Online Puja Services

ముక్తిని పొందుదాం

3.137.170.183

ముక్తిని పొందుదాం!
                  

ప్రతి జీవుడు తాను తల్లిగర్భములో ఉన్నప్పుడు ఏడవ మాసములో ఉన్నప్పుడు తనకు పూర్వజన్మ స్మృతులు పూర్తిగా గుర్తుకు వస్తాయి. తాను గత జన్మలలో భగవంతుణ్ణి సేవించకపోవడము వలననే ఇప్పుడు మరోసారి తల్లిగర్భములోనికి ప్రవేశించవలసి వచ్చిందని గుర్తిస్తాడు.

గర్భములో నరకయాతన ఉంటుంది. శిశువు తలక్రిందులుగా వ్రేలాడదీయబడి కదలాడానికి కూడా చోటు ఉండదు. అనేక క్రిములు కరుస్తూ ఉంటాయి .చర్మము ఏర్పడదు. తల్లి ఏవైనా కారము, ఉప్పు అధికముగా తిన్నట్లైతే వెంటనే గర్భములోని శిశువు ను బాధిస్తుంది. మలమూత్రాదులు త్రాగవలసి వస్తుంది. గర్భములో భరించరాని దుర్వాసన ఉంటుంది. ఇదంతా భరించరాని నరకము. మనమందరమూ ఈ గర్భస్త నరకాన్ని అనుభవించినవారమే. 

గర్భస్థ స్థితిలో జీవుడి పై మాయా ప్రభావము ఉండదు.  అప్పుడు జీవుడికి కృష్ణభగవానుడు గుర్తుకు వస్తాడు ."హే కృష్ణా నన్ను ఈ ఒక్కసారి ఈ గర్భ నరకములోనుంచి బయటపడవేయమని, తాను బయటకురాగానే నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తానని వేడుకుంటాడు".  కానీ తల్లి గర్భములోనుంచి బయటపడగానే మాయా ప్రభావంలో పడి భగవంతుణ్ణి మరచిపోతాము.

ఈ వివరణ శ్రీమద్భాగవతం లో కపిలభగవానుడు తన తల్లి దేవహుతికి వివరించడము జరిగింది. కావున  మరోజన్మ ఉండకూడదని, మరోసారి గర్భస్థ నరకబాధను అనుభవించకూడదని మనము గుర్తించి శ్రీకృష్ణ భగవానుని నామాన్ని శ్రవణం చేస్తూ,  కీర్తిస్తూ, స్మరణం చేయడం వలన మన మరణ సమయంలో శ్రీకృష్ణభగవానుని స్మరించే అవకాశం ఉంటుంది.  మరణ సమయంలో శ్రీకృష్ణభగవానుని స్మరించినవారికి శాశ్వత ముక్తి లభిస్తుంది.

మనకు కలిగే నిజమైన దుఃఖములు - జన్మ, మృత్యువు, ముసలితనము, అనారోగ్యములు. 

మనము ఈ దుఃఖముల నుండి శాశ్వతమైన ముక్తి మార్గము గురించి ఆలోచించాలి. అసలు ఎందుకు మనకు ఇష్టం లేకపోయినా మనము దుఃఖబాధలకు గురవుతున్నామో ఆలోచించాలి.

 మనము గర్భావస్థలో ఉన్నప్పుడు భగవంతునికి ఇచ్చిన వాగ్ధానాన్ని మనము పాటించకపోవడం వల్లనే మనము మళ్లీ మళ్లీ జన్మలను పొందుతున్నాము. మనము దుఃఖములకు గురవుతున్నాము. మనము మరోసారి జన్మను పొందకపోవడమే మన అన్ని దుఃఖములకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం మనము భగవంతుని నామాన్ని జపించడమే.  ఇదే  మన అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం .

భగవంతునికి, భగవంతుని నామానికి బేధము లేదు.

కలియుగంలో ముక్తికి ఏకైక మార్గం హరినామ స్మరణ.

శ్రీ చైతన్య మహా ప్రభువు మనలను హరేకృష్ణ మహామంత్రము జపము, కీర్తనలు చేయమని సూచించారు. శ్రీకృష్ణభగవానుని ప్రేమతో భక్తియుతసేవలో పాల్గొనమని సూచించారు.

మహామంత్రం:

"హరేకృష్ణ   హరేకృష్ణ   కృష్ణకృష్ణ హరేహరే! 
హరేరామ హరేరామ రామరామ హరే హరే !! "

నిరంతరం జపం చేద్దాం. ముక్తిని పొందుదాం. శాశ్వతమైన ఆనందలోకమైన గోలోకంలో శాశ్వతంగా  నివసించే ప్రమోషన్ పొందుదాం.

- సేకరణ 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya