వరలక్ష్మి పూజ కోసం ఇవి రెడీగా ఉంచుకోండి.

3.236.212.116
వరలక్ష్మి పూజకోసం మీరు సిద్ధం చేసి ఉంచుకోవాల్సిన సామాన్ల లిస్ట్ క్రింద ఇవ్వబడింది.  ఇది మామూలుగా అందరు పూజకోసం ఉపయోగించేది.  మీ మీ ఆనవాయితీల ప్రకారం ఇంకా ఏమైనా కావాలంటే కలుపుకోండి. చివరి నిమిషంలో హడావిడి పడకుండా మీ సౌలభ్యం కోసం ఈ లిస్ట్ ఇవ్వబడింది. ఆడవారికి వరలక్ష్మి పూజ ఎంత ప్రాధాన్యత ఉందొ తెలుసు కనుక, మీరు కంగారు పడకుండా, అన్ని అందుబాటులో ఉంచుకుంటారు అనే ఉద్దేశంతో ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాము. 
 
పసుపు 
కుంకుమ 
అగర్వత్తులు 
కర్పూరం 
తమలపాకులు 
వక్కలు 
ఖర్జురాలు 
దారంబంతి 
గంధం డబ్బా 
పత్తి 
రవిక బట్టలు 2
తుండుగుడ్డ 1
అరటిపండ్లు 12
కొబ్బరికాయలు 3
అక్షతలు 100 గ్రా 
కలశానికి చెంబు (వెండి లేదా రాగి లేదా ఇత్తడి )
 
పంచామృతాలు: 
 
పాలు 1 గ్లాస్ 
పెరుగు 1 గ్లాస్ 
తేనె 50 గ్రా 
చక్కర 100 గ్రా 
ఆవునెయ్యి 250 గ్రా 
 
విడిపూలు 
పూలు - 10 మూరలు 
 
మండపం ఉంటే మండపం లో పూజ 
లేదా పీట మీద పూజ 
 
సెంటు సీసాలు 1
నువ్వుల నూనె 250 గ్రా 
వత్తులు 
అగ్గిపెట్టె 
అమ్మవారి ఫోటో 1
లక్ష్మి అమ్మ వారి ప్రతిమ 
దానిమ్మ పండ్లు  4
బత్తాయి పండ్లు  6
 
ప్రసాదం:
 
క్షీరాన్నం 
పులిహోర 
పూర్ణంబూరి 
శనగలు 1 kg (నీళ్లలో నానబెట్టాలి)
 
తోరణములు 5
చెంచాలు 3
పళ్ళాలు 4
గ్లాసులు 3
చెంబుతో నీళ్లు 
పంచపాత్ర 1
ఉద్ధరిణ 1
పళ్లెం 1
పీటలు 3
చాపలు 2
దీపారాధన కుందులు 2
గంట 1
ఏక హారతి 1
పంచపల గిన్నె 1
కొబ్బరికాయ కొట్టటానికి రాయి
 
పూజకు ముందు మండపం గాని, పూజ పీట గాని పసుపుతో అలంకరించి వలెను. 
 
పీట మీద పద్మం ముగ్గు వేసి, తెల్లని వస్త్రం వేసి, బియ్యం పోసి కలశం ఉంచవలెను. 
 
పూజకు 15 నిమిషముల ముందు పూజ ద్రవ్యములు , పసుపు, కుంకుమ అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, అగ్గిపెట్టె, అక్షంతలు, గంధం, నూనె, వత్తులు, పండ్లు, ప్రసాదం, మీకు అందుబాటులో ఉంచుకోవాలి. 
 
పంచపాత్ర, ఉద్ధరిణ, పళ్లెం, నీళ్లు, కూడా ఉంచుకోవాలి.  దీపారాధనలో నూనె, వత్తులు వేసి ఉంచుకోవాలి. 
 
 
 
 

Quote of the day

The Way is basically perfect. It doesn't require perfecting.…

__________Bodhidharma