Online Puja Services

అప్పులు తీరుటకు.. ఐశ్వర్య ప్రాప్తికి.

3.21.233.41
కమలాత్మిక మహాలక్ష్మీ పూజ
(అప్పులు తీరుటకు ఐశ్వర్య ప్రాప్తికి)
 
జీవులకు వారివారి కర్మానుసారము. సిరిసంపదలనందించేది మహాలక్ష్మి.
 
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ ర్నమోస్తుతే ॥
నమస్తే గరుడారూఢే ! డోలాసురభయంకరి ! ॥
సర్వపాపహరే ! దేవి ! మహాలక్ష్మీ ర్నమోస్తుతే ॥
 
అస్యశ్రీ మహాలక్ష్మీ మహామంత్రస్య దక్షప్రజాపతి బుషిః । గాయత్రీ ఛందః ।
శ్రీం బీజం! హ్రీం శక్తిః । నమః కీలకం । శ్రీ మహాలక్ష్మీ ప్రసాదేన మమ సకలైశ్వర్య
ప్రాప్తిధ్వారా మనోవాంఛా ఫలసిద్ధ్యర్థే జపేవినియోగః ॥
 
న్యాసము
శ్రీం హ్రీం శ్రీం కమలే శ్రీం హ్రీం శ్రీం |
శ్రీం హ్రీం శ్రీం కమలాలయే శ్రీం హ్రీం శ్రీం |
శ్రీం హ్రీం శ్రీం ప్రసీద శ్రీం హ్రీం శ్రీం!
శ్రీం హ్రీం శ్రీం ప్రసీద శ్రీం హ్రీం శ్రీం!
శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై శ్రీం హ్రీం శ్రీం!
శ్రీం హ్రీం శ్రీం నమః శ్రీం హ్రీం శ్రీం ॥
 
ధ్యానము : సింధూరాభాం చ పద్మస్థాం పద్మపత్రం చ దర్పణం !
అర్థపాత్రం చ దధతీం సద్ధారముకుటాన్వితాం ॥
నానాదాసీపరివృతాం కాంచీకుండలమండితాం ।
లావణ్యభూమికాం వందే సుందరాంగద బాహుకాం ॥
 
మంత్రం 
ఓం ఐం హ్రీ0 శ్రీ0 క్లీం జగత్ ప్రసూత్యై నమః ||
 
OR 
 
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః
( రెండింటిలో ఎదో ఒక్కటే 108 నుండి 1008 సార్లు కుంకుమార్చన చేస్తూ అర్చించాలి)
 
శ్రీ కమలాత్మిక క్షేత్రపాలకుడు: సదాశివ భైరవుడు
"" శం కరోతి సదాశివాయ మహా భైరవాయ స్వాహా "" అనే మంత్రం తో వీరిని తలుచుకుని నమస్కారం చేయాలి..( ఈ మంత్రం 108 సార్లు జపించాలి)
గ్రహము :శుక్రుడు (ఈ పూజ రోజు ఈ మంత్రం కూడ 108 సార్లు జపించాలి)
" ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః "
నైవేద్యం : పరమాన్నం..
కనకధార స్త్రోత్రం కానీ కమలాత్మిక స్త్రోత్రం కానీ చదివి హారతి ఇవ్వండి,
(కమలాత్మిక పూజ చేసే వారే ఈ భైరవ రూపాన్ని, శుక్రగ్రహ మంత్రం కూడ జపించాలి)
 
(బీజాలతో శ్రీ యంత్రం ఉన్నవారు శ్రీ సూక్తం తో అర్చన చేస్తే విశేష ఫలితం ఉంటుంది శ్రీ యంత్రం పూజించే పద్దతి తెలియని వారు పైన చెప్పిన విధంగా చేయవచ్చు, అది కూడా చేయలేని వారు ఇక్కడ చెప్పిన నియమాలు పాటిస్తూ ఐశ్వర్య దీపం పెట్టుకుంటూ గురువారం లక్ష్మీ పూజ, పసుపుకొమ్ములతో మండల దీక్ష పూజ చేసుకోవచ్చు..) ఏది చేసినా భక్తి నమ్మకం ముఖ్యం.
 
ఫలితం: ధన నష్టం జరుగుతున్న వారు, నగలు తాకట్టులో ఉన్నవారు, ఆదాయం వచ్చినట్టే ఉన్నా చేతికి అందకుండా నష్ట పోతున్న వారు, ఉపాధి లేని వారు అప్పులు ఉన్నవారు...శుభకార్యాలు కోరుకునే వారు ..సంకల్పమ్ చెప్పుకుని ఈ పూజ చేయండి...
 
(త్రయోదశి నాడు సింహ లగ్నం ఉన్నంత సేపు లక్ష్మీ పూజచేయడం అలవాటు చేసుకోండి, పద్మ పురాణం లో రహస్యంగా ఉన్న పూజ అదే త్రయోదశి నాడు సింహ లగ్నం గమనించి పూజించండి)
 
గమనిక: అప్పులు తీరుటకు పూజ సఫలం కావడానికి కొన్ని సూచనలు పాటించండి...
 
-రాత్రి పూట తల స్నానం చేయకండి,
-మంగళ శుక్రవారం లో దుమ్ములు దులిపే పని చేయకండి 
-మంగళవారం నాడు ఇంటి దేవుడికి విశేషంగా పూజ చేయండి
-శనివారం నాడు , మంగళవారం నాడు,నువ్వులు, చెప్పులు, గుడ్లు, ఉప్పు, మిరియాలు కొని ఇంటికి తీసుకురాకండి
-శుక్రవారం నాడు, మిరపకాయలు, పెరుగు , ఉప్పు మీ ఛాతితో ఎవరికి ఇవ్వకండి,
- అలాగే ఏ రోజు చేతికి నూనె , గుడ్లు,ఉప్పు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి..
-ఇంట్లో పగిలిన మాసిన వస్తువులు దుమ్ము క్లీన్ చేస్తూ ఉండండి.
-కొందరికి చిక్కు తీసిన వెంట్రుకలు ఆముల ఈమూల దాచడం అలవాటు ఉంటుంది అలా చేయకండి..
-నట్టింట్లో తల చిక్కు తీయకండి,
-సాయంత్రం 6 తర్వాత ,ఉప్పు, గుడ్లు, బట్టలు కుట్టే సూది, ఉప్పు ఇంటికి తీసుకుని రాకండి.
-ఇంటి యజమాని అమావాస్య నాడు గుడ్డుతో దిష్టి తీయండి 
-స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి చేయఁడి, ఇల్లు తుడిచే టప్పుడు రాళ్ళ ఉప్పు నీటిలో వేసి తుడవండి..
-గుమ్మం ముందు చెప్పులు విడవకండి పక్కన వదలండి. తలుపు పైన తువాలు వేయకండి 
-స్నానం చేసాక విడిచిన బట్టలు మళ్ళీ కట్టుకోకండి..
-శుక్రవారం పేలు దువ్వకండి, గోర్లు కత్తిరించకండి..
-ఎంత చేసినా అప్పులు తీరక వ్యాపారం కలిసి రాని వారు మంగళవారం, ఆదివారం మాంసం గుడ్లు తినకండి..మరేదైనా రోజు తినండి 
-వారం లో ఒక్కసారి అయినా కాకికి, కుక్కకు , అన్నం పెడుతూ ఉండండి...
-గొడుగు, చెప్పులు, నల్ల వస్త్రాలు, బహుమతిగా తీసుకోకండి..
-పులిహోర జేష్ట దేవికి ఇష్టం అది వండి పంచండి లేదా నైవేద్యం పెట్టి తినండి..
-మీ జన్మ నక్షత్రం రోజు అర్చన, పూజ, గుడిలో దీపాలు, దానం, జపం వీటిలో ఏదైనా మీకు త్వరగా ఫలితం ఇస్తుంది.
-దేవుడి జన్మ నక్షత్రం కన్నా మీ జన్మ నక్షత్రం రోజు ఏ పూజ చేసిన మీకు త్వరగా సిద్ధిస్తుంది.
ఇటువంటి కొన్ని నియమాలు పాటిస్తూ లక్ష్మీ పూజ చేయండి ఫలితం ఉంటుంది.
 
(సేకరణ)
 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya