Online Puja Services

ఎక్కడ సంబంధాలు అక్కడ వరకే

3.141.198.146
ప్రారబ్దం అంటే ఏమిటి ? 

దీనిని వదిలించు కునే మార్గం లేదా 
చెబుతాను వినండి 

ఎక్కడ సంబంధాలు అక్కడ వరకే.
అక్కడ నువ్వు దుఃఖిస్తూ దైన్యంతో వదలలేక 
వదిలి పెడుతూ దేహాన్ని వదిలి వేస్తె 
అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావే అని 
దుఃఖిస్తూ కొందరు ఉంటే..
క్రొత్తగా నువ్వు వస్తున్నావు 
అని మరికొందరు సంబరాలు చేసుకుంటూ ఉంటారు .. రాక పోకల మధ్య నువ్వు 
మంచో చెడో ఏవో కర్మలు చేస్తూనే ఉంటావు . 
కర్మలు చేస్తూ చేస్తూ దానికి ఓ బ్యాగ్ తయారు చేసి దానిలో బేలెన్స్ చేస్తావు ఆబ్యాగ్ సంచిత కర్మలు ,,

అవి పెరిగి పెద్దవి అయి మేరు పర్వతాన్ని మించి 
కరడు గట్టిన ఓ కొండ గుట్టగా తయారు అవుతాయి . ‘’అవే ప్రారబ్దం . ఆ ప్రారబ్దం అనే బరువును నెత్తిన పెట్టుకుని ఇపుడు ఈ జన్మ తీసుకుంటావు . 
ఈ ప్రారబ్దం క్లియర్ అయ్యే వరకు నీకు జన్మలు తప్పవు . (సుఖము దుఃఖము.. ఐశ్వర్యము ఆకలి రోదనలు ,,, 
ఇలా రెండు ఇనుప బంగారు రెండు సంకెళ్ళే ).

మరి ప్రారబ్దం కరిగించుకునే మార్గం :??

నీకు దేహ భావన ఉన్నంత వరకు ప్రతి కర్మ 
నిన్ను అంటుకునే ఉంటుంది . 
మరి ఇక ఈ దేహం వదిలివేస్తే..అది కరెక్ట్ కాదు. ‘
నీ ప్రారబ్దం నిన్ను వదలదు . 
మట్టి కుండలో మంచి నిరు దాహం తీరుస్తుంది . 
కాబట్టి కుండ పగలకుండా జాగ్రత్త చేసుకోవాలి .
లేనిచో దాహం తీరదు . 
ఈ దేహాన్ని ఆధ్యాత్మిక భోదకు యోగ సాధనకు 
జాగ్రత్త చేసుకోవాలి .

ఈ పరికరంతోనే ఏదైనా చేయగలవు . 
ఇది లేకుంటే ఏది చెయ్యలేవు . 
ఎపుడు ఎరుకతో ఉంటూ... “ జ్ఞానాగ్ని దగ్ద కర్మాణి “ ఎందుకంటే జ్ఞానం వలన క్రొత్త కర్మలు ఏర్పడవు . 
కానీ ప్రారబ్దం మాత్రం అనుభవించాలిసిందే ‘’ 
ఇది ఎవరూ తప్పించ లేరు’ 
కాని’అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ’’ అంటూ వాని పాదాలు పట్టుకుంటే,  తలకు తగలవలసిన దెబ్బ తలపాగాకు తగిలి వెళ్ళిపోతుంది .

చేసే ప్రతి పని నిష్కామంగా చేస్తూ ఉంటావో 
ఇదేదీ నాది కాదు’’ అసలు నేను ఇది కాదు ‘’ 
అనే భావంతో సంసారంలో ఉంటావు కాని 
సంసారం నీలో ఉండ కూడదు .
నావ సంద్రంలో ఉండాలి కాని సంద్రం నావలో 
ఉండ కూడదు . 
నీటి కోడి నీటిలో ఉన్నా దాని రెక్కలకు తడి అంటనట్లు , .. ఇలా ఉండటం సాధ్యమా ? నీకు నువ్వు ప్రశ్నించు కో ! 

ఆ మార్గంలో ఆ స్దితిలో నువ్వు వెళుతున్నావు అంటే 
ఇక నీ కర్మలు క్లియర్ అవుతున్నట్లే . 
దీనికి నువ్వే న్యాయ నిర్నేతవు .. 
బయట వాళ్ళు ఎవరూ మార్కులు వేయరు.
నీ మనస్సాక్షి నీకు మార్కులు వేస్తుంది.

ఈ స్దితికి నువ్వు ఎదిగినపుడు ఇక 
ఆగామి లేదు సంచితం లేదు ప్రారబ్దం లేదు ..
నువ్వు కేవలం సాక్షివి మాత్రమే.!

పరమశివా అందరిని చల్లగా చూడు తండ్రి 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha