Online Puja Services

సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమ్

3.137.161.222

సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమ్- (శివరహస్యాంతర్గతం) 
-సేకరణ : లక్ష్మి రమణ 

ఇది మహిమాన్వితమైన మంత్రగర్భితమైన స్తోత్రం. శంకరులు ఈ స్ఫూర్తితోనే భుజంగప్రయాతం రచించారు. భుజంగరూపుడైన సుబ్రహ్మణ్యుని భుజంగ ప్రయాతంలో స్తుతిస్తే ఆ శ్లోకములు మంత్రగర్భితాలు అవుతాయి. ఇది చెవిలో పడ్డా చాలు అనేక రోగాలు పోతాయి. సుబ్రహ్మణ్యుని తలంచుకుంటే రోగాలు, శత్రుబాధలు పోతాయి. అమంగళములు తొలగిపోతాయి. అసురశక్తులు నశిస్తాయి. సుబ్రహ్మణ్యుని భుజంగప్రయాతంలో మొట్టమొదట స్తుతించిన వారు దేవతలు. ఆ రహస్యం తెలిసిన మహానుభావులు ఆదిశంకర భగవత్పాదుల వారు సుబ్రహ్మణ్యభుజంగ ప్రయాతములు రెండు రచించారు. ఈ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతాన్ని ఎవరు చదువుతారో వారు ధన్యులు అవుతారు. అభీష్టసిద్ధులు గొప్పగా లభించాలన్నా, దుఃఖములు తొందరగా తొలగిపోవాలన్నా నూరుమార్లు ఈ స్తోత్రాన్ని చదవడం మంచిది. 

భజేఽహం కుమారం భవానీ కుమారం
గళోల్లాసిహారం నమత్సద్విహారమ్ |
రిపుస్తోమపారం నృసింహావతారం
సదానిర్వికారం గుహం నిర్విచారమ్ || ౧ ||
 
నమామీశపుత్రం జపాశోణగాత్రం
సురారాతిశత్రుం రవీంద్వగ్నినేత్రమ్ |
మహాబర్హిపత్రం శివాస్యాబ్జమిత్రం
ప్రభాస్వత్కళత్రం పురాణం పవిత్రమ్ || ౨ ||
 
అనేకార్కకోటి-ప్రభావజ్జ్వలం తం
మనోహారి మాణిక్య భూషోజ్జ్వలం తమ్ |
శ్రితానామభీష్టం నిశాంతం నితాంతం
భజే షణ్ముఖం తం శరచ్చంద్రకాంతమ్ || ౩ ||
 
కృపావారి కల్లోలభాస్వత్కటాక్షం
విరాజన్మనోహారి శోణాంబుజాక్షమ్ |
ప్రయోగప్రదానప్రవాహైకదక్షం
భజే కాంతికాంతం పరస్తోమరక్షమ్ || ౪ ||
 
సుకస్తూరిసిందూరభాస్వల్లలాటం
దయాపూర్ణచిత్తం మహాదేవపుత్రమ్ |
రవీందూల్లసద్రత్నరాజత్కిరీటం
భజే క్రీడితాకాశ గంగాద్రికూటమ్ || ౫ ||
 
సుకుందప్రసూనావళీశోభితాంగం
శరత్పూర్ణచంద్రప్రభాకాంతికాంతమ్ |
శిరీషప్రసూనాభిరామం భవంతం
భజే దేవసేనాపతిం వల్లభం తమ్ || ౬ ||
 
సులావణ్యసత్సూర్యకోటిప్రతీకం
ప్రభుం తారకారిం ద్విషడ్బాహుమీశమ్ |
నిజాంకప్రభాదివ్యమానాపదీశం
భజే పార్వతీప్రాణపుత్రం సుకేశమ్ || ౭ ||
 
అజం సర్వలోకప్రియం లోకనాథం
గుహం శూరపద్మాదిదంభోళిధారమ్ |
సుచారుం సునాసాపుటం సచ్చరిత్రం
భజే కార్తికేయం సదా బాహులేయమ్ || ౮ ||
 
శరారణ్యసంభూతమింద్రాదివంద్యం
ద్విషడ్బాహుసంఖ్యాయుధశ్రేణిరమ్యమ్ |
మరుత్సారథిం కుక్కుటేశం సుకేతుం
భజే యోగిహృత్పద్మమధ్యాధివాసమ్ || ౯ ||
 
విరించీంద్రవల్లీశ దేవేశముఖ్యం
ప్రశస్తామరస్తోమసంస్తూయమానమ్ |
దిశ త్వం దయాళో శ్రియం నిశ్చలాం మే
వినా త్వాం గతిః కా ప్రభో మే ప్రసీద || ౧౦ ||
 
పదాంభోజసేవా సమాయాతబృందా-
రకశ్రేణికోటీరభాస్వల్లలాటమ్ |
కళత్రోల్లసత్పార్శ్వయుగ్మం వరేణ్యం
భజే దేవమాద్యంతహీనప్రభావమ్ || ౧౧ ||
 
భవాంభోధిమధ్యే తరంగే పతంతం
ప్రభో మాం సదా పూర్ణదృష్ట్యా సమీక్ష్య |
భవద్భక్తినావోద్ధర త్వం దయాళో
సుగత్యంతరం నాస్తి దేవ ప్రసీద || ౧౨ ||
 
గళే రత్నభూషం తనౌ మంజువేషం
కరే జ్ఞానశక్తిం దరస్మేరమాస్యే |
కటిన్యస్తపాణిం శిఖిస్థం కుమారం
భజేఽహం గుహాదన్యదేవం న మన్యే || ౧౩ ||
 
దయాహీనచిత్తం పరద్రోహపాత్రం
సదా పాపశీలం గురోర్భక్తిహీనమ్ |
అనన్యావలంబం భవన్నేత్రపాత్రం
కృపాశీల మాం భో పవిత్రం కురు త్వమ్ || ౧౪ ||
 
మహాసేన గాంగేయ వల్లీసహాయ
ప్రభో తారకారే షడాస్యామరేశ |
సదా పాయసాన్నప్రదాతర్గుహేతి
స్మరిష్యామి భక్త్యా సదాహం విభో త్వామ్ || ౧౫ ||
 
ప్రతాపస్య బాహో నమద్వీరబాహో
ప్రభో కార్తికేయేష్టకామప్రదేతి |
యదా యే పఠంతే భవంతం తదేవం
ప్రసన్నస్తు తేషాం బహుశ్రీం దదాసి || ౧౬ ||
 
అపారాతిదారిద్ర్యవారాశిమధ్యే
భ్రమంతం జనగ్రాహపూర్ణే నితాంతమ్ |
మహాసేన మాముద్ధర త్వం కటాక్షా-
వలోకేన కించిత్ప్రసీద ప్రసీద || ౧౭ ||
 
స్థిరాం దేహి భక్తిం భవత్పాదపద్మే
శ్రియం నిశ్చలాం దేహి మహ్యం కుమార |
గుహం చంద్రతారం సువంశాభివృద్ధిం
కురు త్వం ప్రభో మే మనః కల్పసాలః || ౧౮ ||
 
నమస్తే నమస్తే మహాశక్తిపాణే
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే |
నమస్తే నమస్తే కటిన్యస్తపాణే
నమస్తే నమస్తే సదాభీష్టపాణే || ౧౯ ||
 
నమస్తే నమస్తే మహాశక్తిధారిన్
నమస్తే సురాణాం మహాసౌఖ్యదాయిన్ |
నమస్తే సదా కుక్కుటేశాఖ్యక త్వం
సమస్తాపరాధం విభో మే క్షమస్వ || ౨౦ ||
 
కుమారాత్పరం కర్మయోగం న జానే
కుమారాత్పరం కర్మశీలం న జానే |
య ఏకో మునీనాం హృదబ్జాధివాసః
శివాంకం సమారుహ్య సత్పీఠకల్పమ్ || ౨౧ ||
 
విరించాయ మంత్రోపదేశం చకార
ప్రమోదేన సోఽయం తనోతు శ్రియం మే |
యమాహుః పరం వేద శూరేషు ముఖ్యం
సదా యస్య శక్త్యా జగత్భీతభీతా || ౨౨ ||
 
యమాశ్రిత్య దేవాః స్థిరం స్వర్గపాలాః
సదోంకారరూపం చిదానందమీడే |
గుహస్తోత్రమేతత్ కృతం తారకారే
భుజంగప్రయాతేన హృద్యేన కాంతమ్ || ౨౩ ||
 
జనా యే పఠంతే మహాభక్తియుక్తాః
ప్రమోదేన సాయం ప్రభాతే విశేషః |
న జన్మర్క్షయోగే యదా తే రుదాంతా
మనోవాంఛితాన్ సర్వకామాన్ లభంతే || ౨౩ ||
 
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమ్ |


 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore