Online Puja Services

అమ్మా.. నీకిదే నా నమస్కారము

18.117.153.38

ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే!

తాత్పర్యం:
ఓం = ఓంకారము
సర్వ = సమస్తములైన
మంగళ = శుభములకును
మాంగళ్య = శుభ కరమగు దానా !
శివే = శివుని అర్ధాంగి అయిన
సర్వ = సమస్తములైన
అర్ధ = ప్రయోజనములను
సాధికే = నెర వేర్చెడి శక్తి గలదానా
శరణ్యే = భక్తులకు పెద్ద దిక్కు అయినదానా !
త్ర్యంబకే = ముక్కంటి అర్ధాంగి
నారాయణి = విష్ణుమూర్తి సోదరికి
గౌరీ = ఓ పార్వతి మాతా !
తే = నీకు
నమః = నా యీ వందనము
అస్తు = చెందును గాక !

భావం: 
సకల శుభములకు మూలమైన పార్వతీ! కోరికలన్నీ తీర్చు తల్లీ ! అందరికీ శరణము నిచ్చు, మూడు కన్నుల కల శివుని అర్ధాంగి అయిన గౌరీ ! నారాయణుని సోదరీ ! 

నీకు నమస్కారము. 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore