Online Puja Services

బగళా ముఖీ దేవి సాధన

3.145.88.130
రోజు బగళాముఖీ సాధన చేసే వారి ఎదురుగా ఎవరూ వాదించలేరు.  ఎదురునిలవలేరు. 
 
అతి శక్తివంతమైన బగళాముఖీ స్త్రోత్రం 41 రోజులు నిష్ఠ తో రోజుకి 3 సార్లు జపిస్తే 
ఎంతటి కార్యాన్ని అయిన అవలీలగా జరిపిస్తుంది,అని ఎందరికో నిరూపణ అయినటువంటి 
బగళాముఖీ దేవి స్త్రోత్రం
 
 
స్త్రోత్రం కావున గురూపదేశం అవసరం లేదు
 
బగళా ముఖీ సాధన చేసే వారి ఎదురుగా ఎవరైనా
పశీకృతులౌతారు, అగ్నిచల్ల బడతాడు, కుపితుడు శాంతుడౌతాడు, దుర్జనుడు సుజనుడౌతాడు, మహావేగి నెమ్మదిస్తాడు, గర్వితుడు వినయవంతుడౌతాడు, సర్వజ్ఞుడు.కూడా జడుడౌతాడు. బగలోపాసకుని ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదు.
 
కృతయుగంలో దారుణమైన తుఫాను వచ్చింది. దీనికి బాధపడిన విష్ణుదేవుడు సౌరాష్ట్రంలోని హరిదా సరస్సు దగ్గర ఛ్యాసం చేశారు, మహా త్రిపుర సుందరి ఆయనకు ఒక రూపంలో ప్రత్యక్షమైంది. మంగళవారం వీర రాతి చతుర్దశి అర్ధరాత్రి ఆమె అవతరించి లోక శాంతిని ప్రసాదించింది. ఆమెయే బగళాముఖి అనే పేర ఉపాస్యదేవతయైంది.
 
బగళాముఖి వంటివి ఈ శాబర విద్య లో కొన్ని కనిపిస్తాయి.  స్తంభన విద్యలలో కార్తవీర్యార్జున మంత్రం కూడా ఒకటి. రాజ చోర సర్ప వృశ్చిక సింహ వ్యాఘ వరాహ సమస్త గ్రహ చోరాది హస్తపాదాది వక్షములను స్తంభింప చేయునని ఈ మంత్రంలో ఉన్నది. ప్రాచీన కాలంలో దీపం వెలిగించి కార్త వీర్యార్జున అని మూడుసార్లు అంటే ఆయింటికి దొంగల బాధ ఉండదట. ఏ దొంగయైనా రాత్రి వేళ ఆ ఇంట్లో అడుగు పెట్టాలని వస్తే కార్చు కదలక ఆగి పోతవని దత్తాత్రేయ తంత్రంలో ఉన్నది. కర్నూలు జిల్లా మంత్ర వేత్త పసుమాముల సుబ్బరాయ శాస్త్రి గారు ఏడుకోట్ల దత్తాత్రేయ మంత్రం చేసి అంగ విద్య కార్తవీర్యార్జున సాధన కూడా చేసి మంత్ర సిద్ది పొందారు. ఆయన ఒక రోజు రాత్రి అడవి మార్గంలో వస్తూ ఉంటే దొంగలు ఎదుర్కొన్నారు. ఆయన నిర్భయంగా కార్తవీర్యార్జున మంత్రాన్ని జపిస్తూ ముందుకు సాగి పోయాయి, ఒక్కదొంగ కూడా కదలలేదు మెదలలేదు.
అంతటి శక్తి మంత్రానికి మాత్రమే ఉంది
 
వారాహి అంటే వరాహముఖం కలిగిన దేవత, నారసింహీ అంటే సింహ ముఖం కలిగిన దేవత. అలాగే బగళాముఖి అంటే బగళ యొక్క ముఖము కల్గిన దేవత. ఆ బగ అన్న శబ్దము నిఘంటువులలో ఎక్కడా లేదు. దేవత యొక్క ఆకారం , చిత్రాలలోనూ ధ్యాన శ్లోకాలలోనూ మానవముఖంగానే చెప్పబడినది. దీనికి రెండు రకాలు అర్థాలు పండితులు చెబుతున్నారు. “బకంలాతి ఇతి బకళా" అదే భగల అయినది.
 
అనగా కొంగ ముఖము కలిగినది అని అర్థం. మరొక అర్ధం కశ్యప పశ్యక అయినట్లు పైన హింస సింహ అయినట్లు కళ్ళం అన్న అర్థం కల్గిన వల్ల శబ్దం వర్ణ వ్యత్యయం చేత వగళ అయిందని ఈ దేవత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. రుద్రయామళంలోని ఆమె స్తుతిని చూడండి. రభేద: అన్న సూత్రంచేత బగ అయిందని కొందరి అభిప్రాయము,
 
బంగారు రంగు శరీరకాంతితో, పసుపు రంగు వస్త్రాన్ని ధరించి, పచ్చని చంపకపుష్పాల మాల ధరించి, నాలుగు చేతులలో గద, పాశము, వజ్రము శత్రువు యొక్క నాలుక పక్షాని, చంద్రాలంకృతమైన కిరీటంలో, మూడు కన్నులతో బంగారు సింహాసను సద కూర్చుని ఉండే శత్రు స్తంభినియైన దేవత ఈదేవనక్కును స్తంభింప చేయటం మాత్రమేగాక, వాక్కుకు ప్రసాదించే గుణం కూడా జాతి లం" అని కూడా కొందరు అన్వయం చెప్పారు. చేతిలో శత్రువు నాలుకను పట్టుకొని గదతో మోడుతుందని ఆమెను ఋషులు వర్ణించారు 
 
 
బగళాముఖీస్తోత్రమ్ ॥
 
శ్రీగణేశాయ నమః ।
చలత్కనకకుణ్డలోల్లసితచారుగణ్డస్థలీం
లసత్కనకచమ్పకద్యుతిమదిన్దుబిమ్బాననామ్ ।
గదాహతవిపక్షకాం కలితలోలజిహ్వాంచలాం
స్మరామి బగలాముఖీం విముఖవాఙ్మనస్స్తమ్భినీమ్ ॥ ౧॥
 
పీయూషోదధిమధ్యచారువిలద్రక్తోత్పలే మణ్డపే
సత్సింహాసనమౌలిపాతితరిపుం ప్రేతాసనాధ్యాసినీమ్ ।
స్వర్ణాభాం కరపీడితారిరసనాం భ్రామ్యద్గదాం విభ్రతీమిత్థం
ధ్యాయతి యాన్తి తస్య సహసా సద్యోఽథ సర్వాపదః ॥ ౨॥
 
దేవి త్వచ్చరణామ్బుజార్చనకృతే యః పీతపుష్పాఞ్జలీన్భక్త్యా
వామకరే నిధాయ చ మనుం మన్త్రీ మనోజ్ఞాక్షరమ్ ।
పీఠధ్యానపరోఽథ కుమ్భకవశాద్బీజం స్మరేత్పార్థివం
తస్యామిత్రముఖస్య వాచి హృదయే జాడ్యం భవేత్తత్క్షణాత్ ॥ ౩॥
 
వాదీ మూకతి రఙ్కతి క్షితిపతిర్వైశ్వానరః శీతతి క్రోధీ
శామ్యతి దుర్జనః సుజనతి క్షిప్రానుగః ఖఞ్జతి ।
గర్వీ ఖర్వతి సర్వవిచ్చ జడతి త్వన్మన్త్రిణా యన్త్రితః
శ్రీర్నిత్యే బగలాముఖి ప్రతిదినం కల్యాణి తుభ్యం నమః ॥ ౪॥
 
మన్త్రస్తావదలం విపక్షదలనే స్తోత్రం పవిత్రం చ తే
యన్త్రం వాదినియన్త్రణం త్రిజగతాం జైత్రం చ చిత్రం చ తే ।
మాతః శ్రీబగలేతి నామ లలితం యస్యాస్తి జన్తోర్ముఖే
త్వన్నామగ్రహణేన సంసది ముఖే స్తమ్భో భవేద్వాదినామ్ ॥ ౫॥
 
దుష్టస్తమ్భనముగ్రవిఘ్నశమనం దారిద్ర్యవిద్రావణం
భూభృత్సన్దమనం చలన్మృగదృశాం చేతఃసమాకర్షణమ్ ।
సౌభాగ్యైకనికేతనం సమదృశః కారుణ్యపూర్ణేక్షణమ్
మృత్యోర్మారణమావిరస్తు పురతో మాతస్త్వదీయం వపుః ॥ ౬॥
 
మాతర్భఞ్జయ మద్విపక్షవదనం జిహ్వాం చ సఙ్కీలయ
బ్రాహ్మీం ముద్రయ దైత్యదేవధిషణాముగ్రాం గతిం స్తంభయ ।
శత్రూంశ్చూర్ణయ దేవి తీక్ష్ణగదయా గౌరాఙ్గి పీతామ్బరే
విఘ్నౌఘం బగలే హర ప్రణమతాం కారుణ్యపూర్ణేక్షణే ॥ ౭॥
 
మాతర్భైరవి భద్రకాలి విజయే వారాహి విశ్వాశ్రయే
శ్రీవిద్యే సమయే మహేశి బగలే కామేశి వామే రమే ।
మాతఙ్గి త్రిపురే పరాత్పరతరే స్వర్గాపవర్గప్రదే
దాసోఽహం శరణాగతః కరుణయా విశ్వేశ్వరి త్రాహి మామ్ ॥ ౮॥
 
సంరమ్భే చౌరసఙ్ఘే ప్రహరణసమయే బన్ధనే వ్యాధిమధ్యే
విద్యావాదే వివాదే ప్రకుపితనృపతౌ దివ్యకాలే నిశాయామ్ ।
వశ్యే వా స్తమ్భనే వా రిపువధసమయే నిర్జనే వా వనే వా
గచ్ఛంస్తిష్ఠంస్త్రికాలం యది పఠతి శివం ప్రాప్నుయాదాశు ధీరః ॥ ౯॥
 
త్వం విద్యా పరమా త్రిలోకజననీ విఘ్నౌఘసంఛేదినీ
యోషిత్కర్షణకారిణీ జనమనఃసమ్మోహసన్దాయినీ ।
స్తమ్భోత్సారణకారిణీ పశుమనఃసమ్మోహసన్దాయినీ
జిహ్వాకీలనభైరవీ విజయతే బ్రహ్మాదిమన్త్రో యథా ॥ ౧౦॥
 
విద్యా లక్ష్మీర్నిత్యసౌభాగ్యమాయుః పుత్రైః పౌత్రైః సర్వసామ్రాజ్యసిద్ధిః ।
మానో భోగో వశ్యమారోగ్యసౌఖ్యం ప్రాప్తం తత్తద్భూతలేఽస్మిన్నరేణ ॥ ౧౧॥
 
త్వత్కృతే జపసన్నాహం గదితం పరమేశ్వరి ।
దుష్టానాం నిగ్రహార్థాయ తద్గృహాణ నమోఽస్తు తే ॥ ౧౨॥
 
పీతామ్బరాం చ ద్విభుజాం త్రినేత్రాం గాత్రకోమలామ్ ।
శిలాముద్గరహస్తాం చ స్మరే తాం బగలాముఖీమ్ ॥ ౧౩॥
 
బ్రహ్మాస్త్రమితి విఖ్యాతం త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
గురుభక్తాయ దాతవ్యం న దేయం యస్య కస్యచిత్ ॥ ౧౪॥
 
నిత్యం స్తోత్రమిదం పవిత్రమిహ యో దేవ్యాః పఠత్యాదరాద్ధృత్వా
యన్త్రమిదం తథైవ సమరే బాహౌ కరే వా గలే ।
రాజానోఽప్యరయో మదాన్ధకరిణః సర్పా మృగేన్ద్రాదికాస్తే
వై యాన్తి విమోహితా రిపుగణా లక్ష్మీః స్థిరా సిద్ధయః ॥ ౧౫॥
 
॥ ఇతి శ్రీరుద్రయామలే తన్త్రే శ్రీబగలాముఖీస్తోత్రం సమాప్తమ్ ॥
 

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba