Online Puja Services

భోగీంద్రులును మీరు బోయి రండుఅన్నమయ్య కీర్తన

18.226.251.22
ప|| భోగీంద్రులును మీరు బోయి రండు | వేగగ మీదటి విభవాలకు ||

చ|| హరుడ పోయిరా అజుడ నీవును బోయి | తిరిగిరా మీదటి తిరునాళ్ళకు |
సురలు మునులును భూసురలు బోయిరండు | అరవిరి నిన్నాళ్ళు నలసితిరి ||

చ|| జముడ పోయిరా శశియు నీవును బోయి | సుముఖుడవై రా సురల గూడి |
గుములై దిక్పతులు దిక్కులకు బోయిరండు | ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి ||

చ|| నారద సనక సనందాదులు | భూరివిభవముల బోయిరండు |
దూరముగా బోకిట్టే తొరలి వేంకటగిరి | జేరి నన్నిట్లనే సేవించుడీ |

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya