Online Puja Services

మంత్రం తప్పు చదివితే

18.224.53.202
మంత్రం తప్పు చదివితే దేవుడు శిక్షిస్తాడా ?..

లేదు అది చాలా పొరబాటు మాట ,ఉదాహరణకు అమ్మవారి మంత్రం....చదవటం నోరుతిరగక తప్పులు చదువుతుంటే ఆ తల్లి భక్తుడు పడే పాటు చూసి నవ్వుకుంటుంది... భక్తి తోనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన్నిస్తుంది...

మరి మంత్రం తప్పు చదివితే తిప్పలు తప్పవు అంటారు కధా.  ఇది నిజం... ఎందుకంటే 

మంత్రాలు అనేవి ప్రకృతిలో ని positive ఎనర్జీ ని , విశ్వప్రాణ ,శక్తి ( కాస్మిక్ ఎనర్జీ ) ని ఆకర్షించే ఫార్ములాలు, కొద్దిపాటి తేడాతో ప్రోనౌన్సషన్ మారిపోతే వేరే ఫలితాలు వస్తాయి దానికి కారణం మనమే కానీ అమ్మవారు కాదు, ఒక సామేత చెప్పినట్టు ఎవరి నోటి శాపం వారికి తగులుతుంది అంటారు కదా అలా.... 

పార్వతి ప్రకృతి స్వరూపిణి.  కొన్ని రకాల శక్తి ఆకర్షణ శబ్దాలను ఒకటిగా చేర్చి అది మంత్రం గా మనకు మన మునులు అందించారు.. అది సక్రమంగా పలికి జపము చేసుకోగలిగితే ప్రకృతిలో ని శక్తి కాస్మిక్ ఎనర్జీ , ఆ మంత్రం ఫలితాన్ని మనకు అందించడమే కాకుండా మనలో రేఖీ శక్తి పెరిగి మంత్రం సిద్ధిస్తుంది.. అదే చెడు కోరెవిధంగా శబ్దం మారి నప్పుడు ఆ ఫలితం సిద్ధిస్తుంది అంతే గాని భగవంతుడు పగబట్టి శపించడం ఉండదు.. అలాగే మనమే శాపాలు పెట్టుకున్న దానికి భగవంతుడు కారణం కాదు...

మరి ఎలా సాధన చేయాలి... అంటే కలియుగంలో కేవలం నామజపం తోనే భగవంతుడు వశుడై పోతాడు, అమ్మవారి మంత్రం,"శ్రీ మాత్రే నమః" అలాగే పంచాక్షరీ, అష్టాక్షరి, ఇలా మీ ఇష్ట దైవాన్ని నామజపం చేసుకుంటూ ఉండండి అంత కన్నా గొప్ప సాధన వేరే లేదు... మంత్రమే చదవాలి అనుకుంటే బుక్ చూస్తూ ఆడియో వింటూ ప్రాక్టీసు చేయచ్చు..

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha