తిరుమల కు సంబంధించిన ప్రశ్నలు..

44.192.47.87
ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా
 
1.తిరుమల గిరికి పూర్వ నామధేయమేమిటి? 
Ans. వరాహపర్వతం. 
 
2. శ్రీవారి ఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? 
Ans. ఉగ్రాణం. 
 
3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?
Ans. నడిమిపడికావాలి. 
 
4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? 
Ans. పరిమళపు అర. 
 
5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?
Ans. పోటు. 
 
6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?
Ans. 30 అడుగులు. 
 
7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?
Ans. అంగప్రదక్షణ. 
 
8. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?
Ans.  మహామణిమండపం. 
 
9. బంగారు వాకిలి దాటాక వచ్చే మండపాన్ని ఏమంటారు?
Ans. కొలువు మండపం. 
 
10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?
Ans. శయన మండపం. 
 
11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?
Ans. అద్దాల మండపం. 
 
12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి? 
Ans. డోలా మండపం. 
 
13. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?
Ans. రంగనాయకుల మండపం. 
 
14. తిరుమల రాయ మండపం లో ఉన్న విగ్రహం ఎవరిది?
Ans. రాజా తొదరమల్లు. 
 
15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?
Ans. బలి పీఠం. 
 
16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?
Ans. కోయిల్ తిరుమంజనం.
 
17. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?
Ans. 4 సార్లు.
 
18. విష్ణుసహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?
Ans. 2 సార్లు. 
 
19. సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?
Ans. 29.
 
20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?
Ans. 7 సార్లు.
 
- K . మునిబాలసుబ్రహ్మణ్యం 
 

Quote of the day

Always aim at complete harmony of thought and word and deed. Always aim at purifying your thoughts and everything will be well.…

__________Mahatma Gandhi