Online Puja Services

జబ్బులు రాకుండా

3.137.178.133
అమృత వాక్కులు 
జబ్బులు రాకుండా 
 
జబ్బులు రావడానికి కారణాలేంటని research team అన్వేషిస్తే ఆశ్చర్యకరమైన ఈ క్రింది విషయాలు బహిర్గతమయ్యాయి. 
 
1) మనసుపై ఒత్తిడివల్ల gas troubles ,stomach related జబ్బులు వస్తున్నాయట. 
2)అతి ఆవేశం వల్ల blood pressure అంటే BP వస్తున్నదట. 
3) అతి ఆలోచన వల్ల cholestral వస్తున్నదట. 
4) మొండితనం వల్ల sugar అంటే diabeties వస్తున్నదట. 
5) మనసుకు ప్రశాంతత లేక heart attacks మరియు heart related జబ్బులు వస్తున్నాయట. 
 
దీని వల్ల తెలిసిందేమిటంటే మనకు జబ్బులు మనసుకు సంబంధించి వస్తున్నవి. అసలు మనసును పూర్తిగా కట్టడిచేయడం ఎవరి వశం కాదు కొంత వరకు మాత్రమే అదుపు చేసుకోవచ్చు. ఈ క్రిందివి చేసి మనసును కొంతవరకు స్థిమితంగా వుంచుకోవచ్చు జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. 
 
1) భగవత్తీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే "ప్రయత్నేన తు కౌంతేయ, వైరాగ్యేన గుహ్యతే” అంటే మనము ప్రయత్నంతో మరియు వైరాగ్యంతో మనసును కొంతవరకు వశపరుచుకోవచ్చని. వైరాగ్యమంటే ఈ ప్రపంచములోనే వుంటూ సంసారం చేస్తూ మన వ్యామోహం తామరాకుమీద నీటి బొట్టులా వుండాలని అంటే నీటి బొట్టు తామరాకుపై వున్నా తామరాకును తాకదు అలానే మనము సంసారం చేస్తున్నా మన వ్యామోహం అంటే అంటనట్టుగా వుండాలని. అలా వుంటే అదే వైరాగ్యం క్రిందికి వస్తుంది.  దీనివల్ల మనసు స్థిరంగా వుంటుంది. 
2) మనసుకు వైద్యం ఆధ్యాత్మికం వైపు మనసు మరల్చడం. 
3) యోగాతో మనసు స్థిర పరచడం. 
4) భగవంతుని  నామ స్మరణతో మనసును కుదుటపరుచుకోవడం. 
5) సత్గ్రంధ  అంటే రామాయణం, భాగవతం, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు లాంటివి పఠించడం. 
6) ఎప్పుడు ఎదో ఒక పనిచేస్తూ మనసును కాళీగా ఉండనివ్వకుండ చేయడం . 
7) meditations మనసును స్థిరపరచడం. 
8) భక్తి సంగీతం విని మనసుకు ప్రశాంతత చేకూర్చడం. 
9) ప్రవచనాలు వింటూ ఆధ్యాత్మిక జ్ఞానంలో మనసుకు ఆధ్యాత్మిక చింతన కలిగించడం. 
10) నిత్య వ్యాయామం చేస్తూ శరీరాన్ని సక్రమస్థితిలో వుంచుకొంటూ మనసుకు హాయిని కలిగిస్తే మనసు కుదుటపడుతుంది. 
 
ఇలా ఎన్నో విధాలుగా మనసును అదుపులో పెట్టుకొని మన మాట వినేలా మలచుకోవడం వల్ల మనసు చంచలత్వం తగ్గించి చాలా వరకు జబ్బులు రాకుండా నియంత్రించవచ్చు.
 
- బిజ్జా నాగభూషణం 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha