Online Puja Services

రాణి దుర్గావతి

3.17.162.247
ఇప్పుడు నేను చెప్పబోయేది అక్బర్ ను మూడు సార్లు ఘోరంగా ఓడించిన మన భారతీయ వీరనారి రాణి దుర్గావతి గురించి ఎంతమందికి తెలుసు????
 
మన పాఠ్యపుస్తకాలలో మరియు చదువుకు సంబంధించిన ఏ పుస్తకంలోనూ తన గురించి ఉండదు...
 
మనం చాలా వరకు అక్బర్ గొప్పతనం గురించి చదువుకున్నాం అతను ఒక రాణా ప్రతాప్ సింగ్ చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలో ఓడిపోలేదని చదువుకున్నాం.. కానీ తను ఒక వీరనారి చేతిలో ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు ఓడిపోయాడు గొప్ప వీరనారి ఎవరో కాదు రాణి దుర్గావతి.....
 
5 అక్టోబర్ 1524 AD రాజపుట్ చందాలవ్ కిరట్ రాయ్ వంశానికి చెందిన కుటుంబంలో జన్మించారు. ఆమె ఒక వీర సైనికురాలే కాదు, మంచి వ్యక్తిత్వం మరియు రాజనీతి తెలిసిన స్త్రీ... ఆమెకు కళల పైన కూడా మంచి అవగాహన ఉండేది ఆమె కట్టించిన వాటిలో కలింజర్ పోర్ట్ మరియు ఖజరహో శిల్పాలు ఆమె హయంలో కట్టిన మరియు చెక్కబడినవి. 
 
ఆమే ఒక రాజ కుటుంబంలో పుట్టినప్పటికీ రాజకీయ సింహాసనం అంత సులభంగా దక్కలేదు ఆమే కుటుంబం ఎప్పటినుండో ముస్లిం రాజు మహమ్మద్ ఘజిని కి ఎదురునిలిచి పోరాడుతూ వస్తున్న కుటుంబం.
 
ఆమెకు చిన్నప్పటినుండే యుద్ధ విద్యలలో ప్రావీణ్యం ఉండేది, రాజ్పుట్ వంశం గొప్పతనం మరియు పరాక్రమ చరిత్ర పైన మంచి అవగాహన ఉండటం వల్ల ఆమె అన్ని విద్యలలో ప్రవీణురాలుగా ఉండేది. 
 
1542 గోండ్ వంశానికి చెందిన దళప షహ అనే వ్యక్తిని పెళ్లాడింది 1545 వీర నారాయన్ అనే బాలుడికి జన్మనిచ్చింది. 
 
వీర నారాయన్ పుట్టిన కొన్ని సంవత్సరాలకి దుర్గావతి భర్త చనిపోయారు సింహాసనం అధిరోహించడానికి మరియు రాజ్యపాలన చేయడానికి తన కుమారుడికి సరైన వయసు కాదు మరియు చిన్న వయసు అవడంవల్ల రాణి దుర్గావతి సింహాసనం అధిరోహించి పరిపాలించ సాగింది. 
 
ఆమె సింహాసనం అధిరోహించిన మొదటి రోజునుండే ఆమె చతురత మరియు ఆమె రాజనీతి మరియు రాజ్య పరిరక్షణ దక్షతతో పాలించసాగింది తన రాజ్యాన్ని చండ్రాగ్రహ ప్రాంతంనుండి కొండ ప్రాంతాలైన సింగగ్రహ అనే ప్రాంతానికి మార్చేసింది. 
 
ఒక స్త్రీ రాజ్యాన్ని పాలిస్తుంది ఆమెకు ఏమి తెలుసు అని చిన్నచూపుతో మరియు అహంకారముతో బజ్ బహదూర్ ఎలాగైనాసరే రాజ్యాన్ని ఆక్రమించి దుర్గావతి ని ఓడించాలని #పన్నాగం పన్ని ముందస్తు హెచ్చరిక ఏది ఇవ్వకుండానే తన సైన్యంతో రాణి దుర్గావతి రాజ్యం పైన విరుచుకుపడ్డాడు హఠాత్ పరిణామాన్ని గ్రహించలేని సైనికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు . 
 
అప్పటికే యుద్ధవిద్యల్లో ఆరితేరిన దుర్గావతి తన చతురతతో బజ్ బహదూర్ సైన్యాన్ని వీరోచితంగా పోరాడి కంగు తినిపించింది తన సైన్యం మొత్తం ఓడిపోవడం మరియు యుద్ధసామగ్రి మొత్తం అయిపోవడం గమనించిన బజ్ బహదూర్ తన ఓటమిని అంగీకరించి దుర్గావతి కి క్షమాపణ  చెప్పి తన రాజ్యాన్ని దుర్గావతి కి అప్పగించారు. 
 
మొగల్ సుబేదార్ అబ్దుల్ మజీద్ ఖాన్ అనే అక్బర్ సైన్యాధ్యక్షుడు అక్బర్తో పాటు మహా రాణి దుర్గావతి రాజ్యం పైన దండెత్తా లని నిర్ణయించుకొని ఒక పథకం తో దాడి చేయబోయాడు. 
 
అక్బర్ గురించి తెలియని మహారాణి దుర్గావతి ఒక చండీలా ఒక అపరకాళిలా అక్బర్ సైన్యం పైన విరుచుకుపడి చిత్తు చిత్తుగా ఓడించి అక్బర్ కి మొదటిసారి క్షమాభిక్ష పెట్టింది. 
 
తన ఓటమిని జీర్ణించుకోలేని అక్బర్ ఎలాగైనసరే రాణి దుర్గావతి ని ఓడించాలని ఇంతకంటే సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు.  అమ్మకు సహాయంగా తన కొడుకు కూడా చేరడంతో  అపర చండీలా ఓటమెరుగని మహారాణి కదనరంగంలో తను ఎంతో నిరూపించుకుంటూ అక్బర్ సైన్యానికి ముక్కు ముప్పుతిప్పలు పెట్టుకుంటూ మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది.  దొరికిన వాడిని  దొరికినట్టు వదిలిపెట్టకుండా చంపుకుంటూ అక్బర్ గుండెల్లో తన పేరు చెప్తేనే దడ పుట్టేలా రెండోసారి కూడా కాదు, మూడోసారి కూడా యుద్ధం చేసి అక్బర్ సైన్యాన్ని ఓడించి క్షమాభిక్ష పెట్టిన మహా ధీరురాలు  మరియు యోధురాలు. 
 
అలా డైరెక్టుగా రాణి దుర్గావతి తో యుద్ధం చేయడం తగదని,  రాణి దుర్గావతి కి శత్రువులైన కొందరి రాజులతో అక్బర్ చేతులు కలిపి అకారణంగా రాణి దుర్గావతి రాజ్యం పైన ఒక్కసారిగా దండెత్తాడు. 
 
తన వీరత్వాన్ని తన ధైర్యాన్ని మరియు తన యుద్ధ విద్యల్ని నిరూపించుకుంటా నాలుగోసారి యుద్ధం చేయసాగింది.  కానీ ఈసారి కాలం కలిసిరాక తన సైన్యం సరిపోక మరియు తనదగ్గరున్న సామాగ్రి అయిపోయి తల వంచే స్థితికి రాణి సైన్యం వచ్చింది. 
 
ఓటమి అంటే ఎరగని ఆ మహారాణి అక్బర్కి తలవంచని మరియు లొంగిపోనని తన మంత్రులు ఎంతమంది చెప్పినా ఓడిపోతానని తెలిసికూడా యుద్ధం చేయసాగింది మరియు కదన రంగంలోకి దిగింది.... ఆఖరికి అక్బర్ కి తలవంచే స్థితికి వచ్చేసరికి తన దగ్గర ఉన్న తన కత్తితోనే పొడుచుకుని వీరమరణం పొందింది.
 
ఇన్నిరోజులు పరాయి దేశ సంకలు నాకే ప్రభుత్వాల వల్ల మన భారతదేశం గొప్ప రాణుల గురించి మనం తెలుసుకోలేకపోయాము.  ఎప్పుడు చూడు అక్బర్ ది గ్రేట్ అని పుస్తకంలో మరియు అక్బర్ గొప్పవాడు అని పుస్తకాలు చదివాము కానీ
అక్బర్ ని ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించి మూడుసార్లు ఓడించిన ఈ గొప్ప వీరవనిత గురించి నేను ఇప్పటివరకు ఏ బుక్కులో చదవలేదు... మన చరిత్ర ఎంతలా కనుమరుగయ్యే స్థాయికి దిగజారిందో చెప్పటానికి ఇది ఒక మంచి ఉదాహరణ....
 
మన భారతదేశం కన్న గొప్ప వీరనారి కి శతకోటి వందనాలు మరియు దశ కోటి పాదాభివందనాలు. 
 
జయహో మహారాణి దుర్గావతి కి జై
 
- RSS రాజు 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya