పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తాం?

44.192.25.113

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 

             ♦️ఆదిపూజ్యోగణాధిపమ్"♦️

👉సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా "విఘ్నేశ్వరుని" పూజించాలి.

⚜️🚩ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు "పసుపు" విఘేశ్వర పూజ చేయాలి. 
👇దానికో కథ వుంది....

🚩పూర్వం "త్రిపురాసురులు" అనే రాక్షసులు వుండే వారు...
👉వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నిటినీ బాధించసాగారు.
🚩ఆకాశంలో "మూడు" నగరాలను నిర్మించుకొని దేవతలను ,లోకాలనూ బాధించసాగారు. 
👉వీళ్ళ బాధలు భరించలేక దేవతలు ప్రజలు...   "శివుణ్ణి" ప్రార్థించారు .

🚩అపుడు శివుడు రక్షిస్తానని అభయమిచ్చాడు.  . "శివుడు" ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు . 
👉నందిని ఆ మూడు నగరాలను తన కొమ్ములతో యెత్తి పట్టుకోమన్నాడు.
🚩అప్పుడు శివుడు... నంది కొమ్ముల పై యెత్తిన మూడు నగరాలతో సహా త్రిపురాసులను సంహరించాడు. 

👉ఆ సమయంలో "నంది" "కొమ్ము" ఒకటి తెగి పడిపోయింది....అదే పసుపుకొమ్ము. 

🚩దానితో నందికి చాలా దు:ఖం కలిగింది .
"గణపతి" అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెదికి        తెచ్చాడట.....

👉కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది.... 

🚩అది చూచిన శివుడు "నందీ...నీ పసుపు కొమ్ము పడిన చోటున మొలిచిన....
👉"పసుపు కొమ్ముల" తోనే చూర్ణించగా వచ్చిన "పసుపు"తో "పసుపు గణపతి"ని చేసి.....
యే పూజకైనా మొదట పూజింప వలసినదే" అన్నాడట...

🚩ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన "పసుపు"తోనే తయారుచేసిన పసుపు గణపతికి పూజ మొదలైందట!

👉అందుకే ఆయన "ఆది దేవుడు" ,
"ప్రథమ పూజ్యుడు" అయ్యారు.

            ♦️"ఓం గం గణపతయే నమః"♦️ 

🚩వినాయకుడి పూజలో మనకు అతిముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం.
👉వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం....ఎందుకంటే 

🚩ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి
                 ♦️"స్థిరో భవ,వరదో భవ, 
                         సుప్రసన్నో భవ, 
                         స్థిరాసనం కురు" ♦️
👉అని చదువుతారు. అందుకే "గజాననుని" ముందు, రోజు కూర్చునే ప్రయత్నం చేయండి.
🚩అందరూ రోజు కాసేపు "గణపతి"పూజకి కేటాయించండి. .

👉మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్ధం అవడానికి ఇది బాగా ఉపకరిస్తుంది
🚩కనుక గణపతి ఆరాధనను మీ నిత్యజీవితంలో భాగం చేసుకొండి.

👉పిలిస్తే పలికే దైవం "గణనాధుడు"

         🌷🌷ఓం గం గణపతయే నమః

- సత్య వాడపల్లి 

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna