Online Puja Services

అన్నం గురించి 4 గొప్ప మాటలు

3.144.104.29

*'అన్నం'* *గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు.. 

 

1. ఆకలిగొన్నవాడికి ' దేవుడు ' కనపడేది అన్నం రూపంలోనే ! ( మహాత్మా గాంధీ ) .  

2. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే ! ( జంధ్యాలగారు ) .

3. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం ! ( విశ్వనాధ సత్యనారాయణ గారు ) . 

4.. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! ( రేలంగి వెంకట్రామయ్య గారు ) . 

5. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా, మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి ! ( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) 

6. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు " అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు. అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ అర్ధం కాలేదు ! ( ఆత్రేయ గారు )  

7. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం ! అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! ( చాగంటి కోటే శ్వర రావుగారు ) .

8. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !! ( గౌతమ బుద్దుడు ).  

9 ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది ! ( మాతా అమృతానందమయి ) .

10. మీ పిల్లలు ఎంతదూరంలో, ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించు. "అన్ని దానము లలో అన్నదానం మిన్న " .

- KVS Sanyasi Rao

 

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha