భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతుందా?

52.91.0.112

భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతుందా? (కాత్యాయనీ మంత్రం ) 
-సేకరణ 

నిత్యం కీచులాడుకునే దంపతులు ఏ పూజ చేయాలి ? పుణ్యంకొద్దీ పురుషుడు అని ఆమెంటే, దానము కొద్దీ భార్య అని ఆయంటాడు . అన్యోణ్యంగా ఉండాల్సిన వారు కీచులాటలతో కాలం గడుపుతుంటే, ఇంట్లోని పెద్దవాళ్ళు ఆందోళనతో , మానసిక అస్థిరతతో బాధపడుతుంటారు . ఇటువంటివారు ఏంచేయాలనే దానికి పండితులు ఒక పరిష్కారం చూపిస్తున్నారు . 

గోదాదేవి కాత్యనీ వ్రతాన్ని ఆచరించే , రంగనాథుణ్ణి భర్తగా వరించింది . ఆయన ప్రేమని గెలుచుకోగలిగింది . అందుకే , దాంపత్య దోషాలు తొలగిపోవాలంటే కాత్యాయని మంత్రాన్ని పఠించాలని పురాణాలు చెప్తున్నాయి. వివాహం కాని కన్యలు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు కాత్యాయని మంత్రాన్ని 45 రోజుల పాటు నిష్ఠతో పఠించిన వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. దాంపత్యం పండుతుంది.

దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

కాత్యాయని మంత్రాన్ని పఠించిన వారికి సకల భోగభాగ్యాలు చేకూరుతాయి. వివాహ అడ్డంకులను తొలగించేందుకు కాత్యాయని మంత్ర పఠనం చేయాలని భాగవతం చెప్తోంది.  ఆ అమ్మవారిని పూజించిన వారికి మాంగల్య దోషాలు తొలగిపోతాయి. నవదుర్గల్లో కాత్యాయని మాతది  ఆరో స్థానం. ఈమెకు గురు గ్రహం ఆధిపత్య దైవం. ఈమె సింహంపై ఆసీనురాలై వుంటుంది. త్రినేత్రాలను కలిగివుంటుంది. 

కాత్యాయని మంత్ర జపంతో కుజ దోషాలు హరించుకుపోతాయి. దాంపత్య జీవనంలో వుండే దోషాలను ఇది తొలగిస్తుంది. కాత్యాయని మంత్రాన్ని జపించే దంపతులు అన్యోన్యంగా జీవనం సాగిస్తారు. అలాగే సంతానం లేని దంపతులకు కాత్యాయని మంత్ర జపంతో వంశాభివృద్ధి చేకూరుతుంది.

''కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరి
నంద గోప సుతం దేవీ పతిమే కురుతే నమః
అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర
విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవీ నారాయణే నమోస్తుతే" 

41 రోజులు అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే దాంపత్య దోష నివారణ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విడాకులు అనే మాటకు చోటుండదు. శుభం

Quote of the day

We are what our thoughts have made us; so take care about what you think. Words are secondary. Thoughts live; they travel far.…

__________Swamy Vivekananda