తిరుచానూరు అమ్మవారు

44.192.21.182
తిరుపతి పట్టణానికి నాలుగున్నరు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుచనూరు. ఇక్కడ కొలువైన అలివేలు మంగమ్మ భక్తుల పాలిట కల్పవల్లి. శ్రీ మహావిష్ణువు హృదయేశ్వరి. సాక్షాత్తు శుక మహర్షి ఆశ్రమ ప్రాంతమిది. బ్రహ్మోత్సవ సమయంలో తిరుచనూరు తిరుమలను తపిస్తుంది. అమ్మవారి ఉత్సవం అంటే దేవదేవునికి కూడా పండగే. ఆ పదిరోజులూ శ్రీనివాసుడు ఇక్కడే ఉంటాడని భక్తుల నమ్మిక.

అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కార్తికమాసంలో (డిసెంబరు) 10 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. పంచమీతీర్థం అత్యంత విశిష్టమైనది. కార్తీకశుద్ధ పంచమికి ఉత్సవాలు ముగుస్తాయి.

#స్థలపురాణం : త్రిమూర్తులలో సత్యగుణ సంపన్నులెవరో తెలుసుకోవటానికి భృగ్నుమహర్షి మొదట బ్రహ్మను, శివుడిని పరిక్షిస్తాడు. ఆ తర్వాత వైకుంఠానికి వచ్చి శేషపాన్పుపై శ్రీలక్షీదేవితో నారాయణుడు ఏకాంతంలో ఉన్న సమయంలో అక్కడికి వస్తాడు. తనను గచమనించలేదని కోపంతో శ్రీవారి వక్షస్థంపై తన్నడం, శ్రీమన్నారాయణుడు ఆ మహర్షి పాదంలో ఉన్న నేత్రాన్ని నిర్మూలించడం జరుగుతుంది.

అమ్మవారు అలిగి తిరుచనారూరులో ఇప్పుడున్న పుష్కరిణిని ఏర్పరుచుకొని అందులో కలిసిపోయిందంటారు. 12 సంవత్సరాల తరువాత 13వ సంవత్సరం కార్తీక పంచమి రోజున పద్మసరోవరంలో బంగారు పద్మంలో #శ్రీమహాలక్ష్మీ ఆవిర్భవించిందంటారు. ఇలా #పద్మంలో జన్మించినది కాబట్టే #అలిమేమంగ అయ్యిందంటారు. ఆ పద్మసరోవరమే నేటి కోనేరు. బ్రహ్మోత్సవాలో అమ్మవారి జన్మ నక్షత్రమైన #శుక్లపంచమి రోజున నిర్వహించే పంచ తీర్థానికి వచ్చే వేలాది భక్తులు ఈ కోనేరులో స్నానం చేస్తారు.

ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని విజయనగర రాజు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయ ల కాలంలో నిర్మించారని తెలుస్తుంది. తిరుమల శ్రీవారికి ఆగమన శాస్త్ర ప్రకారం జరిగే నిత్యకైంకర్యాలన్నీ అమ్మవారికీ జరుగుతాయి.

పద్మావతి పరిణయం పేరుతో నిత్యకల్యాణోత్సవం, సాయంకాలం డోలోత్సవం నిర్విహిస్తారు.
ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో తెప్పోత్సవాలు, భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు జరుపుతారు.

#అలమేలు మంగ అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ, రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి. ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది.

అమ్మవారి ఆలయం వెనకాల ఉన్న కోనేరు, ప్రసిది చెందిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉన్నది గమనించగలరు.. కోరికలు తీర్చే ఆ అమ్మవారి గురించి మీ comment లో తెలుపగలరు.

- శ్రీనివాస గుప్తా వనమా

Quote of the day

If I had no sense of humor, I would long ago have committed suicide.…

__________Mahatma Gandhi