Online Puja Services

ఆదర్శ జీవనం

3.144.253.161
అమృత వాక్కులు
 
ఆదర్శ జీవనం 
 
భౌతికంగా ఎంతగా ఎదిగినా, మానసికంగా ఎదగకపోతే అని ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. మానసికంగా ఉన్నతిని సాధించాలంటే ఆధ్యాత్మికత వయిపు అడుగులు వేయక తప్పదు. ఆధ్యాత్మిక విచారణలో “నేనెవరు, ఎందుకు పుట్టాను, నేనేమి సాధించాలి, దేనిలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది?" అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి. అన్ని ఆధ్యాత్మిక మార్గాలు భగవంతుడి దగ్గరకే చేరుతాయి. మనిషి భగవంతుడికి అనేక రూపాలను కల్పించుకొని ఉపాసన చేస్తున్నాడు. ఉపాసన నల్ల తన మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుచున్నాడు. మన శరీరంలోని అన్ని ఇంద్రియాలు మనసుతోనే పనిచేస్తాయి. కనుక మనసును గొప్ప భావనలకు, ఆలోచనలకు వినియోగించాలి. అన్ని వైపుల నుంచి వచ్చే మంగళకర భావనలను మనిషి మనసుతో స్వీకరించాలని వేదం చెబుతోంది.

కనుక అన్ని దారులు మంచివే. ఏదారిలో వెళ్లినా, అనుకున్న గమ్యాన్ని చేరడమే కదా కావలసింది? దారులు కాదు గమ్యమే ముఖ్యం అన్నది జీవితసత్యం. శరీరమంతా దేవతలకు నిలయం. నీ చేతులకు అధిదేవత ఇంద్రుడు, కన్నులకు సూర్యుడు, ముక్కుకు అశ్వినీ దేవతలు, మనసుకు చంద్రుడు, శరీరమంతా దేవతలు నెలకొని ఉన్నారు. దేవుడు ప్రపంచమంతా నిండి ఉన్నాడని మహాత్ములు ఏనాడో చెప్పారు. దైవత్వాన్ని పరిపూర్ణనంగా అర్థం చేసుకున్న ప్రతిభక్తుడూ మహాత్ముడౌతాడు. తన చుట్టూ ఉన్న సమాజం బావుండాలని, ఎప్పుడూ లోకకళ్యాణాన్ని సంకల్పించడం మహాత్ముల గుణం. “అన్ని ప్రాణుల పైనా దయ, ప్రియంగా మధురంగా సంభాషించడం, జీవులందరికి మంచి కలగచేయడంలో శ్రద్ధ, భగవంతుడిపై భక్తి” ఇవే ఆదర్శ జీవనానికి గీటురాళ్ళు .
 
- బిజ్జా నాగభూషణం 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha