మాట్లాడటం ఒక కళ

3.236.15.142
అమృత వాక్కులు
 
మాట్లాడటం ఒక కళ 
 
 జీవితంలో క్రమశిక్షణ, సమయ పాలన వుంటే మనిషి ఏదయినా సాధించగలడు. పనిలో నుంచే సంతోషాన్ని వెతుక్కోవాలి, ప్రతి ఒక్కరు ఆనందాన్ని స్వతహాగా సృష్టించుకోవాలి.
 ఆలోచించకుండా మాట్లాడడం, గురి చూడకుండా బాణం వేయడం వంటిది. “తాను ఏమి మాట్లాడాలో తెలిసినవాడు, తెలివయినవాడు, తాను ఏమి మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు, వివేకవంతుడు.” అన్నారు స్వామి వివేకానంద. ఎవరయితే మాటలవల్ల, చేతలవల్ల ఇతరులకు భాద కలిగిచకుండా వుంటారో వారే ఉత్తములు.

ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు 
మొదలు పెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలు చాలా పదునయినవి కనుక జాగత్తగా వాడాలి, బలమయినవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదయినవి కనుక పొదుపుగా వాడాలి. అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి. మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది. శత్రువుల్ని తయారుచేస్తుంది. మనిషికి భావవ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏమి మాటలాడవనేదానికన్నా, ఏలా మాటలాడవనేదాన్ని బట్టి భావప్రసారణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా వుంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది.
 
- బిజ్జా నాగభూషణం 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore