సంతానం వల్ల ఇబ్బందులుంటే ఈ మంత్రం జపించండి.

3.226.241.176
"భూవరాహాయ ధరణీ ఉద్ధారకాయ నమః" భూవరాహ స్వామి మూల మంత్రం
 
ఫలితం:- ఈ భూ వరాహ స్వామి మూల మంత్రం చాలా శక్తి వంత మైన వరాహ మూల మంత్రం, 
 
భూమికి సంబంధించి న సమస్యలు తగాదాలు మటుకే కాదు భూమిని కొనాలి అనుకునే వారికి ఈ మంత్రం నిత్యం జపించడం వల్ల చాలా త్వరగా సమస్య పరిస్కారం అవుతుంది. కొందరికి కుటుంబ లో పిల్లలే పెద్ద సమస్యగా ఉంటారు అంటే చదవకుండా , చెడు సావాసాలు, తగాదాలు తేవడం, చెడు అలవాట్లు, తల్లితండ్రులను ఎదిరించడం, బాధించడం.. వారి భవిష్యత్ కు ఒక మంచి మార్గం దొరకక పోవడం వంటివి , తల్లిదండ్రుల కు చాలా బాధించే సమస్యలు అటువంటి తల్లి తండ్రులు, వరాహ స్స్వామికి భూదేవికి నమస్కరించి.. వారి సంతానం లో ఎవరి వల్ల ఇబ్బందిగా ఉందొ వారి పేరుతో ఈ మూల మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి, పరమ శాంత స్వరూపిణి అయిన భూదేవి..భూ రక్షకుడు దుష్ట శిక్షకుడు మహా ఉగ్ర రూపంలో చెడుని సంహరించే వరాహ స్వామి మీ పిల్లలను వారి సంతానంగా భావించి రక్షిస్తారు.. 
 
ఆస్థి కొనాలి అనుకునే వారు కూడా ఈ మంత్రం 108 సార్లు రోజు జపించడం వల్ల ఆస్థి కొనుగోలు సమయంలో మీకు మోసం జరగదు కొన్న ఆస్థి కూడా స్థిరంగా నిలిచి అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఈ విషయం మీకు వరాహ స్వామి గుడి ముందే కూర్చుని చెప్తున్నాను.. దీనికి ఆయనే సాక్ష్యం .నమ్మకంతో జపం చేయండి (శ్రావణ శుద్ధ త్రయోదశి వరాహ జయంతి).
 
నరకాసురుడు వారి కుమారుడు.   వారి సంతానం నే దారిలో పెట్టని వారు మా సంతానానికి మేలు చేస్తారా అని అడగవచ్చు, నిజమే ఆకలితో ఉన్నవారికి ఆకలి బాధ అర్దమ్ అవుతుంది అటువంటి బిడ్డలు ఉంటే ఆ తల్లితండ్రుల బాధ ఎలా ఉంటుందో వారికన్నా ఎవరూ బాగా అర్థం చేసుకోలేరు.. తర్వాత భూదేవి సత్యభామ రూపంలో ఆమె కుమారుడిని ఆమె సంహరిస్తుంది అందుకే తల్లిగా ఆమె చాలా తల్లడిల్లి పోతుంది అందుకే ఏ తల్లికి గర్భ శోకం కలగకుండా బిడ్డలు తప్పుదోవ పట్టకుండా ఆమె బాధ్యత తీసుకుంటుంది రక్షిస్తుంది.. 
 
చిన్న పుల్లలు కింద పడ్డపుడు వారికి దెబ్బ తగలదు ఎన్నో సార్లు కింద పడుతుంది అయిన పసి పిల్లలకు దెబ్బ తగలదు ఆ సమయంలో భూదేవి చేయి అడ్డుపెడుతుంది అందుకె అయ్యో పడ్డాడు అని అనకూడదు అని పెద్దలు అనేవారు అది సత్యం.. తర్వాత వారు తల్లి చేయి విడిచి నడుస్తారు.. ఎప్పుడైదే మళ్ళీ చైదాటి పోయే పరిస్థితి వస్తుందో అప్పుడు అటువంటి పిల్లల బాధ్యత భూ వరాహ స్వామి వార్లకే అప్పగించాలి, వారే రక్షిస్తారు. 
 
- భానుమతి అక్కిశెట్టి 
 

Quote of the day

Ignorance is always afraid of change.…

__________Jawaharlal Nehru