Online Puja Services

సత్యం

18.191.211.66
అమృత వాక్కులు                         
సత్యం - 
 
సృష్టి కర్త వున్నాడన్నది సత్యమే .సృష్టికూడా సత్యమే .ఈ రెండిట్లో ఏది మిథ్య కాదు .సత్యస్వరూపుడు కూడా సర్వాంతర్యామే .భగంతున్ని      
నిర్వచించాలంటే ,సత్యం ,జ్ఞానం ,అనంతం .ఈ మూడు కలవాడు భగవంతుడు .
 
సత్యం అంటే నిజం చెప్పడం .ఇది ఎంత విలువైన ఆయుధం అంటే హరిశ్చంద్రుడు పాటించి అంతటి కీర్తి ప్రతిష్టలు పొందాడు .మహాత్మా గాంధీ కూడా సత్యమనే దాన్ని ఇక ఆయుధంగా చేసుకొని భారత దేశాన్ని ఒక తాటిపైకి  తెచ్చి స్వాతంత్రం సాధించడంలో ముఖ్యుడయ్యాడు .ధర్మరాజుకు సత్య ధర్మ పాలకుడని పేరుంది .మాటకు ప్రాణం సత్యం .                                         
 
 సత్యం ,పవిత్రత ,నిస్వార్ధం భునబోతారాలోని ఏ శక్తీ ఈ సుగుణాలతో జాజ్వలమానంగా ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు .విశ్వమంతా ఒకటై ఎదిరించినా ,వారు ప్రతిఘటించగలరు .
                   
యజుర్వేదం లోని ప్రార్థన -"మమ్మల్ని అసత్యం నుంచి సత్యానికి నడిపించు ,చీకటి నుంచి వెలుతురులోకి నడిపించి ,తమస్సు లోనుంచి మమ్మల్ని జ్ఞానం లోకి నడిపించి ,మృత్యువునుంచి అమృతత్వం వైపు నడిపించు.ముల్లోకాలకు శాంతి కలుగుగాక ".సత్య చేతనంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు అంటారు అరవిందులు ."సత్యోనాస్తి పరమోధర్మః "అన్నది ఆర్యోక్తి .అంటే సత్యాన్ని మించిన పరమధర్మం ఇంకొకటి లేదని .                            
ఈ క్రిందిది వేద మంత్రం .
    
"సత్యం వద -ధర్మం చర ,           
 
సత్యమేవ జయతే ,                  
 
ధర్మోరక్షతి రక్షితః ,      
 
యతో ధర్మ స్తతో జయః ".      
 
సత్యం ధర్మం ఈ రెండూ కవలపిల్లల్లు .ఒకదానికి ఒకటి అంటుకొని వుంటాయి .కృతాయుగంలో సత్యం ,ధర్మం నాలుగు పాదాలతో నడిచింది .త్రేతాయుగంలో మూడు పాదాలతో నడిచింది .ద్వాపరా యుగంలో రెండు పాదాలతో నడిచింది .ఈ కలియుగంలో ఒకే పాదంతో నడుస్తున్నది .అంటే చూడండి కృతాయుగం నుంచి సత్యం ,ధర్మం నాలుగు పాదాల నుండి కలియుగం వచ్చేసరికి ఒక్క పాదంవరకు దిగజారింది .ఇలా దిగజాడానికి కారణం కలియుగమాయ . కలియుగ పురుషుడైన సర్వాంతర్యామి ఈ కలియుగపురుషుడు .           
 
ద్వాపర యుగం అంతిమం ఒకరోజు ముందు ఇద్దరు పరీక్షిత్ రాజు దగ్గరకు వచ్చి ,భూమి కొన్న అతను నా భూమిలో బంగారు కుండలు దొరికినవి అయితే అవి నేను పెట్టలేదు కాబట్టి నాకు అమ్మినతనికి చెందుతాయి అంటాడు .దానికి భూమి అమ్మినతను ,రాజా నేను భూమి నేను అమ్మినాను ఆ భూమి మీద హక్కు నాదిపోయింది అందుకని ఆ బంగారు కుండలు అతనికే చెందుతాయి ..అప్పుడు మంత్రి రాజుకు చెబుతాడు "వీరిద్దరిని ఒక రోజు ఒక గృహంలో ఉంచండి తెల్లవారి తీర్పు ఇద్దామని "అంటాడు .రాజు మంత్రి చెప్పింది చేస్తాడు .తెల్ల వారింది కలియుగం మొదలైంది .రాజు వారిని పిలిపించి చెప్పమంటాడు .అప్పుడు భూమికోన్న అతను అంటాడు ,భూమి కొన్నాను కాబట్టి భూమిమీద సర్వహక్కులు నావే అందుకని బంగారు కుండలు నావే అంటాడు .భూమిఅమ్మిన వాడు ,భూమి మాత్రమే అమ్మాను కాని భూమిలో బంగారు కుండలు అమ్మలేదంటాడు .అప్పుడు మంత్రి రాజు తో అంటాడు ,చూసారా కలియుగ మహిమ అని .అప్పుడు రాజు ఆ బంగారు కుండలు ప్రభుత్వానికి చెందుతాయని తీర్పు ఇస్తాడు 
.              
మనకు కూడా సత్య మార్గంలో నడవాలనిపిస్తుంది .సత్య మార్గంలో నడవడంముళ్ల మార్గంలో నడక .ఈ కలికాలంలో మనము రోజు ఎన్నో అసత్యపుపనులు చేస్తుంటాము .ఇది కలి మాయ ,ఏమి చేయలేము .ఈ కలియుగం ఇలానే నడుస్తుంది .కలియుగం 
వుండేది 4,32,000 సంవత్సరాలు .అందులో ఇప్పటి వరకు అయిదువేలసంవత్సరాలు గడిచింది .మిగిలిన కలికాలంలో ఇంకా ఎలాంటి అవాంఛనీయ మైన ఘటనలు జరుగుతాయో ,ఇంకాలోకం యెంత దిగజారి పోతుందో వూహించలేము ,సుమా ! .
 
అయినా సత్యం తో నడిచేవారు ఇప్పటికీ ఈ ప్రపంచంలో వున్నారు .వారు వుండబట్టే     ప్రపంచం ఇంకా మనుగడ సాగిస్తుంది .  మనము సత్య మార్గంలో అయినంతవరకు నడిచే ప్రయంత్నం చేయాలి .  మన పుణ్య కర్మల్లో ఇది చేరుతుంది ,మన పాప కర్మల్లో కొంత తగ్గించుకున్న వారమౌతాము .                        
 
ఒక మాట -విమర్శించే వారు దిగజారిపోతారు ,విశ్లేషించేవారు పైకెగబాకుతారు .           
 
 బిజ్జ నాగభూషణం.

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya