Online Puja Services

దేహాంతము వేళ

18.117.188.64
అమృత వాక్కులు         
దేహాంతము వేళ 
 
దేహమొదిలి వెళ్ళే దయనీయ స్థితియందు ,             
గతము గుర్తుకొచ్చి మనసు కలత చెందె ,
దోచిన సొమ్మంత దాచి పెట్టితినని ,               
 ఆలుబిడ్డల దూషించి ఏడిపించితినని ,
ఎవరెవరిని పరుష పదాలతో వారి మనసు గాయపరచినవి ,
అన్న మడుగ ఇంటికొచ్చిన బిచ్చగాడిని ఛీదరించి పంపినది ,                    
పరోపకారము ఒక్కరికీ చేయక బ్రతికితి ననుచు ,
ఆకర్షణలనే మాయ మనసును కప్పీ కర్తవ్యాన్ని మరిచినవన్నీ ,అశాశ్వతమైన 
దేహాన్ని చూసి మురిసి సుఖముల బడితిననియు ,          
 
కన్ను మిన్ను కానకుండ కళ్ళకు పొరలు కప్పి ప్రవర్తిస్థిననియు ,  అయినా ఇప్పుడు ప్రాయశ్చిత్తానికి సమయమేది ,  యమకింకరుల చేత పడిన నన్ను యెన్ని చిత్రహింసలకు గురి చేతురో సుమా ,    
      
అనుభవించక తప్పదు చేసిన తప్పిదములకింకా ,
నరకయాతనలో నేనిక నలిగి ,కృంగి ,కృశించి పోయెద సుమా ,                                    
 
 జీవితంలో చేసిన తప్పిదాలకు  తప్పించుకోలేరెవరు సుమా.
 
బిజ్జ నాగభూషణం 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore