పాదరస గణపతి...........!!

44.192.25.113
‘బ్రహ్మ పురాణం’ ఆధారంగా పాదరస గణపతిని పూజిస్తే భక్తిభావన, ఆటంకాలు తొలగిపోవటం, ధనాభివృద్ధి, పేరుప్రఖ్యాతలు, సుఖసౌఖ్యాలు, మంచి పాండిత్యం, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతాయి. అన్ని కార్యములకు పూజలకు మొదట పాదరస గణపతిని పూజిస్తే ఎటువంటి విఘ్నాలు కలగకుండా సర్వ కార్యసిద్ది కలుగుతుంది.
 
జాతకచక్రం లో చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు మనస్సు చంచలంగా ఉంటుంది. మానసిక చికాకులు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం. సరియైన నిర్ణయాలు తీసుకోలేక పోవటం. తల్లితండ్రులకి సంబందించిన సమస్యలు,స్ధిర ఆస్తులకు సంబందించిన సమస్యలు ఉంటాయి .పాదరస గణపతి ని పూజించటం వలన ఈ సమస్యలు నివారించవచ్చును.
 
పాదరసం అంటే చైతన్యానికి ప్రతీక. పాదరస గణపతి మహా శక్తివంతమైంది. పాదరసం ఒకచోట స్థిరంగా నిలవకుండా పారుతూ ఉంటుంది కనుక దీన్ని ''పారద'' అని కూడా అంటారు.స్థిరంగా నిలవకుండా సర్వత్రా ప్రవహిస్తూ ఉంటుంది కనుక పారద గుణాన్ని విశ్వవ్యాపకత్వం అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి, గణపతి తదితర దేవుళ్ళు విశ్వవ్యాప్త గుణం ఉంది. వీరంతా అయోనిజులు. అంటే మాతృగర్భం లోంచి పుట్టినవారు కాదు. స్వయమ్భువులుగా ఉద్భవించారు.
 
పాదరస గణపతి అమూల్యమైంది, అద్భుతమైంది. ఈ పాదరస గణపతిని పూజించడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం.
 
పాదరస వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలు సిద్ధిస్తాయి. జ్ఙానం వికసిస్తుంది. ఏ పనైనా పూజ కాని, పెండ్లి కాని, గృహ ప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని పాదరస వినాయకుని పూజతో మొదలు పెట్టటం మంచిది. ముఖ్యంగా వ్యాపారస్ధులు, విద్యార్ధులు, జ్యోతిష్యులు, రచయితలు పాదరస వినాయకుడను నిత్యారాధ్య దేవుడుగా పూజించిన వ్యాపారాభివృద్ధి, జ్ఞానం, వాక్శుద్ధి, పఠనా సామర్ధ్యం కలుగుతాయి.
 
పాదరస గణపతిని పూజా మందిరంలో ప్రతిష్టించుకుని పూజించేవారి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. పాదరస గణపతిని అర్చించేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పాదరస గణపతిని నమ్ముకున్న వారికి అకాల మృత్యుభయం ఉండదు.
 
పాదరస గణేశుని ప్రార్థించినట్లయితే అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. పారద విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించేవారికి ఏ సమస్యలూ, చిరాకులూ తలెత్తవు. ''ఓం లంబోదరాయ నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే అత్యున్నత స్థితికి చేరుకుంటారు.
 
మొదటసారి పాదరస గణపతిని సంకటహర చతుర్ధి రోజు లేదా, వినాయక చవితి రోజుగాని, బుధ, గురు, శుక్రవారాలలో పూజా మందిరంలో స్ధాపించాలి. పాదరస గణపతిని పీఠంపై వస్త్రం పరచి రాగి, ఇత్తడి ప్లేట్ పైన బియ్యం ఉంచి పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. చదువుకునే విద్యార్ధులు వారి పుస్తకాలను పాదరస గణపతి ముందు ఉంచి పూజ చేస్తే చదువులో ఆటంకాలు కలగవు. పాదరస గణపతిని పత్ర సహితంగా పూజ చేస్తే ఇంటిలో ఉన్న చెడు శక్తులన్నీ నశిస్తాయి. 
 
“ఓం శ్రీ గణేశాయ నమః ఓం గం గణపతయే నమః ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్” అనే మంత్రాలను 108 సార్లు భక్తితో పఠిస్తూ పాదరస గణపతిని పూజించిన సర్వకార్యసిద్ధి, అత్యున్నత పదవులు కలుగుతాయి.
 
- Praveen

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna