Online Puja Services

గర్వభంగం

18.117.196.217

గర్వభంగం...

ఒక ఊరిలో ఒక *శిల్పి* ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు.

ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు. బొమ్మ చాలా *అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది* .ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకు వెళ్తున్నాడు.

దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి, నిజంగా దేవతలా భావించి ఆ విగ్రహానికి దణ్ణం పెట్టుకొంటూ వెళ్తున్నారు.

అయితే ఇదంతా చూస్తున్న గాడిదకి మరొక రకంగా అర్థం చేసుకొని, అందరూ తనని చూసి, ..తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది. అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేస్తూ వుండడంతో గాడిదకి గర్వం బాగా పెరగసాగింది.

'ఇంత మందికి నేను పెద్ద మనిషిలా, గౌరమివ్వాలనిపించేలా. కనిపిస్తున్నానా ! అని ఆశ్చర్యపోయింది.

 దానిక తల పొగరు నషాళాన్ని తాకి 'ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు'అనుకుంది.

కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి. అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది. గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు.

గాడిద ఆగిపోయిందేంటబ్బా అని గాడిదతో పాటు విగ్రహన్ని పట్టు కొని వస్తున్న ఆ శిల్పికి అర్థంకాక ఆ  గాడిదను ఎంత అదిలించినా అది కదలలేదు.

ఊరి వాళ్ళంతా నాకు గౌరవమిస్తుంటే 'నేను గొప్పదాన్నే కదా! మరి గొప్పవాళ్ళు.... యజమానుల మాటని ఎందుకు వినాలి, ' అనుకుని అక్కడి నుండి ఆ గాడిద  శిల్పి అదలింపును లెక్క చేయక అక్కడ నుంచి   అది కదలలేదు.

చేసేది లేక  ఆ శిల్పికి విసుగు వచ్చి, దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు.

" ఆ! పోతే పోయాడు" అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద. కొద్ది సేపటి తర్వాత కళ్ళు తెరచి చూస్తే, ఒక్కరు కూడా తన దగ్గర లేరు.
అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను, గాడిద వీపుపై ఈడ్చి కర్రతో కొట్టాడు. ఆ దెబ్బ గట్టిగా తగలడంతో గాడిదకి జ్ఞానోదయం అయింది.

"ఇంతసేపు అందరూ దేవతకు దండాలు పెడతూవుంటే.., అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే, నా వీపు పగిలిపోయేలా ఉంది, అనుకొంటూ బుద్ధి తెచ్చుకొని తన యజమాని దగ్గరకు పరుగెత్తిందా గాడిద.

నీతి :-
*గొప్పవారి పక్కన ఉన్నప్పుడు దక్కే మర్యాదలు శాశ్వతమని విర్రవీగడం అవివేకం.*

- నాగార్జున పాణ్యం 

 

 

 

 

 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore