Online Puja Services

తల్లి మాటలోని మహత్తు -.

3.144.113.30
అమృత వాక్కులు  
    
తల్లి మాటలోని మహత్తు -.      
 
అనగనగా ఒక బాలుడికి జట్కా 
బండిలో ప్రయాణించడం చాలా ఇష్టం .రోజు బడికి జట్కాలోనే వెళ్ళేవాడు .    
    
పెద్దాయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచర్ అడిగారు .ఒకరు డాక్టరని ఇంకొకరు ఇంజినీరని ,
మరొకరు లాయరని అన్నారు .ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు .టీచరు, పిల్లలు ఘొల్లున నవ్వారు . ఇంటికెళ్లే లోపే ఇది బాలుడి తల్లికి తెలిసి ,ప్రశాంత వదనంతో బాబూ !పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది .స్కూల్లో చెప్పింది చెప్పాడు .  
       
తల్లి : "అలాగే అవుదువుగానీ ,ఇలా రా "అంటూ పూజా మందిరం తలుపు తెరిచి ,"ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు !నాలుగు గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కావాలవి కావాలి ,అదిగో శ్రీ కృష్ణుడి లాగా "అని బోధించింది ఆ తల్లి .    
       
 ఆ నాలుగు గుర్రాలపేర్లు ధర్మ ,అర్ధ ,కామ ,మొక్షాలని ,ఆ భోదించే జట్కావాలా జగద్గురువైన శ్రీ కృష్ణుడని చెప్పింది . 
   
"నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి ,సరేనా !"
అంటూ అతడి ఆలోచనను మలుపు తిప్పింది .   
 
ఆ బిడ్డడే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు .
 
పెంపకం అంటే అది !
 
పిల్లలు తెలియక తప్పు చేసినా ,తప్పు మాట్లాడినా దానిని సరిద్దాల్సింది తల్లే !అందుకే అమ్మని తొలి గురువు ,తొలి దైవం అంటారు .అమ్మ మాటలో ఎంతో మహత్తు వుంది కదా !.       
 
ఒక్క మాట -తల్లిని మించిన దైవంలేదు ఈ లోకంలో .తల్లిని మిచ్చిన మన శరీర పోషకులు లేరు ఈ లోకంలో."మాతా సమం నాస్తి శరీర పోషణం " అని సుభాషితాలలో వుంది .అందుకని అమ్మను అనాధ చేయకు .అమ్మ ఋణం తీర్చుకోవడనికి ఈ జన్మ సరిపోదు .  
 
- బిజ్జ నాగభూషణం .
 

Quote of the day

There is a magnet in your heart that will attract true friends. That magnet is unselfishness, thinking of others first; when you learn to live for others, they will live for you.…

__________Paramahansa Yogananda