Online Puja Services

అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి

18.226.96.37
అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి - అన్నమయ్య కీర్తన  
 
అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి
చెప్పుడుమాటలకే నే జేరనైతిగా


కొసరికొసరి నీపై కోపమున నుంటిగాని
అసమిచ్చి నీతో మాటలాడనైతిగా
పసలేని సిగ్గుతోడి పంతాననే వుంటిగాని
ముసిముసి నవ్వు మోవి మోపనైతిగా


విరహపు కాకల నావిసుపే చూపితిగాని
సరిబిల్చితే నూకొన జాలనైతిగా
వరుసవంతులకై నే వాదులాడితి గాని
మురిపేన మొక్కితే నే మొక్కనైతిగా


వేగమే నీవు గూడితే వెస భ్రమసితిగాని
చేగలనీమేను పచ్చిసేయనైతిగా
భోగపు శ్రీవేంకటేశ పోట్లదొరతిలోన
నీగతి చెన్నుడవైతే నెనసితిగా
 
 
ఒక భక్తు రాలు, (ప్రేయసి) తన ప్రభువు పట్ల తాను ప్రవర్తించిన
తీరు గుర్తుకు తెచ్చుకొని బాధ పడుతున్నది.
అయ్యో నీవు నా పుణ్య ఫలము గా నా చెంతకు చేరి నప్పుడు, నేను నిన్ను లాలించక , సాధించితినే..


అయ్యో, అప్పుడు నా మతి ఎటున్నదో..
చెప్పుడు మాటల వల్ల నేను నీతో కూడక పోతినే..


కొసరి కోపం తో ఉన్నాను కాని నీ తో మాట్లాడ క పోతినే
అనవసర మైన సిగ్గు తో పంతాల తో ఉన్నా ను కాని చిరు నవ్వు మొఖమున తెచ్చుకో లేదే?


విరహ బాధ తో ఉన్న నా విసుగు చూపించితి కాని , పిలిస్తే మల్తాడక పోతినే..
ఇతరుల గూర్చి వాదిన్చానే నే కాని నేవు నన్ను లాలించితే నేను మొక్కలేదే

Quote of the day

Everything comes to us that belongs to us if we create the capacity to receive it.…

__________Rabindranath Tagore