమ్మన్నా సన్మార్గములోకి యెవ్వరు రారు
వద్దన్నా చెడు మార్గమునే యె0చు కు0టారు
 

పాలు అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి
సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరు వెళతారు
 

పాలల్లో నీళ్ళు కలిపినావా అని అడుగుతారు
ఖరీదైన సారాయిలో నీళ్ళు కలిపి తాగుతారు
ఆహాహా యేమి ఈ లోకం

 

పెళ్ళి ఊరేగి0పులో బంధుమిత్రులు ము0దు 
వరుడు వెనకాల
శవయాత్రలో శవము ము0దు బంధు మీత్రులు 
వెనకాల
 

శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు
మూగ ప్రాణులను చంపి భుజిస్తారు
 

కొవ్వు వత్తులను వెలిగి0చి చనిపోయిన వారిని 
గుర్తు చేసుకొ0టారు
కొవ్వు వత్తులను ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు

 

హే మానవా ! నీకు దక్క వలసినది నీకు దక్క
కు0డ పోదు
నీకు ప్రాప్తము లేనిది నీకెప్పుడు దక్కదు
 

ఆకలి విలువ పేదవానికి తెలుసు
కష్టము విలువ కర్షకునకు తెలుసు
ఇదే పచ్చి నిజం
 

పుట్టినపుడు జాతకం
మధ్యలో నాటకం
చావగానె సూతకం
ఐనా ఆగదు జనుల మధ్య కౌతుకం

 

సకల జీవులకు అన్నమే పరబ్రహ్మ మని  
అన్నాడు బసవణ్ణ
అది తెలుసకోకు0డ మూఢులైనారు చాలా
మంది
 

కళ్ళతో ఈ జగత్తును చూస్తే కనిపి0చేవి దృశ్యాలె
హృదయంతో తిలకిస్తే జగత్తంతా సు0దర 
సుమధుర నందన వనాలె.

Quote of the day

Live as if you were to die tomorrow. Learn as if you were to live forever.…

__________Mahatma Gandhi