Online Puja Services

లక్ష్మీదేవి ని ఇలా ఆహ్వానించండి

18.220.154.41

సాయంత్రం పూట దీపం పెట్టేటప్పుడు...........!!

శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి.
రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి. 

ఏ దేవీ, దేవతా పూజలోనైనా ఆవునేతి దీపం, నువ్వుల నూనెదీపం తప్పక వెలిగించాలి. 
దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీ దేవి కృప కోసం 
రెండు ముఖాల దీపం వెలిగించాలి. 

గణపతి అనుగ్రహం కోసం మూడు వత్తుల దీపం వెలిగించాలి.

ఆర్థిక లాభాలను ఆశించేవారు నియమపూర్లకంగా 
ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి. 
శత్రుపీడ విరగడ కోసం భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించాలి. 
సూర్య భగవానుని ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి. 

అలాగే దీపాలు పెట్టేవేళ ఇంటికి ముందు తలుపులు తెరిచి ఉంచాలని, వెనక తలుపులు మూసి వెయ్యాలని, దీపాలు పెట్టాక గోర్లు కత్తిరించకూడదని, ఏడ్వకూడదని, తల దువ్వకూడదని, సంధ్య సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలని, ఇలా అనేకం చెబుతూ ఉంటారు. అయితే ఇవన్ని ఎందుకు చెబుతారు అనేది 
చాల మందికి తెలియదు. 

సాయంత్రం పూట జ్యేష్టాదేవి వెనుక ద్వారం నుంచి.. లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని సంధ్య సమయం లోపు వెనక తలుపులను క్లోజ్ చేసి, ముందు తలుపులను తెరిచి ఉంచాలి. 
దాని వలన జ్యేష్టా దేవి ఇంట్లోకి రాకపోగా 
లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. 
మన ఇంటికి ఎవరైన గెస్ట్ వస్తారు అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి, మనం కూడా శుభ్రంగా తయారై, 
వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురుచూస్తుంటాం. 

అలాంటిది మన జీవితాలలో వెలుగును నింపడానికి 
ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరచుకుని, మనం కూడా శుభ్రంగా ఉండి 
ఆతల్లిని ఆహ్వానిస్తే, వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. 

అంతేకాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో 
గోర్లు కత్తిరించడం, తల దువ్వడం, ఏడ్వటం చేయకూడదని పండితులు చెప్తున్నారు.

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore