Online Puja Services

రంభ రాయిలా మారిపోవడానికి కారణం ఎవరు ?

3.149.239.110

దేవలోక సౌందర్యరాశి రంభ రాయిలా మారిపోవడానికి కారణం ఎవరు ?
లక్ష్మీ రమణ 

రంభ, ఊర్వశి, మేనక, పుంజికస్థల తదితర అప్సరసలందరూ కూడా అతిలోక సౌందర్యరాశులు . క్షీరసాగర మథనం జరిగినప్పుడు, అందులోనుండి అమృతం ఉద్భవించడానికి ముందుగా బయటికి వచ్చిన ఎన్నో అపూర్వ సంపదలలో అప్సరసలూ  ఉన్నారు .  వీరిని ఇంద్రియాలకు అధిపతి అయిన దేవేంద్రుడు తీసుకున్నాడు . వేదాలలోనూ, పురాణాలలోనూ వీరి ప్రస్తావన, ప్రశస్తి ఉన్నాయి . అటువంటి రంభ రాయిలా మారిపోవడం వెనుక కారణం ఏంటి ?

ఇంద్రియాలపై అదుపుని సాధించడమే తపస్సు. ఇంద్రియాలని నిగ్రహించి, ఎవరు తన నిజమైన అస్తిత్వాన్ని, భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోవాలని ఆరాటపడతాడో, తపిస్తాడో అతను తాపసి. ఆ భగవంతుని సాక్షాత్కారం పొందినవాడు మహాజ్ఞాని. అంతిమమైన గమ్యం మోక్షమేనని దానికోసమే తన తపస్సని భావించి ఆవిధంగా ప్రయత్నం చేసినవాడు మహర్షి. ఇంతాతతంగానికి ముందూ, అసలు ఆ తపస్సు చేసేవారు ఇంద్రియాలని జయించారా లేదా ? అని పరీక్షించేవారెవరూ లేరా ? ఉన్నారు ఆయనే ఇంద్రుడు . 

ఇది అంతరార్థం. ఇక పురాణాల్లో కథగా చెప్పాలంటే, ఎవరైనా తపస్సంపన్నుడవుతున్నాడు అంటే, తన ఇంద్రపదవిని ఆతను ఆక్రమిస్తాడేమో అనే అనుమానం ఇంద్రునిది. అందుకే వారిని ప్రలోభపెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు . అందులో అప్సరసప్రయోగం కూడా ఒకటి . 

విశ్వామిత్రుడు రాజర్షి . ఆయన తపస్సు చేస్తుంటే, ఒకసారి మేనకని పంపించాడు ఇంద్రుడు. విశ్వామిత్రుణ్ణి తన అందచందాలతో ఆకట్టుకోవడంలో మేనక సఫలీకృతమయ్యింది . ఆ తర్వాత వారిద్దరికీ, శకుంతల కూడా పుట్టింది. అప్పుడుకానీ విశ్వామిత్రుడికి తానూ ఎంతటి తప్పుచేశాడో అర్థం కాలేదు. కళ్ళుతెరుచుకున్నాక , మేనకా, తనదారిన దేవలోకానికి వెళ్ళిపోయింది . విస్వామిత్రుడు యథావిధిగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు . శకుంతల ఏమయ్యింది అనేది వేరే కథ . 

ఆ తర్వాత, మళ్ళీ ఇంద్రుడు రంభని విశ్వామిత్రుడి మీదకి ప్రయోగించాడు . మేనక లాగానే రంభ కూడా తన అందచందాలతో , ఆది, పాడి విశ్వామిత్రుని తపస్సుని భగ్నం చేయాలని చూస్తుంది.  దానికి మన్మధుడు కూడా తోడుగా నిలుస్తాడు . అయినా , మేనకా విషయంలో జరిగిన తప్పుని మళ్ళీ పునరావృతం కానీయడు విశ్వామిత్రుడు . కానీ తపస్సు మాత్రం భగ్నమవుతుంది. దాంతో కోపోద్రిక్తుడైన ఆ మహర్షి, ‘ ఇంతటి దుస్సాహసానికి వడిగట్టిన పాపానికి, పదేళ్ళపాటు రాయిలా పడి ఉండమని’ శపిస్తాడు .

అలా రాయిగా మారిన రంభ, పార్వతీ పరమేశ్వరులని ప్రార్ధించి, శాపమిమోచనాన్ని పొందింది. అధీకథ . 

Quote of the day

In the sky, there is no distinction of east and west; people create distinctions out of their own minds and then believe them to be true.…

__________Gautam Buddha