Online Puja Services

కాళ్ళ గజ్జ కంకాలమ్మా! ఈ ఆట గుర్తు ఉందా? I

3.128.94.171
అనాదిగా ఆడుతున్న ఆట పాట   
ఈ పాట వెనక ఉన్న సనాతన ధర్మం పలికిన ఆరోగ్య రహస్యం....మీకోసం!
 
కాళ్ళ గజ్జ కంకాలమ్మా!
వేగుల చుక్క వెలగా మొగ్గ !
మొగ్గా కాదు మోదుగ ఆకు !
ఆకూ కాదు నిమ్మలవారి !
వారీ కాదు వావింటాకు !
ఆకు కాదు గుమ్మడి పండు !
కాళ్ళు తీసి కడగాపెట్టు!
 
ఈ పాటలో ఏముందని ఏప్పుడు మనం ఆలోచించివుండం. ఆలోచిస్తే..ఇందులో దాగున్న అద్బుత వైద్య విజ్ఞానం  మనకు అవగాహనవుతుంది!
 
కాళ్ళకు గజ్జివస్తే....కంకోళం(గంగారపాకు) అనే ఆకును నూరిరాయాలి. దానికితగ్గకపోతే తెల్లవారుజామున. లేత వెలగ కాయి గుజ్జురాయాలి. దానికి తగ్గకపోతే మోదుగఆకు నూరిరాయాలి. తగ్గడం ప్రారంబించాక, నిమ్మరసం ను పలచగాచేసి గజ్జి సోకిన కాలిని కడగాలి. అప్పటికి గజ్జి మాడకపోతే వావింటాకు నూరిరాయాలి!! అంతేకాకుండా గుమ్మడిపండుగుజ్జుకూడా  మందుగా పనిచేస్తుంది...
 
ఇలా మన పూర్వీకులు అద్భుతమైన వైద్య విజ్ఞాన రహస్యాలను పాటలరూపంలోను...సామెతల రూపంలోను భద్రపరిచారు  అలాభధ్రపరిచిన విజ్ఞానాన్ని వినోదంలాకాకుండా అంతర్ధుృష్టితో పరిశీలిస్తే.. విజ్ఞానం అవగాహనకు వస్తుంది.  ఆలోచించండి ఆత్మీయులారా  
 
- వాట్సాప్ సేకరణ 
 
 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore