Online Puja Services

అర్హత ఉన్న వాళ్లకి మాత్రమే దొరుకుతాయు.

3.142.197.212

ఒక అందమైన సాయంత్రం సముద్ర తీరంలో  సూర్యాస్తమయాన్ని చూస్తున్నాడు కృష్ణ. 

ఒడ్డున ఉన్న రాళ్ళ గుట్టలో  సూర్య కిరణాల తాకిడికి మెరుస్తూ ఒక రాయు అతన్ని ఆకర్షి౦చి౦ది. వజ్రమేమో అనిపించింది. కానీ అంత విలువైన వజ్రాలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయులే అని నవ్వుకుంటూ దానిని సముద్రంలో విసిరేసాడు. అలల తాకిడికి ఆ రాయు మళ్ళి అతని కాళ్ళ దగ్గరికే వచ్చింది. అలా ఎన్ని సార్లు నీళ్ళలో వేస్తున్న అది మళ్ళి వొడ్డుకి వస్తుంది.  కానీ ఈ సారి ఎందుకో  అతనికి ఆ రాయుని పారేయబుద్ది కాలేదు. దానిని అలాగే భద్రంగా జేబులో పెట్టుకున్నాడు.....! తిరిగి ఇంటి ముఖం పట్టాడు. 

చేస్తున్న పనిలో ఎదుగుదల లేక, నా అనుకున్న వాళ్ళు దూరమై  దిగులు పడుతూ  అలా  జేబులో చేయు పెట్టి నడుస్తుండగా ఆ రాయుని తడుముకున్నాడు. ఎందుకో తెలియదు దాన్ని తాకగానే అతనికి ఎదో స్వాంతన లభించింది. దాంతో అప్పుడప్పుడు దాన్ని తడుముకుంటూ చూసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు రోడ్డు పక్కన వానకి ఏర్పడ్డ నీళ్లకుంటలో రాళ్లు వేస్తూ ఆడుతున్నాడు కృష్ణ స్నేహితుడు. కృష్ణ కూడా అక్కడ ఉన్న రాళ్ళని నీళ్లలో విసరటం మొదలెట్టాడు.

 3 రాళ్ళూ చేతిలో తీసుకొని , 3 ఛాన్స్ లో ఎవరి రాయు ఎక్కువ దూరం వెళ్తే వాడే విన్నర్ అని ఇద్దరూ పోటీ పెట్టుకున్నారు. అలా ఇద్దరు తమ రాళ్ళను విసరడం మొదలెట్టారు......  కృష్ణ  చేతిలో ఉన్న రాళ్ళలో ఒకటి విసరకుండానే జారి పడిపోయింది. ఆటలో గెలవాలన్న ఆత్రంతో తను ఎంతో ఇష్టంగా దాచుకున్న రాయును తీసి విసిరేసాడు. 

అది చాల దూరం వెళ్ళింది. హే... నేనే గెలిచాను అంటూ అరిచాడు...!!

కానీ అంతలోనే తేరుకుని .... అరే అది నేను ఇష్టంగా దాచుకున్న రాయు రా అనవసరంగా పారేసా. 
వెళ్లి తెచుకుంటా రా... అన్నాడు మిత్రుడితో. 

పక్కన ఉన్న  ఫ్రండ్ నవ్వాడు. ఒరేయ్ కొంపతీసి అదేమన్న వజ్రం అనుకున్నావా? మనకున్న దరిద్రానికి వజ్రాలు, 
వైడూర్యాలు దొరుకుతాయనుకున్నావా రా...!! 

మనకి అంత అదృష౦ ఎక్కడ ఏడ్చిందిలే గాని నువ్వు ఊరికే దిగులు పడకు. 

ఫస్ట్ షో టైం అవుతుంది రా...పొదా౦ అన్నాడు.  సినిమా చూస్తున్నా గాని కృష్ణకి ఆ రాయే గుర్తోస్తుంది. వెంటనే లేచి మళ్ళి ఆ రాయు పారేసుకున్న నీళ్ళ కుంట దగ్గరికి వెళ్ళాడు. కాని చీకటి పడటంతో తెల్లారి వచ్చి చూద్దాం అని వెళ్ళిపోయాడు. మరునాడు వచ్చి చూసే సరికి ఆ నీళ్ళ కుంట పూడ్చిచేసి ఆ స్టలన్నీ బాగుచేస్తున్నారు. అక్కడ ఎంత వెతికినా ఆ రాయు దొరకలేదు. బాధ పడుతూ కూర్చున్న కృష్ణ ని చూసి....

రేయ్ ఆ beach లో ఇలాంటివి బోచ్చడు ఉంటాయు, తెచ్చుకుందాం పద అంటాడు అతని మిత్రుడు. సముద్ర తీరంలోకి వెళ్ళి అలాంటి రాయికోసం వెతకడం మొదలెట్టారు.

కాని దొరకదు. నిరాశతో... అలసిపొయి కుప్పకూలిన కృష్ణ ని చూసి రేయ్..... ఒకటి పోయుంది అంటే ఇంకా మంచిది ఎదో దొరుకుతుంది అని అర్ధం రా.......!! థింక్ పాజిటివ్ అంటూ ఓదార్చాడు ఆ ఫ్రెండ్. కానీ కృష్ణ మనసులో ఎదో వెలితి. రోజు ఆ beach కి వెళ్ళి అలాంటి రాయు కోసం వెతుకుతూ ఉన్నాడు. రోజులు, వారలు.... గడిచాయి. కానీ అలాంటి రాయు మళ్ళి దొరకలేదు. కోపంతో పెద్దగా అరవటం మొదలెట్టాడు.....!!

ఆ అరుపులు విని ఒక ముసలాయన కృష్ణ  దగ్గరకొచ్చాడు.  ఏమైంది..... బాబు ఎందుకు అంత బాధ పడుతున్నావ్ అని అడిగాడు.
ఇక్కడొక రాయు కోసం వెతుకుతున్నాను.... దొరకట్లేదు తాత అన్నాడు.

నీకు దొరికిన రాయు ఎలా ఉంటుందో చెప్పు అనగానే...దాని రంగు,సైజు దొరికిన స్థలం చూపిస్తాడు కృష్ణ.
అది విన్న ఆ ముసలాయన నవ్వుతూ.. అది నీకు మళ్ళి దొరకదు అన్నాడు.

ఏ...? ఎందుకు దొరకదు ఇక్కడ అలాంటివి చాలా ఉన్నాయుగా!!ఇంకొంచెం వెతికితే దొరుకుతుంది. నువ్వు కూడా నాకు సాయం చెయ్యు తాత ప్లీజ్ అని బ్రతిమిలాడుకున్నాడు.  

హుం.... ఇక్కడ అలాంటి వజ్రం ఒక్కటే ఉంది.... అది అదృష్టం కొద్ది నీకు దొరికింది బాబు.... అంటాడు ఆ ముసలాయన.
ఏంటి వజ్రమా...? 

ఏంటి తాత నువ్వు మాట్లాడుతుంది అన్నాడు కృష్ణ ఆశ్చర్యంగా!!

మట్టి పట్టి దాని కాంతి తగ్గింది బాబు... అంతగా దాన్ని ఎవరు గుర్తుపట్టలేరు. 
నీ నిర్లక్ష్యంతో అనవసరంగా దాన్ని పారేసుకున్నావ్ అన్నాడు.

కాని అది వజ్రం అని నీకెలా తెలుసు తాత...??

 అనుభవం నాయనా......!! 

అనుభవంతో దాని విలువ తెలిసినా..... దాని అవసరం నాకు ఇప్పుడు లేదు. అందుకే వదిలేశా అన్నాడు.

అయ్యో .... తాత అది వజ్రం అని తెలియక పారేసుకున్నాను. 
ఇప్పుడు ఎలా అని ఏడ్చాడు.

"ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి" అది డబ్బు అయిన, మనిషైన.

కానీ నీ నిర్లక్ష్యమే దాన్ని నీకు  దూరం చేసింది. దాన్ని పొందే అర్హత నీకు లేదు అని చెప్పి  వెళ్ళిపోయాడు ఆ ముసలాయన.

కథలా ఉంది కదా.... కాదు నిత్యం మన జీవితంలో జరుగుతున్న వాస్తవ౦

ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్న నిజం. 

వస్తువైనా.... మనిషైనా సరే. అవి మన దగ్గరున్నంత సేపు వాటి పట్ల ఎక్కడ లేని నిర్లక్ష్యం..... !!

ఏది వాడుకోవాలో, ఏది ఉపయోగించుకోవాలో తెలియని స్థితి లో ఉన్నాం.

ఇది కాకపోతే...   దీని బాబులాంటిది ఇంకోటి దొరుకుతుంది అనే ధీమా.

ప్రతి ఒక్కటి "USE & THROW" మనుషులతో సంబందాలైనా ఇంతే....!!

ఏ...?  ప్రపంచం లో వీళ్ళు తప్ప ఇంకా మనుషుల్లెరా....?? 
అంటూ కొత్త కొత్త బంధాల కోసం వెంపర్లాడుతున్నాం.
వదిలేయటం, వదిలించుకోవడం సులభమే. 
కాని పోయింది  తిరిగి రావడం అంత సులభం కాదు. 

నిజమే... అందరికి అన్ని దొరకవు....!!

ఈ రోజుల్లో అంత మంచి వాళ్ళు ఎవరు లేరు లే...!!
ఈ రోజుల్లో కూడా అలాంటివి దొరకవు  లే...!!
అంటూ మనకి మనమే statements ఇచ్చేసుకుంటూ పోతున్నాం.

కాని మన అదృష్టం కొద్ది కొంతమంది మన జీవితంలోకి వస్తారు.
వారితో నీ అనుబంధం ఎలాంటిదో నీకు మాత్రమే తెలుసు.

వాళ్ళు,వీళ్ళు ఎదో చెప్పేస్తే నమ్మేస్తావా? 
నీ ఈగో ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతవా?

కొంతమంది నీ  మనసు నొచ్చుకోకుండా ఉండాలని ఓదార్పు మాటలు చెప్తారు.
ఎంత మంది ఎన్ని చెప్పినా.... నీ కంటూ ఒక point of view ఉంటుంది.
దాని ప్రకారం తీసుకునే నిర్ణయం  నీ సొంతదయ్యుండాలి.
అందరూ ఒకేలా ఉండటానికి  మనుషులేమి మెషిన్లు కాదు.
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి.
ఎవరు దూరమైతే మీ సంతోషం దూరం అవుతుంది అనిపిస్తుందో వారి చెంతకే చేరాలి.
sorry, Thanks అనే పదాలు బూతులు కాదు.
చిన్న sorry చెప్పేస్తే సరిపోయే విషయానికి ఈగో లు చూపించకండి.
ఎందుకంటే ఒకరితో ఉన్న అనుభందం మరొకరితో ఎన్నటికి ఏర్పడదు.
ఒక్కటి గుర్తుంచుకో... అందరికి అన్ని దక్కవు... 
అర్హత ఉన్న వాళ్లకి మాత్రమే దొరుకుతాయు.
దొరికిన దాన్ని జాగ్రత్త చేసుకోవడం మన  చేతుల్లో ఉంది. 
అది వస్తువైనా.... బంధమైనా...!!

Swa'Roopa Devarakonda

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore