Online Puja Services

ధారీదేవి ఆలయం

3.147.73.35
ఇప్పుడూ చెబుతున్న ఆలయం దేవభూమిలో Kalyasaur..#Dharidevi temple ..uttarakhand
ఆమె ఉత్తరాఖండ్ యొక్క సంరక్షక దేవతగా పరిగణించబడుతుంది మరియు చార్ ధామ్ యొక్క రక్షకురాలిగా గౌరవించబడుతుంది.

(#దేవిదర్శన్ యాత్రలో -9 లో ఈ అమ్మవారు ఒకరు)

ఈ గుడిలో దేవీ రూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం నడి వయస్కురాలిగా, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్- శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. దీనికి కూడా నిదర్శనాలు ఉన్నాయి. ధారీదేవి ఆశీసులతోనే అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది.

ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు.

#ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే ధారీదేవి. భక్తితో కొలిచినవారిని అనుగ్రహించే దేవత. ధిక్కరించిన వారికి అంతే కీడు జరుగుతుంది. క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు.ఆ రాజు చేసిన అపచారంతో కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలితీసుకుంది. దేవి మహత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని తోకముడిచాడు. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది.

గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయం ఉంది. గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠ్‌లో ఉంది. ఈ క్షేత్రంలో దేవీ రూపం మారుతుంది. ఉదయం పూట బాలికగానూ, మధ్యాహ్నం నడి వయస్కురాలిగానూ, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది. #

కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈపీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది. ధారి దేవి ఆలయం శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ వెళ్లే మార్గంలో వస్తుంది. కాబట్టి మీరు కేదార్‌నాథ్ లేదా బద్రీనాథ్ వెళ్ళినప్పుడల్లా ఈ ఆలయాన్ని చూడవచ్చు. శ్రీనగర్ నుండి దాని దూరం పదిహేను కిలోమీటర్లు, రుద్రప్రయాగ్ నుండి ఇరవై కిలోమీటర్లు. ఈ స్థలం పేరు కలిసౌర్.

- శ్రీనివాస గుప్తా వనమా

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore