Online Puja Services

ఈ భీముడు మీకు పరిచయమేనా ?

18.224.0.25

ఈ భీముడు మీకు పరిచయమేనా ?
సేకరణ 

అతినిద్రా లోలుడు చదువు లేని మూర్ఖుడు, తిండిపోతు, స్థూలకాయుడు, కోపిష్టి వంటి విశేషణాలతో సినీకవులు భీముణ్ణి చిత్రీకరించారు. “నిదురవోతుంటివో లేక బెదరి పల్కుచుంటివో కాక తొల్లింటి భీమసేనుడవే కావో…” అనే కృష్ణావతారంలోని పద్యాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి.

కానీ భీముడు మన సినీ కవులకు అందని ఒక మహత్తర శక్తి. 

పంచ ప్రాణాలు అనే మాట తరచూ వింటాం మనం ఆ పంచ ప్రాణాలలో ముఖ్యమైనది ప్రాణ వాయువు దీని అధిష్టానం ముఖ్య ప్రాణుడు. ఈయనే 99 వ ఋజువు వాయువు (ఋజు గణం గురించి కింది సందేశం చూడండి). ఈ ముఖ్య ప్రాణుడి అవతారమే భీముడు. త్రేతాయుగంలో హనుమగా, ద్వాపర యుగంలో భీముడుగా, కలియుగంలో మధ్వాచార్యగా అవతరించే ముఖ్య ప్రాణుడు జీవులలో శ్వాసరూపంలో ఉంటూ విష్ణు జీవులకు తత్వాన్ని ఉపదేశిస్తూనే ఉన్నాడు.

అలాగే సమస్త దేవతలలో ముఖ్య ప్రాణుడు ఉంటాడు, శివుని తో సహా పంచ పాండవులలో భీముడు జ్ఞానానికి ప్రతీక. కృష్ణుని తరువాత మహాభారతం లో భీముడే ముఖ్యుడు.

త్రిగుణాతీతుడు కనుకనే బాల్యంలో కుంతి ఒడి నుంచి జారి శతశృంగ పర్వతంపై పడి పోగా అది వ్రక్కలౌతుంది. భీముడు ఎప్పుడూ కృష్ణుని మాట జవదాటలేదు (జీవోత్తముడు సర్వోత్తముని మాట జవదాటడు). ఉద్యోగపర్వంలో తనని గూర్చి చెప్పమనగా భీముడు తన బలాన్ని వివరించిన పిదప శ్రీ కృష్ణుడు వెంటనే “భీముని బలం అతను చెప్పిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ” అని చెబుతాడు.

మహాభారత యుద్ధం ప్రారంభం లో చేసిన బీముడి సింహనాదానికి గుర్రాలు, ఏనుగులు దిక్కులు పట్టి పరుగులు తీసాయి. భారత యుద్ధంలో తొలుత, చివర యుద్ధం చేసింది భీముడే. లక్క ఇంటికి నిప్పు పెట్టడం 6 నెలలు అయినా కుదరలేదు ఎందుకంటే భీముడు ఆ 6 నెలలలో రేయింబవళ్ళు కాపలా కాసాడు కనుక. ఇది అతని శక్తికి ఒక మచ్చు తునక.

మహాభారత యుద్ధం లో 11 అక్షౌహిణుల సైన్యంలో 6 అక్షౌహిణులు భీముడే చంపేసాడు(అంటే కౌరవ పక్ష సైన్యంలో సగానికి పైన సైన్యాన్ని ఒక్క భీమసేనుల వారే సంహరించారు) .

 యుద్ధానంతరం ధర్మజుని వైరాగ్యాన్ని కాదని రాజ్య పాలన వైపు మరల్చింది భీముడే. మనకు మరి ద్రౌపది స్వయంవరానికి ఎందుకు భీముడు వెళ్ళలేదు అనే సందేహం వస్తుంది. దానికి పురాణాలను సమన్వయము చేసి మధ్వులు వారి మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఇలా వివరించారు: భీముడు సంహరించిన విష్ణు భక్తుడు బాహ్లికుడే. అదీ బాహ్లికుడి అభ్యర్ధన మేరకే. 

భీముడు సంహరించిన ప్రతీ యోధుడూ దుర్యోధనుని రూపంలో ఉన్న కలి అనుచరులనే. అలాగే కృష్ణుని (విష్ణు వైరులైన) శత్రువులైన జరాసంధుని, కీచకుణ్ణి, కిమీరుణ్ణి, హిడింబాసురుని, బకుని, మణిమంతుని, దుశ్శాసనుణ్ణి భీముడే సంహరించాడు.

పాండవులలో రెండవ వాడైనా, మొదట వివాహం జరిగింది భీమునికే హిడింబితో. రెండవ వానిగా పుట్టడానికి కారణం కృష్ణుడు కూడా బలరాముని తమ్మునిగా పుట్టాడుగా. సర్వోత్తముని అనుసరించే వాడే జీవోత్తముడు! భీముడే కౌరవ సోదరులన్దరినీ మట్టుపెట్టాడు.

దుశ్శాసనుని రొమ్ము చీల్చి నెత్తురు తన దోసిలిలో ఉంచుకొని మన్యు సూక్తం చదివి మరీ నారసింహునికి నివేదన చెస్తాడు.

పరమశివుడు అంబ కు ఒక మహిమాన్విత మాలను ఇచ్చి ఇది ధరించిన వీరుడు భీష్ముని చంపగలదు అని వరమిస్తాడు. భూమికి నలు చెరగులా ఉన్న రాజులను అర్ధిస్తుంది ఈ మాల స్వీకరించి భీష్ముని వధించమని అందుకు ఎవరూ సాహసం చేయకపోగా చివరికి ద్రుపద రాజ మందిర ద్వారానికి దానిని తగిలించి తన జీవితాన్ని చాలిస్తుంది. ఇతః పూర్వం శిఖండి ఒకసారి ధరించి విడచినది ఈ మాల. ద్రుపదుడు ఈ మాలను భద్రపరచి తన కూతురైన ద్రౌపదికి స్వయంవరం సమయంలో ఇచ్చి మత్స్య యంత్రచ్చేదన చేసిన వీరుని మెడలో వేసి వరించమని చెబుతాడు. విష్ణు భక్తుడైన భీష్ముని జీవోత్తముడైన భీముడు భాగవత ధర్మం ప్రకారం వధించ లేడు, కనుక ఘటనాఘటన సమర్ధుడైన శ్రీ కృష్ణుడు అర్జునునిచే ఈ పని చేయించాడు. తద్వారా పరమశివుని వరాన్నీ గౌరవించాడు – యద్యదాచరతి శ్రేష్ఠ: మహాభారతం లో ద్రౌపది చెబుతుంది భీమసేనుడు అర్జునిని కంటే చెప్పలేనంత బలవంతుడు అని! పైగా గాండీవానికి నారి సంధించ గలవారు కేవలం ముగ్గురే అని వారు కృష్ణుడు, భీముడు, అర్జునుడు అని. ఇది భీముని ఎనలేని జీవోత్తమం.

శ్రీకృష్ణార్పణమస్తు!!

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore