Online Puja Services

పిల్లలు కలగకపోవడమనే సమస్యేలేదు

13.59.122.162

గర్భాంబిక అనుగ్రహం ఉంటె, పిల్లలు కలగకపోవడమనే సమస్యేలేదు !!

ఆదిశక్తి ని మించిన రక్షకులు ఎవరుంటారు. దేవతలకైనా , త్రిమూర్తులకైనా ఆపదవస్తే , ఆశ్రయించేది ఆ జగజ్జననినే కదా ! అందుకే ఆ అమ్మ - అమ్మ కడుపులో బిడ్డని కాచే తల్లిగా గర్భరక్షాంబికగా పేరుగాంచింది . ఒక్కో రోగానికి ఒక్కో మందున్నట్టే, ఒక్కో అవతారంలో అమ్మని పూజించడంవల్ల ఒక్కో విశిష్టమైన ఫలితం కలుగుతుందన్నమాట. ఆవిధంగా ఈ గర్భాంబిక గర్భంలో ఉన్న బిడ్డనికాచి రక్షిస్తుంది. సంతానం కోసం తపించే దంపతులు కూడా ఈ అమ్మ కటాక్షం చేత సంతానం పొందగలరని పురాణోక్తి .  

గర్భాంబిక కథ : 
పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మ పత్ని వేదిక తో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము లేకపోవడం . సంతానము కోసం ఈ దంపతులు మాతృస్వరూపిణి అయినా అమ్మవారిని, పితృస్వరూపంగా శంకరుడిని విశేషంగా  ఆరాధించారు. 

ఆ ఆదిదంపతుల అనుగ్రహంతో , ఒక శుభదినాన వేదిక గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదికకి తొమ్మిది నెలలు నిండి ఉన్నాయి .  కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది.

నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వస్తారు . అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది. ఆయన రాకని గమనించేస్థితిలో లేకపోవడంతో, మహర్షికి అతిథి మర్యాదలు విస్మరిస్తుంది .  తెలీక జరిగిన అపరాధమని ఎంచక, ఆగ్రహం చెందిన ఊర్ధ్వ పాదుడు, ఆమెను శపిస్తారు. ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలుపెడుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా కొరుక్కొనిపోవడం మొదలవుతుంది . 

గర్భశోకంతో దుఃఖిస్తూ , వేదిక , సర్వ మంగళ స్వరూపమైన ఆ పార్వతీ మాతను ప్రార్ధిస్తుంది. అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షం అయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధం గా రక్షింపబడిన శిశువు ఆ కుండలోఎదుగుతాడు . చక్కని మగ పిల్లవానిఘా బయటికి వస్తాడు. వాడికి నైధ్రువుడు అని పేరు పెడతారు. అప్పుడే పుట్టిన ఈ శిశువుకి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి, శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా తమని ఆశ్రయించే వాళ్లకి గర్భరక్ష కలుగజేయమని ప్రార్ధిస్తారు. ఆవిధంగా ఆ తల్లి గర్భాంబికగామారి , గర్భిణీలకు, గర్భస్ధ శిశువుకి రక్షణగా ఉండడమే కాకుండా నిస్సంతులైనవారిని కూడా తన కటాక్షవీక్షణాలతో అనుగ్రహిస్తుంది .  

శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం ఇక్కడ మీకోసం  అందిస్తున్నాం . తొలిచూలు అమ్మయినాసరే, ఈ అమ్మని తలుచుకుంటే, భయంవీడి, చక్కని పండంటి బిడ్డకి జన్మనివ్వడం  నిస్సందేహమని శ్రుతివచనం . 
 

శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం:

 ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం శ్రీమాత్రే నమః 
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్ ప్రజా కర్తా, 
ప్రజా పతే ప్రగృహ్షీణివ బలిం చ ఇమం ఆపత్యాం రక్ష గర్భిణీమ్. 1

అశ్వినీ దేవ దేవేసౌ ప్రగృహ్ణీతమ్ బలిం 
ద్విమం సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం చ 
రక్షతాం పూజ యనయా 2

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా ప్రగృహనంతు బలిం 
ద్విమం యుష్మాకం ప్రీతయే వృతం నిత్యం 
రక్షతు గర్భిణీమ్. 3 

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా ప్రగ్రహ్ణీత్వం బలిం 
ద్విమం యుష్మాగం తేజసాం వృధ్య నిత్యం 
రక్షత గర్భిణీమ్. 4

 వినాయక గణాధ్యక్షా శివ పుత్రా మహా బల 
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం 
రక్ష గర్భిణీమ్. 5

స్కంద షణ్ముఖ దేవేశా పుత్ర ప్రీతి వివర్ధన 
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం 
రక్ష గర్భిణీమ్. 6 

ప్రభాస, ప్రభవశ్శ్యామా ప్రత్యూషో మరుత నలదృవూధురా 
ధురశ్చైవ వసవోష్టౌ ప్రకీర్తితా ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం నిత్యం 
రక్ష గర్భిణీమ్. 7 

పితుర్ దేవీ పితుశ్రేష్టే బహు పుత్రీ మహా బలే 
భూత శ్రేష్టే, నిశావాసే నిర్వృతే, శౌనక ప్రియే 
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం 
రక్ష గర్భిణీమ్. 8

పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి చదువుకోవాలి. గర్భం దాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం అవుతుంది. గర్భస్రావం కావడం, పిల్లలు కలుగక పోవడం అనే సమస్య ఉండదు . 

శుభం .

- లక్ష్మి రమణ 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha