Online Puja Services

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి చరితం....5 వ.భాగం

3.139.82.23
సుబ్రహ్మణ్యస్వామికి తమిళంలో ఒక నానుడి ఉంది. అది ఏమనగా ఎత్తైన గుట్టలున్న (కొండలు) చోటల్లా కుమారుడు ఉంటాడు అని అంటారు. 99% సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కొండలపైనే ఉంటుంది.
 
సుభ్రహ్మణ్యుడికి ఆరుముఖాలు. ఆరుగురు కృత్తికలచే పెంచ బడ్డాడు.షష్టి(ఆరు)నాడు పుట్టాడు. పేరుకు షణ్ముఖుడు.ఈయన మంత్రం ఆరు అక్షరాలు. శరవణభవ. ఈయన పేరిట ప్రసిద్ధ ఆలయాలు ఆరు. ఇవే ఈయన ఆరు ప్రీతికర గృహాలు.

కుండలిని శక్తిని స్వాధీనం చేసుకున్న వాడు.కుండలిని శక్తి ఆరు చక్రాలు కలది.

1.మూలాధారం.
2.స్వాధిష్టాన చక్రము.
3.మణి పూరక చక్రము.
4.అనాహత చక్రము.
5. విశుద్ధ చక్రము.
6.ఆజ్ఞాచక్రము.
     
ఈయనకు ఆరు ప్రీతికరము. ఈయన తిరుమంత్రం విశిష్టత.

1, శ లక్ష్మీ బీజము. అధిదేవత శంకరుడు.
2. ర  అగ్ని బీజము. అధి దేవత అగ్ని.
3. వ అమృత బీజము. అధి దేవత వరుణదేవుడు.
4. ణ యక్షబీజము. అధిదేవత బలభద్రుడు.
5. భ అరుణ బీజము. అధి దేవత భద్రకాళి.
6. వ అమృత బీజము. అధి దేవత చంద్రుడు.
 
శరవణభవ  అంటే, శ అంటే శమింప చేయువాడు. ర అంటే రతిపుష్టి ఇచ్చే వాడు. వ అంటే వoధత్యం రూపుమాపు వాడు. ణ అంటే రణమున జయమునిచ్చువాడు. భ అంటే భవ సాగరమును దాటించే వాడు. వ అంటే వందనీయుడు.

ఈయన యొక్క ఆరు ప్రముఖ క్షేత్రాలు (ష ష్టి క్షేత్రాలు) అన్ని తమిళ నాటనే ఉన్నవి. అవి 1.తిరుచెందూర్ 
2. స్వామిమలై. 3.పళని 4.తిరుప్పరకుండ్రం. 5.తిరుత్తణి 6.పలముదిర్ చోలై . 
 
ఈ ఆరు క్షేత్రాలు ఆరు చక్రాలకు సంభందం. యోగులు  కుండలిని ఆరు చక్రాలను ఈ విధముగా పోల్చి చెబుతారు. ప్రతి ఆలయం భక్తుడి శరీరంలో ఓ ప్రత్యేకమైన చక్రానికి సంభందించిన శక్తిని మేల్కొలుపుతుంది అని అంటారు.
 
మొదట సందర్శించాల్సిన క్షేత్రం తిరుప్పర కుండ్రం. వెన్ను పూస మూలం లోని మూలాధార చక్రాన్ని ప్రేరేపించేది.   తరువాత చక్రం తిరుచెందూర్ స్వాధిష్టం. ఫళని ఆలయం మణిపూర చక్రం. తర్వాత సందర్శించాల్సిన ఆలయం స్వామిమలై. ఇక్కడ హృదయా గతమైన అనాహత చక్రం మేల్కొంటుoది. తిరుత్తణి  గుడిలో దైవభక్తి సంకేతం విశుద్ధ చక్రం, పలముదిర్ చోలై దైవదృష్టి సంకేతం మూడో కన్ను లాంటి ఆజ్ఞాచక్రాన్ని ప్రజ్వలింప చేస్తాయి. 

ఈ విధముగా ఇలా ఆలయాల సందర్శనం ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవం. ఇది కేవలం తీర్థ యాత్ర కాదు. భక్తుడు తనలోపలి దైవ రూపాన్ని, బయట ఆ దైవం ప్రకృతి రూపంలో సృషించిన అనేకానేక రూపాల్ని భక్తితో దర్శించుకోవడానికి, వాటిని చేరుకోవడంతో వుండే విశిష్టానుభవాన్ని సొంతం చేసుకోవడానికి ఈ పవిత్ర తీర్థ యాత్ర ఒక సువర్ణావకాశం. దీన్ని ఒక్కో ఆధ్యాత్మికశాఖ ఒక్కోవిధంగా వర్ణిస్తుంది.

ప్రస్తుతం ప్రపంచమంతా ఎన్నో మురుగన్ ఆలయాలున్నా ఈ ఆరు మాత్రం ఒక ప్రత్యేకం. దక్షిణ భారతదేశం, శ్రీలంక ప్రాంతాల్లో స్కందుడికి వేల సంఖ్యలో ఆలయాలున్నాయి. తమిళులు దేశవిదేశాలకు వలసవెళ్లి అక్కడంతా వారి ఇష్ట దైవం మురుగన్ కు ఆలయాలు నిర్మించేశారు. ఇంగ్లాoడ్, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, మలేషియా, ఫ్రాన్స్ కొన్ని ఉదాహరణలు.

రేపటి నుండి ఒక్కో ఆలయం విశిష్టతను తెలుపుతాను.

ఇట్లు
భవదీయుడు
L. Rajeshwar 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore