పాలు కాచేప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే,

3.234.244.105

పాలు కాచేప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది . 
-లక్ష్మీ రమణ 

పాలు , పెరుగు, వెన్న ,నెయ్యి అన్ని కూడా లక్ష్మీ స్వరూపాలు. ఆ పాల కడలిలోనుండే కదా లక్ష్మీ దేవి ఉద్భవించింది . లక్ష్మీదేవి క్షీరాన్న ప్రియ అని, ఆ క్షీరములోనే ఆవిడ నివశిస్తుందని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. అందువల్ల పాలు కాగపెట్టేప్పుడు ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని చెబుతారు. ఆవివరాలు తెలుసుకుందాం పదండి . 

లక్ష్మీ దేవికి శుచీ శుభ్రతలంటే, చాలా మక్కువ. అవి ఉన్నచోటే , ఆవిడ కూడా నివాసముంటుంది. అందువల్ల ఉదయాన్నే స్టౌ ఉన్న గట్టుని శుభ్రం చేసి, ఆ స్టవ్ ని, గట్టుని కూడా చక్కగా తడి గుడ్డతో తుడిచి ముగ్గు వేయాలి. పొయ్యికి కొద్దిగా పసుపురాసి, కుంకుమబొట్టు పెట్టాలి . ఆతర్వాత పాలు గిన్నెలో పోసి కాగపెట్టాలి . 

పాలు పొంగి ఒక చుక్క పొయ్యిలో పడేలా ఉంచితే, పాలు పొంగినట్టు సంసారం పొంగుతుందని పెద్దలు చెబుతారు. ఇక ఇలా పాలు పొంగినప్పుడు ఆ పాలల్లో రెండు బియ్యపు గింజలు వేయమని సూచిస్తుంటారు . అలాగే, పాలు చల్లరాలని మూతతీసి పెట్టకూడదట . 

లక్ష్మీదేవిని బంధించి ఉంచితేనే ఇంట్లో ఉంటుందని పెద్దలమాట. అందుకే డబ్బుని బీరువాలో పెట్టి తాళం వెయ్యాలి తప్ప, ఎక్కడంటే అక్కడ చిల్లర పైసలైనా విడిగా ఉంచొద్దని చెబుతుంటారు. అదే సూత్రం పాల విషయంలో వర్తిస్తుంది . 

ఇలా మూత తీసిపెడితే, పాలు ఆవిరై పోయినట్టు డబ్బులు కూడా ఆవిరై పోతాయని విశ్వాసం . పాలు కాచే  ముందు ఈ చిన్న పదహతిని  పాటిస్తే అంతా మంచి జరిగి, లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ఆర్ధిక బాధల విముక్తి కలుగుతుంది .దీంతోపాటు,  ఇంటిలో ఎప్పుడు సంతోషం,ప్రశాంతత నిలిచి ఉంటాయి . 

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna