బాంధవ్యం -ఇది ఒక వ్యామోహం .

34.204.168.209
అమృత వాక్కులు      
బాంధవ్యం -ఇది ఒక వ్యామోహం .
 
బందుత్వంలో ఆత్మీయతలకన్నా మర్యాదలకు ప్రాధాన్యం ఎక్కువ .ఒకప్పుడు పెళ్లిళ్లు అయిదు రోజులు వుండేవి .అప్పుడు వచ్చిన బంధువులు అయిదు రోజులుండి హాయిగా సంతోషంగా గడిపి వెళ్లేవారు . వారు చాలా మర్యాదలు అనుభవించే వారు .అలానే ఇంటి గురువులు వచ్చి రెండుమూడు రోజులు వుండి దక్షిణ తీసుకొని వెళ్లేవారు .భందువులొస్తే తప్పకుండా మూడునాలుగు రోజులు వుండనిదె వెళ్లేవారు కాదు .  
           
ఇప్పటి పరిస్థితులు భిన్నంగా వున్నాయి .బంధువులు ఎవరు రారు functions అయితే తప్ప ఎందుకంటే సమయాభారం . software వాళ్ళకైతే అసలు సమయం వుండదు ఎందుకంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటారు కాబట్టి.  functions కు వచ్చినా కట్నం ఇచ్చి బోంచేసి వెళతారు కొందరైతే తినకుండా కూడ పోతారు సమయం లేదని .  ఒక సినిమాలో వున్న పాటలా "ఎవరికి ఎవరు కాపలా భందాలన్నీ నీకెలా "అన్నచందంగా వుంది ."ఎవరికి వారే యమునా తీరే "అని పెద్దలన్నది అక్షరాలనిజం .ఈ రోజుల్లో బంధుత్వానికి విలువ లేదు .కొందరికి వారి పెద్దవారు చెప్పకుంటే అసలు భందువులెవరో కూడ తెలియని పరిస్థితి ఇది .ఈ బంధాలు కూడా ఈ ప్రపంచంలో ఏర్పడ్డ బంధాలే .మనము పొతే ,చితి వరకు వచ్చి పోతారు అంతే .        
 
మన భాందవ్యాలు నాలుగు రకాలుగా చెప్పవచ్చు .
 
1)జన్మభాందవ్యం 2)వివాహా బాంధవ్యం 3)భావ భాందవ్యం 4)పారమార్థిక భాందవ్యం .          
 
1)జన్మ భాందవ్యం -మనము పుట్టగానే ఏర్పడ్డ బంధం .ఇది తల్లీ ,తండ్రులతో సంక్రమించినది .ఈ బంధంలో తల్లి తరఫు వాళ్ళు మరియు తండ్రి తరఫు వాళ్ళు భందువులౌతారు .ఇంటి భందువులంటే ఇంటి పెద్దలు తాత ,అమ్మమ్మలు ,తాతమ్మలు ,అన్నాతమ్ముళ్ళు ,అక్కాచెల్లెల్లు ,.వీరు మనకు చిన్నప్పటి నుంచి మానను వచ్చి చూసి పోతుంటారు .మెల్లగా మాటలొచ్చి ,గుర్తుపట్టడం మొదలుపెట్టాక ఈ బంధువులందరిని గుర్తించ గలుగుతాము .వారు కూడ మన ఇంటికొచ్చినప్పుడు వారు వరస పెట్టి మనను పలకరించి పోతుంటారు .
 
2)వివాహా బాంధవ్యం -మనకు వివాహాం అవగానే మన అత్త తరఫు వాళ్ళు ,మామ తరఫు వాళ్ళు భందువులై కూర్చుంటారు .పెళ్లిళ్ల లో అత్తమామలు వాళ్ళ తరఫు బంధువులను పరిచయం చేస్తారు .మెల్లగా మనకు కుటుంబం అవగానే ఒక్కొక్కరు బంధువులు వస్తూపోతుంటారు .ముఖ్యంగా అత్తమామలు బావబామ్మరుదులు ,వదినమరదళ్ళు వచ్చి పోతుంటారు .వీరు వివాహా బంధంలో ముఖ్యులు .               
 
3) భావ బాంధవ్యం -అన్నిటి కన్నా ముఖ్యమైనది ఇది .మనకు కొందరు స్నేహితులౌతారు .వారు చిన్నప్పటి స్కూల్ ,కాలేజీ ,,పనిచేసే చోట వారు మనకు స్నేహితులౌతారు .అంటే మన ఆలోచనా సరళి ,వారి ఆలోచనా సరళి ఒక్కటైందన్నమాట .అంటే ఇద్దరి vibrations ఒక్కటైనవన్నమాట .అప్పుడు స్నేహం ఏర్పడి ఒకరికొకరు తోడునీడగా వుంటారు .ఆపత్సమయంలో  ఒక్కరికొక్కరు ఆదుకుంటారు .అప్పుడు వారు ఆత్మీయులు అవుతారు ."ఆపత్ కాల భాందవా "అవుతారు .వారు జీవితాంతం స్నేహితులుగా వుండి అండదండలందిస్తుంటారు .
 
మిగతా బాంధవ్యాలు ఒట్టి మర్యాదలకే పరిమితులవుతారు .వారి బంధుత్వంలో చాలా వరకు ఆత్మీయత వుండదు .     
అదే స్నేహబాంధవ్యంలో ఆత్మీయత వెల్లివిరుస్తుంది .ఈ ఆత్మీయ బంధమే భావబంధవ్యం .ఇది చిరకాలం నిలుస్తుంది .మధ్యమధ్యలో మనస్పర్థలు ఉత్పన్నమైనా వాటిని సరిద్దుకొని adjust అయిపోతారు .అదే ఇతర బాంధవ్యాలలో మాటల స్పర్ధ వస్తే వారు మాట్లాడ కుండా దూరమౌతారు .అందుకని స్నేహబాంధవ్యం అన్నింటిలో       శ్రేష్టమైనది దానికి మనము ప్రాధాన్యత నివ్వాలి .  
    
4)పారమార్థిక బాంధవ్యం -
ఇది భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడ్డ బాంధవ్యం .భక్తులు నవ విధాలుగా షోడశోపచారాలతో 
భగవంతున్ని మచ్చిక చేసుకొని ఆత్మబంధం ఏర్పరుచుకొంటారు .అలాంటి వారే ప్రహల్లాదుడు ,భక్త కన్నప్ప లాంటి వారు .భగవంతుడుకూడా అలాంటి వారికి పిలవగానే వచ్చి కాపాడుతాడు .ఏనుగు మొసలి బారినపడినప్పుడు 
ఏనుగు పిలవగానే భగవంతుడు హుటాహుటిన తన అస్త్రశస్త్రాలన్ని వదిలిపెట్టి పరుగెత్తుకువచ్చి ఏనుగును కాపాడతాడు .ప్రహల్లాదుడు  పిలవగానే నరసింహావతారంలో వచ్చి ప్రహల్లాదునికి మోక్షమిస్తాడు .    భగవంతునితో భాందవ్యం ,ఇహ పర ముల్లోకాలకు మోక్షమిచ్చే ఆత్మీయ బంధం.  ఒక్కసారి భగవంతుడు మనకు స్వాధీనమైతే ఇక ప్రపంచంలోఅంతకన్నా మించిన భాందవ్యం లేదు .
 
భగవత్ గీతలో శ్రీకృష్ణపరమాత్మ అంటాడు"నేను అన్నింటికన్నా నా భక్తునికి ప్రాముఖ్యత ఇస్తాను.వారు అన్నింటిని వదిలి నా శరణు జొచ్చిన వారికి పాపాలను ప్రక్షాళన చేసి మోక్షమిస్తాను .కాని వారు కర్మలను ఆచరించాలి కాని కర్మఫలాన్ని నాకు వదిలెయ్యాలి .నాకు పుష్పం ,ఫలం ,తోయం ఏది భక్తుడు భక్తి పూర్వకంగా సమర్పిస్తే అది స్వీకరిస్తాను .
 
అందుకని మనము ఈ ప్రపంచ వ్యామొహాలన్నీ తగ్గించుకుని ,నిత్యస్మరణతో భగవంతునితో భాందవ్యం ఏర్పరుచుకోవడం ముఖ్యం .     మనము ఈ లోకంలో జ్ఞానమార్జించి ,ఆ జ్ఞానాన్ని దేహము ,మనసు ఉపకారణాలతో భగవంతుని సన్నిధి చెరే మోక్షం సులభమౌతుంది .                     
 
మానవ జీవన లక్ష్యం -మోక్షం .మొహాన్ని వీడి ,స్వార్థాన్ని తగ్గించుకొని ,తోటి మనిషిని దేవుడిలా చూసే దశనే మోక్ష స్థాయి అని పెద్దలు పేర్కొన్నారు .అది కేవలం మనిషికి మాత్రమే సాధ్యం .మోహ క్షయమే మోక్షం .అదే వేదాంత మార్గం .     
 
ఒక మాట -నిజం చెప్పాలంటే నీతి వుండాలి, మంచి చేయాలంటే మనసు వుండాలి .                              
 
- బిజ్జ నాగభూషణం 
    

Quote of the day

Emancipation from the bondage of the soil is no freedom for the tree.…

__________Rabindranath Tagore