Online Puja Services

గాడిద చేత వేదాలు పలికించిన జ్ఞానేశ్వరమహరాజ్ కథ విన్నారా ?

18.223.172.252

గాడిద చేత వేదాలు పలికించిన జ్ఞానేశ్వరమహరాజ్ కథ విన్నారా ?

భారత దేశాన్ని వేదభూమిగా పిలుస్తారు. సృష్టి , దైవం , ధర్మం , ఖగోళం, సైన్స్ కి సంబంధించిన ఎన్నో అద్భుత విశేషాలు మన భారతీయ ధర్మ గ్రంధాలలో నిక్షిప్తమయ్యాయి . యోగసాధన చేసిన యోగులు, ఆ అద్భుత సంపదని మనకి అందించారు . ఎన్నో సైన్స్ కి అందని అద్భుతాల్ని చేతల్లో చేసి చూపించి ఔరా అనిపించారు . అటువంటి వారిలో ఒకరు శ్రీ జ్ఞానేశ్వరమహరాజ్. మహారాష్ట్రం లో జన్మించిన అనన్య భక్తి సామ్రాట్టులలో  మొట్టమొదట చెప్పుకోదగిన మహానుభావుడు జ్ఞానదేవుడు. 

సుమారు 740 సంవత్సరాల క్రిందటి కథ ఇది.  సంత్ జ్ఞానేశ్వర్ పైఠాన్ ప్రాంతం లోని గోదావరి నది ఒడ్డున ‘’ఆపే గాం ‘’లో ఉండేవారు . ఆయన గురువు అన్న గారైన నివృత్తి నాధుడే! జ్ఞాన దేవుడు పేరుకి తగినట్టే మహాజ్ఞాని . చిన్నతనం లోనే వేద శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యశించారు. 15 ఏళ్లకే ఆయన భగవద్గీతకు మరాఠీ భాషలో రాసిన వ్యాఖ్యానం ‘ భావార్థదీపిక’ - ‘జ్ఞానేశ్వరి గీత’ గా పేరుపొందింది . 

  జ్ఞానదేవునికి ఒక తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు. తమ్ముడు సోపాన దేవుడు ,చెల్లెలు ముక్తా బాయి .వీరందరూ సార్థక నామధేయులు. పేరుకి తగినట్టే జీవనాన్ని సాగించి ముక్తి కాంతను చేరుకున్నారు. ఆరోజు దీపావళి పండుగ.  ముక్తాబాయి భక్ష్యాలు చేసి అన్నలకి విందు చేయాలి అనుకుంది . కానీ భక్ష్యాలు కాల్చేందుకు పెనం లేదు. అంగడికి వెళ్లి తీసుకొద్దాం అనుకుంటే , ఈ కుటుంబం అంటే పడని అసూయాపరుడైన విసోబా అంగడిలో వీరికి ఎలాంటి సరుకూ అమ్మకూడదని ఆంక్షలు విధించాడు . దాంతో తల్లడిల్లుతున్న ముక్తాబాయి బాధని చూసి, విషయం తెలుసుకున్న జ్ఞానదేవుడు తన వీపునే కాలే పెనంగా మార్చేశారు.  చెల్లెలు తనవీపుమీద చేసిన భక్ష్యాలని అన్నదమ్ములు ఆనందంగా ఆరగించారు . విసోబా కి తగిన గుణపాఠం చెప్పారు . ఇలాంటి విచిత్ర లీలలు ఆయన జీవనంలో అడుగడుగునా కనిపిస్తాయి .    

         ఒక సారి జ్ఞాన దేవుడు ఒక పండిత సభలో మాట్లాడుతున్నాడు. సభకు బయట ఒకరైతు తన దున్నపోతుని ‘జ్ఞానా, త్వరగానడువ్’  అని అదిలిస్తున్నాడు.  అదివిన్న ఓ తుంటరి పండితుడు వేళాకోళం గా ’ఆ దున్న పోతు పేరు కూడా జ్ఞాన దేవుడే! దానికీ మీకూ పెద్దగా భేదం లేదనుకుంటా’అని ఎద్దేవా చేశాడు . ‘నిజమే ,దానికి నాకు ఎలాంటి భేదము లేదు .దానిలోనూ ,నాలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే కదా! అందుకే దానిని కొట్టిన దెబ్బలు నా వీపుమీద కూడా పడ్డాయి. కావాలంటే చూడండి’ అని చొక్కా తీసి చూపారు . జ్ఞాన దేవుని వీపు మీద కొరడా దెబ్బలు కన్పింఛి ,రక్తం కారటం చూసి అందరూ చకితులయ్యారు .  

   అయినా ఆయనని ఇంకా పరీక్షించాలనుకున్న మరో పండితుడు, జ్ఞాన దేవుడితో ‘గాడిద తో వేదం పలికించమని’ పరీక్ష పెట్టారు .అప్పుడాయన దాని తలమీద చేతులు ఉంచారు .వెంటనే ఆ గార్ధభం  నాలుగు వేదాలను స్వరం ,ఉచ్చారణ లతో సహా స్పష్టంగా  వల్లించడం ప్రారంభించింది.  దాంతో జ్ఞానదేవుని ప్రజ్ఞ అక్కడివారికి అర్థమయ్యింది. ఆయన ఆధ్యాత్మిక ఉన్నతికి అక్కడివారందరూ శిరస్సు వంచి ప్రణామాలర్పించారు . 

ఇంకోసారి జ్ఞాన దేవుడుని ఒక బ్రాహ్మణుడు తన ఇంటికి ఆబ్దీకానికి అంటే తద్దినానికి ఆహ్వానిస్తే  వెళ్లారు. అక్కడ ఆ బ్రాహ్మణుని పితృదేవతలను మంత్ర పూర్వకంగా ఆహ్వానించారు జ్ఞానదేవుడు. అందరు ససాక్షాత్కారమై వచ్చి, పిత్రువధీని సంతృప్తి కరం గా పొందారు. అంతటి యోగం ,సిద్ధి ఆ మహానుభావుడికి ఉండేవి .

           చాంగ్ దేవుడు అనే యోగి, యోగశక్తులని పొందామన్న అహంకారంతో విర్రవీగుతూ, ఒక పెద్ద పులి పై స్వారీ చేస్తూ ,త్రాచు పామును కొరడా గా చేత్తో పట్టుకొని జ్ఞానేశ్వరుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు జ్ఞాన దేవుడు విరిగిన గోడపై సోదరులతో కూర్చుని ఉన్నాడు. ఆ మొండి గోడ ఉన్నట్టుండి కదలటం ప్రారంభించింది. చిన్న పిల్లవాడిగా ఉన్న జ్ఞానదేవుని యోగ ఉన్నతిని, ఆయన శాంత శీలతను చూసి ఆ యోగి సిగ్గు పడి  ,జ్ఞానేశ్వరుని పాదాలు పట్ట్టు కొని జ్ఞాన భిక్ష ప్రసాదించమని వేడు కొన్నాడు. దానికి ఆయన తన సోదరి ముక్తా బాయిని ఆశ్రయించామని ఆనతినిచ్చారు. ఆమె చిన్న బాలికే అప్పుడు .అంత చిన్న పిల్ల దగ్గర ,ఏమీ తెలీని పసి పిల్ల వద్ద  ఎలా నేర్చు కొంటాను అని భావించినా ఆ తర్వాత ,ఆమె పెట్టిన పరీక్షలకు తట్టుకొని ,ఆమె వద్దశుశ్రూష చేసి జ్ఞానాన్ని పొందాడు చాంగ్ దేవుడు. 

                   ‘’సంత్  జ్ఞానేశ్వర్ ‘’గా అందరి చేత అపిలువ బడే జ్ఞాన దేవుడు  భక్త శిఖా మణి గా ,,జ్ఞానేశ్వర మహా రాజు గా ప్రసిద్ధుడు .పూర్ణ యోగి గా జ్ఞానేశ్వరుడిని భావిస్తారు .నిత్యం పాండురంగ విభుని తో మాట్లాడుతూ ,ఆయన తో తిరుగుతూ ఉండేవాడు .పూనా దగ్గర ’ఆలంది’లో ఆయన చూపిన అద్భుతాలన్నీ ఇవాళ మనకు చిత్రాలుగా ప్రత్యక్షం అవుతాయి . వాటిని చూసి ఆనందించడం ఒక మధురానుభవం .’సచ్చిదానందుడు’అనే గృహస్తు చని పోతే ,అతన్ని బ్రతికించిన ప్రాణ దాత జ్ఞానేశ్వరుడు .అతడు ఆ తర్వాత ‘’సచ్చిదానంద బాబా ‘గా జ్ఞాన దేవుని శిష్యుడై ,ఆయన భావ వ్యాప్తికి తోడ్పడ్డాడు. 

జ్ఞాన దేవుడు జీవించింద.ఖచ్చితం గా 21 సంవత్స రాల 3నెలల 5రోజులు మాత్రమే .క్రీ.శ.1296మార్గశిర బహుళ త్రయోదశి గురువారం జ్ఞాన దేవుని జ్ఞానజ్యోతి అఖండ చైతన్య జ్యోతి లో విలీనం అయింది .జ్ఞానదేవులకు తన అన్న నివృత్తి నాధులు అంటే ప్రేమ ,భక్తీ ,గౌరవం ఎక్కువ .సాంప్రదాయాలకు అతీతం గా ఆయన రాసిన ’జ్ఞానేశ్వరి గీత ‘ఇప్పటికీ శిరోధార్యమే .

-లక్ష్మీ రమణ .

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore