Online Puja Services

మనోబలం

3.17.79.59
అమృత వాక్కులు 
మనోబలం 
 
మనసే అన్నింటికన్నా బలీయమైనది. స్థిరచిత్తం కలిగిన బలవంతుడు ఎలాంటి కార్యానైనా సాధించగలడు. మనోబలం మనిషికి సంకల్పాన్ని కలిగిస్తుంది. మనోబలం కలవాన్ని మనిషిని మనిషిగా మారుస్తుంది. మనోబలం కలవారు మౌనంగా, గంభీరంగా వుంటారు. నిరంతరం కార్యనిర్వహణలో నిమగ్నమై వుంటారు. మనోబలం వున్నా బాగా శ్రమించి పనిచేస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. మనిషి కూడా మంచి ఆలోచనలతో, పట్టుదలతో కృషి చేయాలి. ఎందరో శాస్త్రవేత్తలు, నాయకులు శారీరిక వైకల్యాలను అధిగమించి మనోబలంతో మానవాళికి సేవ చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మనిషి సేవాతత్పరతతో ముందుకు సాగి శాశ్వత కీర్తి పొందాలి.

ఎవరు కాలం కంటే ముందు పరుగులు తీయగలరో, ఎవరు సంకల్పంతో కాల పరిధుల్ని, అవధుల్ని అధిగమించగలరో వారే విజేతలు. పరిమిత జీవిత కాలంలో అపరిమిత కృషితో అద్భుత ఫలితాలు సొంతం చేసుకున్నవారే కాలాతీతవ్యక్తులు. వారే శాస్త్రజ్ఞులు, సంస్కర్తలు, దేశభక్తులు, త్యాగమూర్తులు, దేశరక్షణలో ప్రాణత్యాగాలు చేసే పరమ యోధులు. మన కృషి తీవ్రతను బట్టి గమ్యం సమీపమో, సుదూరమో నిర్ణయమవుతుంది. సమీప గమ్యమే మన లక్ష్యమైనపుడు సంకల్ప బలం దాన్ని తప్పకుండా సుసాధ్యం చేస్తుంది.

- బిజ్జ నాగభూషణం 

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha