Online Puja Services

మనము చేసే పాపాలు

13.58.39.23
అమృత వాక్కులు 
మనము చేసే పాపాలు 
 
మనము చేసే పాపాలు మూడింటితో చేస్తాము. 
1) కాయికా (శరీరంతో), 
2) వాచికా (మాటతో), 
3) మానసిక (మనసుతో) 
 
1) కాయికా (శరీరంతో) - ఎదుటివారిని కొట్టడం, గాయపరచడం, హింసించడం శారీరకంగా పరస్త్రీ పొందుకోరడం ఇవి కాయిక పాపములు. 
 
2) వాచిక (మాటతో) - ఎదుటివారిని తిట్టడం, నిందించడం, అనగూడని మాటలనడం, దూషిచడం, చెడు మాటలనడం ఇవి వాచిక పాపములు. 
 
3) మానసిక (మనసుతో) - ఎదుటివారి మనసును గాయపరచడం, మనసులో ఎదుటివారి గురుంచి చెడుగా ఆలోచించడం, చెడు పనులకు మనసును పురికొల్పడం, ఇవి మానసిక పాపములు. 
 
మనము చేసే పాపాలు ఈ మూడింటితో చేయకుండ నిగ్రహంతో నివారించే శక్తి ప్రతి మానవుడిలో వుంటుంది. మనలోని అట్టి శక్తిని మేలుకొలిపి ఈ పాపాల కూపం నుండి బయటపడడానికి మానవుడు ప్రయత్నించాలి.
 
- బిజ్జ నాగభూషణం 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha