భగవద్గీత చావుమేళం కాదు

3.239.58.199

*భగవద్గీత చావుమేళం కాదు ... కారాదు.*

*దయచేసి చనిపోయిన శవాల వద్ద భగవద్గీతను పెట్టకండి ..*

*వినాశకాలే విపరీత బుద్ధి.*

భగవద్గీతను “శవ” సంకేతానికి , “శవయాత్రలకు” మొట్టమొదట ప్రారంబించిన.... చవట/సన్నాసి/నీచ/నికృష్ట వెధవ ఎవడోగానీ ....
ఏం దరిద్రం ఇది ? 

పవిత్రమైన, జ్ఞానప్రదాయని అయిన భగవద్గీతను
 “పీనుగ లేచింది” అనే సంకేతంగా మార్చిన పైత్యం ఎవరు నేర్పినారు? 
 
ఇంట్లో భగవద్గీత పెట్టుకోవాలంటేనే భయపడే స్తితికి తీసుకొచ్చారు .

ఒకప్పుడు భ్రహ్మముహూర్త కాలంలో ,
ప్రభాత వేళలో గుడి మైకులనుండి వినబడే 
ఆతీ మధురమైన ఘంటసాల గారి భగవద్గీత మనోల్లాసాన్ని కలిగించేది , 
అనంత కాలగమనంలో మనిషి జీవితం ఎంతచిన్నదో  కాలస్వరూపమైన దైవం ఎంత విస్తృతమో 
నిత్యం గుర్తుచేస్తూ ఉండేది . 
పండితుడైనా పామరుడైనా ఒక విధమైన ట్రాన్స్ లో కి తీసుకెళ్ళేది 
ఎదో తెలియని ఆధ్యాత్మిక భావన అనిర్వచనీయమైన హృదయ వైశాల్యాన్ని కలిగించేది.  

అటువంటి భగవద్గీతకు ఎంత భ్రష్టత్వం ఆపాదిస్తున్నాము.
కలికాల ప్రభావమా ..? దైవ ఉపాసనలకు బదులు పిచాచ ఉపాసనలు ? ఏం ఖర్మ ఇది ?

ఈ దిక్కుమాలిన ప్రాక్టిస్ తెలుగు రాస్త్రాలలోనేనా ?
దేశం మొత్తం భూత ప్రేతాలు ఆవహించాయా ??

ఇప్పటికైనా మారండి.. పాపం మూటగట్టుకోకండి... నాయనా ...

ఆలోచించండి ఈ నీచ సంస్కృతినుండి బయటపడండి . తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమంలా
చైతన్యం కలిగించండి....... 

ఇప్పటినుండి చావుల దగ్గర, భగవద్గీత వేయకుండా
ఆపండి ..

*ఈ మెసేజ్ గురించి మనమందరం ఆలోచించాలి.. ఈ అనాచారం ఇకనైనా ఆపాలి.*

*ధర్మాన్ని  రక్షించండి*

- వాట్సాప్ సేకరణ 

Quote of the day

And as long as you're subject to birth and death, you'll never attain enlightenment.…

__________Bodhidharma