Online Puja Services

మార్గశిరం , ధనుర్మాస కాలంలో ఈ ఆరాధనలు శ్రేష్టం .

18.117.196.217

మార్గశిరం , ధనుర్మాస కాలంలో ఈ ఆరాధనలు శ్రేష్టం . 
- లక్ష్మీరమణ 

సంవత్సరంలోని పన్నెండు మాసాలకీ సంబంధించిన ప్రత్యేకతలని తెలియజేస్తూ 12 పురాణాలు రచించారు వ్యాస భగవానులు . వాటిల్లో ఒక్కొక్క మాసానిదీ ఒక్కొక్క ప్రత్యేకత . కార్తీకమాసంలో శివకేశవ ఆరాధనలో, దీపారాధనలతో, ధాత్రీదేవీ ఆరాధనతో గడిపాము. ఆ తర్వాత వచ్చే మార్గ శిరమాసం కేశవునికి అత్యంత ప్రియమైనది . ఈ మాసములో విష్ణు నామస్మరణం, విష్ణవాలయ సందర్శనం, సూర్యారాధనం విశిష్టంగా చెప్పబడ్డాయి . మనకున్న చాంద్రమానం ప్రకారం మార్గశీర్షమాసంలో ఉన్నాము . అదే  సూర్యమానం ప్రకారం చూసినప్పుడు సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది .అది ఈ మార్గశీర్షంలోనే ఆరంభం కావడం ఒక ప్రత్యేకత. ఈ ధనుర్మాసమంతా కూడా విష్ణువని ఆరాధించినవారికి కోరికలన్నీ తీరి మోక్షము ప్రాప్తిస్తుంది . 

అటు చాంద్రమానము, ఇటు సూర్యమానమూ కూడా విశ్వారాధనని ప్రభోదిస్తున్న పుణ్యకాలం ఇది . ఈ పుణ్యకాలంలో ఎన్నో విశేషాలున్నాయి . వాటిని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం .  మార్గశీర్షము  ప్రత్యేకముగా  అసురసంహార శక్తులకు లేదా దేవతలకి బలాన్ని చేకూర్చే మాసం . అందువల్ల సృష్టి రక్షకుడైన విష్ణువు శ్రీకృష్ణుడిగా ఉపదేశించిన భగవద్గీతలో ‘ మాసానాం మార్గశీర్షోహం’ అని అంటారు. మాసాలలో మార్గశీర్షాన్ని నేనే అని చెప్పుకున్నారు . ఈ మాసమంతా కూడా భగవద్గీతా పారాయణ చేయడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం  ఉత్తమమైన ఫలితాలనిస్తాయి  .   

మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు కార్తికేయుడు పూరిగా రూపాన్ని పొందారని స్కాంద పురాణం,  చెబుతోంది. మార్గశీర్ష పాడ్యమి  నాడు శరణవంలో ప్రవేశించిన స్వామి , దినదిన ప్రవర్థమానమవుతూ కేవలం ఆరురోజుల్లో పూర్ణమైన రూపు తీసుకున్నారని  మహాభారతం చెబుతోంది .  కాబట్టి ఈ మాసమంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధనకు ప్రాధాన్యమివ్వాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి . 

ఇక మార్గశీర్షమాసంలో సూర్యారాధకి విశేషమైన ప్రాధాన్యత ఉన్నది . సూర్యుడే ప్రత్యక్ష నారాయణుడు . ఈ మాసంలోని ఆదివారాలలో సూర్యుణ్ణి ఆరాధించడం వలన ఆరోగ్యం కలుగుతుంది . సూర్యునికి బెల్లంతో చేసిన పొంగలిని నివేదించడం వలన సూర్యానుగ్రహం కలుగుతుంది . కేవలం మూడు తులసీ దళాలతో మార్గశీర్షమాసంలో సూర్యారాధన చేయడం మరింత విశేషమైన ఫలాన్నిస్తుంది . 

అదే విధంగా ధనూరాశిలో సూర్యుడు ప్రవేశించడంతో ఆరంభమయిన ధనుర్మాసంలో కూడా సూర్యుణ్ణి తులసీ దళాలతో పూజించి , క్షీరాన్నం నివేదించడం , ఆతర్వాత ఆ ప్రసాదాన్ని గ్రహించడం వలన ఆరోగ్యం చక్కబడుతుంది . విశేషించి ధనుర్మాసం, మార్గశిరమాసం దేవతలకి బ్రహ్మముహూర్త కాలం వంటివి గనుక , ఈ కాలంలో మనం మన కాలమానం ప్రకారం , సూర్యోదయానికి పూర్వమే లేచి దైవారాధన చేయడం వలన గొప్ప ఫలితాలు, శుభాలు కలుగుతాయి.  అమ్మవారు గోదాదావి తన పాశురాలలో ఈ విధంగా ఉదయాన్నే లేచి, ఆ పరమాత్ముణ్ణి ఆరాధించమని బోధించారు . అదే పరంధాముని చేరుకునే మార్గమని చెప్పారు . కాబట్టి ఈ మార్గశిరంలో ఆ మర్గంలో  నడిచి పురుషోత్తముని పొందుదాం .   

శుభం . సర్వేజనా సుఖినోభవంతు .  

#margasiram #dhanurmasam

Tags: margasira masam, dhanurmasam, vishnu, aradhana, pooja

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore