Online Puja Services

భగం

18.218.184.214
అమృత వాక్కులు        
"భగం "
 
"భగం " అనే పదానికి ఐశ్వర్యం ,జ్ఞానం ,కీర్తి ,సౌందర్యం ,బలం ,వీర్యం ,ప్రేమ ,కాంతి ,తపస్సు ,వైరాగ్యం  వంటి ఎన్నో అర్థాలు చెబుతాయి నిఘంటువులు .ఇవన్నీ ఎవరియందుంటాయో ఆయనే భగవంతుడు .ఏ ప్రతిమలోనో లేదా వ్యక్తిలోనో ఆ లక్షణాలను భావన చేసే వాడు -భక్తుడు .భక్తుడి విశ్వాసం ఎంత బలమైనదో భగవంతుడు అంతటి బలవంతుడు .భావన ఎంత నిజమైనదో దేవుడు అంత నిజం .  
                            
"భగవంతుడు దేనియందున్నాడు ?" ప్రశ్నకు వేదం "మహిమ " లో అని బదులిచ్చింది ."విరివిగా నీ మహిమలు చూపిస్తూవుండు ."అని కాసుల పురుషోత్తమ కవి నేరుగా భగవంతుణ్ణి హెచ్చరించాడు .
 
దేవుడొక్కడే అని పురాణాలు చెప్పాయి .ఏ దేవుడి ఆరాధనలో అద్భుతమైన సంతృప్తి కలుగుతుందో ,ఆ దేవుడే ఆ భక్తుడికి సత్యం .    
 
విగ్రహంలో దేవుణ్ణి భావన చేస్తూ భక్తితో కొలవడాన్ని "ప్రతిమారాధనం " అంటారు .     మనిషి భావనమయ జగత్తే భగవంతుడి రాజధాని .మనిషి హృదయమే భగవంతుడి భవ్య మందిరం .గర్భగుడిలో మూల విరాట్టును కనుగొనడం కోసం చేసే ప్రయాణమే ఆధ్యాత్మిక సాధన .
             
జీవితం సాఫీగా సాగాలని ప్రార్థించకు ,దేన్నయినా తట్టుకొని నిలబడే శక్తి కోసం ప్రార్థించు .
 
 బిజ్జా నాగభూషణం

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore