Online Puja Services

భగవంతుడు నన్ను నిరాకరించకుండా ఉండుగాక !

18.220.126.5

ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్రాణశ్చక్షుశ్శ్రోత్రమథోబలమింద్రియాణి చ సర్వాణి | 
సర్వం బ్రహ్మోపనిషదం మా2హం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ నిరాకరోదనిరాకరణమస్త్వనిరాకరణం మే2స్తు | 
తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు || 
ఓం శాంతిః శాంతిః శాంతిః || 
నా అవయవాలైన వాక్కు, ప్రాణం, కళ్ళు, చెవులు మరియు తక్కిన ఇంద్రియాలన్నీ అత్యంత శక్తిమంతమై ఉండుగాక ! 
ఉపనిషత్తులు వచించే భగవంతుడే సర్వం. 
ఆ భగవంతుని నేను నిరాకరించకుందును గాక.
భగవంతుడు నన్ను నిరాకరించకుండా ఉండుగాక ! 
భగవంతుని నుండి నిరాకరణ ఉండకుండు గాక ! 
నా నుండి నిరాకరణ ఉండకుండుగాక ! 
ఉపనిషత్తులలో వచింపబడిన ధర్మాలు ఆత్మను ఆకాంక్షించే నాలో నెలకొనుగాక !

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore