Online Puja Services

వైశాఖమాసంలో అనంతపుణ్యాన్నిచ్చే కార్యక్రమాలు ఇవీ !

18.116.36.192

వైశాఖమాసంలో అనంతపుణ్యాన్నిచ్చే కార్యక్రమాలు ఇవీ !
- లక్ష్మి రమణ 

వైశాఖ మాసంలో చేసే జల, అన్న దానాలు, ఎండ నుండీ ఉపశమనాన్నిచ్చే గొడుగు, చెప్పులు, విసినికర్ర దానం చేయడం గొప్ప  ఉత్తమమైన ఫలితాలని ఇస్తాయని వైశాఖ పురాణంలోని గత అధ్యాయాలలో నారద మహర్షి అంబరీష మహారాజుకి వివరించారు. ఈమాసములో చేయదగినటువంటి పుణ్య కార్యక్రమములు ఇంకా ఏమున్నాయో వివరించగలరని నారదుని వేడుకోగా ఆయన తిరిగి వైశాఖ పురాణంలోని మూడవ అధ్యాయాన్ని ఇలా చెప్పసాగారు .  

ఓ మహారాజా ! ఈ పుణ్యప్రదమైన వైశాఖ మాసములో  చల్లని గాలి తగులుతూ సుఖనిద్రని కలిగించే పర్యాంకము అంటే మంచాన్ని ఒక బ్రాహ్మణునికి లేదా  గృహస్థునికి దానమిచ్చిన వారు ధర్మసాధనకు హేతువైన శరీరములో వ్యాధి బాధలు లేకుండా జీవిస్తారు. ఎటువంటి తాపత్రయాలు ఆది వ్యాధులు లేకుండా సుఖంగా జీవిస్తారు. ఇహ లోక సుఖాలను అనుభవిస్తారు .  పాపముల నుండి ముక్తిని పొందుతారు.  అంతేకాకుండా మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలరు. ఆ గ్రహీత ఆ పర్యంకము పైన కేవలం  కూర్చున్నా కూడా,  దాత తెలిసి తెలియక చేసినటువంటి సర్వపాపములు కూడా అగ్ని చేత కర్పూరము దహించబడినట్లు నశిస్తాయి. 

ఓ మహారాజా,  స్నాన మాత్రము చేతనే పుణ్యఫలాలు అనుగ్రహించే వైశాఖ మాసములో పరుపుని లేదా వస్త్రాన్ని లేదా దుప్పటిని దానం చేయగలిగిన వారు చక్రవర్తి సమానులై తమ వంశమువారితో పాటు శారీరిక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధిని పొందుతారు. వంశాభివృద్ధి,  ఆయురారోగ్యములు ,  కీర్తి ప్రతిష్టలను పొందుతారు.  నూరు తరాల వరకు అటువంటి దాత కులములో ధర్మ హీనుడే జన్మించడు.  చివరికి ఆ దాత ముక్తిని పొందగలడు. 

ఈ రెండింటితో పాటు దిండును కూడా దానమిచ్చినట్లయితే సుఖ నిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇవ్వడం చేత ఆ దాత అందరికీ అన్ని విధాల ఉపకారము చేయువాడై ప్రతి జన్మలోను సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపురాయణుడై అన్నిటా విజయాన్ని పొందుతాడు.  ఏడు జన్మల వరకు మహా వైభవముగా గడిపి,  చివరికి మొక్తిని పొందగలడు.  తనతో పాటు ఏడు తరాల వారికి ముక్తిని కలిగించగలడు.  

ఇవన్నీ డబ్బుగలవారికి వర్తిస్తాయి అని బాధ అవసారంలేదు , శక్తి కొలది తుంగ, గడ్డి  మొదలైన వాటి చేత నిర్మితమైన చాపను దానమిచ్చినట్లయితే మహా పుణ్యం దక్కుతుంది . శ్రీమహావిష్ణువు సంప్రీతిని చెంది తానే స్వయంగా దానిపైన సయనిస్తాడు. 

ఓ రాజా! వైశాఖ మాసములో కంబళి దానం చేసిన వారికి అపమృత్యువు తొలగిపోయి చిరకాలము నిశ్చంతగా సుఖ జీవనము కలవానిగా చేయగలదు.  ఎండ చేత పీడింపబడే వారికి వస్త్రాన్ని దానం చేసినట్లయితే పరిపూర్ణ ఆయుర్దాయమున పొంది చివరికి ముక్తిని పొందగలరు.  

లోపల ఉన్న తాపాన్ని పోగొట్టే కర్పూరాన్ని దానమించినట్లయితే ముక్తి ఆనందము కలుగుతుంది.  దుఃఖములన్నీ నశిస్తాయి.  ఉత్తమ బ్రాహ్మణునికి పుష్పములని దానం ఇచ్చినట్లయితే సర్వజనులను వశపరచుకున్న మహారాజై చిరకాలము సుఖిస్తారు.  

చర్మమునకు యముకలకు గల సంతాపమును పోగొట్టు చందనాన్ని దానమిచ్చినట్లయితే సంసార తాపత్రయము నశించి సుఖము లభిస్తుంది.  దుఃఖములు, పాపములు లేకుండా జీవించి చివరికి ముక్తిని పొందగలడు. కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను దానం ఇచ్చినట్లయితే, ఎటువంటి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందగలడు.  పద్మమాలను కానీ, అడవి మల్లెల మాలలు కానీ దానమిచ్చినట్లయితే చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తిని పొందగలడు.  వైశాఖమాసంలో మొగలి, మల్లెపువ్వులు దానం ఇచ్చినట్లయితే మధుసూదనని అనుగ్రహము వలన సుఖ భోగములను పొంది ముక్తిని పొందగలడు.  పోక చెక్కలను, సుగంధ ద్రవ్యాలను, కొబ్బరికాయలను దానమిచ్చినట్లయితే ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి, వేద పండితుడై, ధనవంతుడై ఉండి అనంతరం  ముక్తిని పొందగలడు.  

ఇక బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపాన్ని కట్టించి ఇచ్చిన వారి  పుణ్యము ఇంతని చెప్పడానికి మాటలకు అందనిది.  నీడనిచ్చే మండపము, నీడలోనున్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీటిని నిర్మించి బాటసారులకు ప్రజలకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులు కాగలరు. మార్గములో తోటలు, చెరువు, నూతి, మండపము వీటిని నిర్మింప చేసిన వారికి పుత్రుడు లేకున్నా ధర్మలోపము అవుతుందనే  భయము లేదు.  సత్య శాస్త్ర శ్రావణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యం, జలదానము, అన్నదానము, అశ్వర్థ రూప రావి చెట్టును నాటటము, పుత్రునికి జన్మనివ్వడం ఈ  ఏడు సప్త సంతానములని వేదవేత్తలు చెబుతున్నారు.  వందలకొద్దీ ధర్మ కార్యాలను చేసినప్పటికీ సంతానము లేనివానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండా పోంతుందనే బాధ అవసరం లేదు . పైన చెప్పిన ఏడు సంతానములలో యధాశక్తిగా దేనినైనా ఒకదానినైనా చేసి పుణ్యలోకాములను పొందవచ్చు. 

 ఓ రాజా ! ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరము మొదలైన సుగంధ ద్రవ్యములు గల తాంబూలం బ్రాహ్మణునికి దానమిచ్చినట్లయితే వారి పాపములన్నీ కూడా తొలగిపోతాయి.  తాంబూలధాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందవచ్చును. ఇది  నిశ్చయము.  రోగి అయిన వాడు తాంబూల దానం ఇచ్చినట్లయితే రోగ విముక్తుడౌతాడు.  ఆరోగ్యము గలవాడు తాంబూల దానం ఇచ్చినట్లయితే ముక్తిని పొందుతాడు. 

ఈ మాసములో తాపహారిణి అయిన మజ్జిగను దానమిచ్చినవాడు విద్యావంతుడు, ధనవంతుడు అవుతాడు.  కాబట్టి వేసవికాలంలో మజ్జిగ దానము తప్పకుండా చేయదగినది . వేసవి కాలంలో ప్రయాణం చేసి అలసి వచ్చిన వానికి మజ్జిగను ఇచ్చినట్లయితే, మరింత పుణ్యము కలుగుతుంది.  నిమ్మ పండ్ల రసము, ఉప్పు కలిపిన మజ్జిగ దప్పికగలవానికి  హితకరముగా ఉంటాయి.  

వైశాఖ మాసంలో దప్పిక తీరడానికి బాటసారులకు, బ్రాహ్మణులకు పెరుగు కుండలను ఇచ్చినట్లయితే కలుగు పుణ్యము ఎంతటిదో మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు . దీనివల్ల  అనంతపుణ్యము లభిస్తుంది.  లక్ష్మీ వల్లభుడు అయిన మధుసూదనునికి ప్రియమైన వైశాఖమాసములో శ్రేష్టమైన బియ్యాన్ని దానమిచ్చిన వారు పూర్ణ ఆయుర్దాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు.  తేజో రూపమైనటువంటి ఆవు నెయ్యిని దానమిచ్చిన వారు అశ్వమేధ యాగము చేసినటువంటి పుణ్యాన్ని పొంది, తుదకు విష్ణు పదాన్ని చేరకోగలరు.  విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసంలో బెల్లమును, దోసకాయను దానమిచ్చిన వారు సర్వపాపములను పోగొట్టుకుని శ్వేత ద్వీపములో నివసిస్తారు. 

 పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలములో చెరుకు గడను బ్రాహ్మణునికి దానమిచ్చినట్లయితే అతనికి కలుగు పుణ్యము అనంతము.  సాయంకాలములో ఎండకు అలసిన బ్రాహ్మణునికి పానకమును దానమిచ్చినట్లయితే చేసిన పాపములన్నీ తొలగిపోతాయి, విష్ణు లోకము ప్రాప్తిస్తుంది. పళ్ళని, పానకాన్ని దానమిచ్చినట్లయితే దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందాన్ని పొందుతారు.  దాతకు అతని పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి.  వైశాఖమాసంలో పానకముతో పాటు మామిడిపళ్ళని దానమిచ్చినట్లయితే సర్వపాపములు హరిస్తాయి.  పుణ్య లోకముల ప్రాప్తి కలుగుతుంది.  చైత్రమాసములో అమావాస్యలో పానకము నిండిన కుండని దానమిచ్చినట్లయితే గయాక్షేత్రములో నూరుమార్లు పితృశ్రార్ధము చేసినంత పుణ్యము కలుగుతుంది. 

ఇదే  పానకములో  కస్తూరి కర్పూరము వట్టివేళ్ళు మొదలైన సుగంధ ద్రవ్యములను కలిపి చైత్రమాసంలోని అమావాస్యలో నాడు దానమిచ్చినట్లయితే వివిధ రీతులలో చేయవలసిన స్వార్ధములను నిర్వర్తించిన పుణ్యము కలుగుతుందని నారదుడు అంబరీష మహారాజుకు వివరించారు.  

 వైశాఖ పురాణం మూడవ అధ్యాయం సమాప్తం . 

 

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha