Online Puja Services

ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే, అద్భుతాలు కనిపిస్తాయి !

3.149.251.155

ఆయన రూపావిశేషాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే, అద్భుతాలు కనిపిస్తాయి !
-లక్ష్మీ రమణ 

పరబ్రహ్మ తత్వమే అయ్యప్ప రూపం. దానికోసం చేయవలసిన తపస్సే అయ్యప్ప మాల . యోగవిశేషాలనూ, వేదాంత సారాన్ని కాసి వడబోసి , చక్కని మండలదీక్షగా మలిచి తన భక్తుల కోసం అందించాడీ ధర్మశాస్త . జీవుడిలో , దేవుడిని, దేవునిలో జీవుడిని లయంచేసే ఆ ఆల్కెమీ ఈ అయ్యప్పకే సొంతమయ్యింది . ఇద్దరునాన్నలనీ - అమ్మానాన్నగా మలుచుకున్న ఆ తత్వానికి ఏదిప్రకృతి ? ఏది వికృతి .  అనన్యసామాన్యం ఆ స్వామీ రూపం. ఆయన రూపావిశేషాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే, అద్భుతాలు కనిపిస్తాయి .  
 
స్వామివారు చిన్ముద్ర రూపంలో అభయమిస్తారు. అయితే ఈ చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఉంది. ముద్ర అంటే అభినయం. ‘చిన్‌’ అనే పదం చిత్తాన్ని సూచిస్తుంది. ‘ చిత్తములోని వృత్తులని నిరోధించి , భగవంతునిలో లయంచేసే ముద్రాయిది .  చిత్తాన్ని సిద్ధింపజేసేది అని అర్థం. చిన్ముద్రలో జాగురూకత నిండుగా కనిపిస్తుంది. దీనిలో చూపుడు వేలు అహంకారాన్ని, బొటనవేలు బ్రహ్మం, మిగిలిన మూడు వేళ్లు రాజస, తామస, సత్వగుణాలను సూచిస్తాయి. ఆవిధంగా స్వామి వాటిని జయించి , భగవంతుని తత్వాన్ని తెలుసుకోమని తన చిన్ముద్రద్వారా చెబుతుంటారు .  చూపుడు వేలు ఎప్పుడూ ఇతరుల తప్పులను చూపించి నిందలు మోపడానికి, భయపెట్టడానికి ఉపయోగిస్తాం. అందుకే జపం చేసే వేళ ఈ వేలుని ఉపయోగించరు. ఈవేలిని అహంకారానికి చిహ్నంగా భావిస్తాం.

బొటన వేలు మిగతా నాలుగు వేళ్లకు ఆధారం. ఇదే గనుక లేకపోతే ఏ పనులు చేయలేం. మిగతా వేళ్లు కూడా శక్తిని కోల్పోతాయి. అందుకే బొటనవేలిని ఆత్మగా, ఆధారం బ్రహ్మంగా చెబుతారు. మిగతా మూడు వేళ్లు త్రిగుణాలను గ్రహించడానికి ఉపయోపడతాయి. విజ్ఞానం పొందడానికి, ఆహారం స్వీకరించడానికి, ఇతరులతో పోరాడి విజయం సాధించడానికి ఉపయోగపడతాయి. త్రిగుణాలను అధీనంలో తెచ్చుకుని, బ్రహ్మం గురించి తెలుసుకుని జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చని చెప్పడమే చిన్ముద్ర వెనుక పరమార్థం.

 బ్రహ్మం గురించి తెలిస్తే అహంకారం మాయమవుతుంది. ఇదే జీవాత్మ పరమాత్మ సంగమం. దీని అంతిమ పరిణామం సంపూర్ణ జ్ఞాన సిద్ధి. త్రిగుణాలను అదుపులో ఉంచి, పరబ్రహ్మంతో ఐక్యం అయ్యేవాడికి జ్ఞాన ప్రాప్తి లభిస్తుంది. చిన్ముద్ర మనకు ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. భగవానుని అనుగ్రహం పొందే మార్గం తెలిపే ముద్రగా దీనిని పేర్కొంటారు.

ఇక అయ్యప్పస్వామి ఎడమ చేయి పాదాలను చూపుతున్నట్లుగా ఉంటుంది. పరమాత్మలో జీవాత్మ లీనం కావాలంటే ముందు స్వామి పాదాలను శరణు కోరాలని అర్థం. అంటే స్వామిని త్రికరణ శుద్ధిగా నమ్మి పాదాల వద్ద శరణాగతి చేయడం వల్ల జీవాత్మకు పరమాత్మను చేరే సమర్థత కలుగుతుంది. ‘పట్టబంధనం’ అనే సూత్రం స్వామి మోకాళ్ల కింది నుంచి వాటిని ఉంటుంది. నిశ్చలమైన ఆ భంగిమలో కూర్చుని తనను నమ్మి వచ్చే భక్తుల కోర్కెలు తీర్చి వారిలో ఆధ్యాత్మిక చింత పెంపొందేలా చేస్తానంటూ ప్రసన్నమైన ముఖంతో స్వామి అభయమిస్తారు.

ధ్యానంలో ఎక్కువకాలం ఉండాలంటే ఆసన సిద్ధి కలగాలి.  ఆసన సిద్ధి కలిగితేనే ఫలవంతం అవుతుంది అని తెలియజేయడం కోసమే , ధర్మశాస్త్ర యోగాసనం, పై  ఆశీనులయ్యారు  .

శరణమయ్యప్ప !!


                 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore