వినాయకుడి శరీర భాగాలలో దాగున్న రహస్యాలు.

44.192.25.113

వినాయకుడి శరీర భాగాలలో దాగున్న రహస్యాలు.!  🌼

🌿 మన హిందు సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచార వ్యవహారాలు వెల కట్టలేనివి. మన పురాణాలు ఇతిహాసాలు మనకు ఎలా జీవించాలి అని చెప్పాయి. అలాగే దేవతల రూపాలు నుంచి కూడా మనం అనేకం తెలుసుకోవచ్చు.

🌿 దేవతా రూప్పాలలో ప్రధమ పూజ్యుడు అయిన విఘ్నేశ్వరుడు ది విభిన్న రూపం. ఏనుగు తల, పెద్ద బొజ్జ, పొట్టి రూపం. ఈ శరీరం అంటే పిల్లలకి చాలా ఇష్టం. మొత్తానికి ఈ శరీరం ఎవరి అంటే మన గణణాథుడితే...ఈ శరీరం గొప్ప సందేశం ఇస్తుంది.

🌿 ఒక్కో భాగం ఒక్కో అంశానాకి ప్రతీక.
ఆటంకాలను తొలగించే చిన్న తల, చిన్న విషయాలను కూడా గ్రహించగల శక్తిని కలగిన చిన్న కళ్లు, అన్ని విషయాలను శ్రద్దగా వినే పెద్ద చెవులు, ఆత్మ గౌవరం కలగడానికి చిహ్నాంగా తొండం, తక్కువగా మాట్లాడమని సూచించే నోరు, అమితమైన జ్ఝానాన్ని సంపాదించుకోమని చెప్పే పెద్ద బొజ్జ, ధర్మ, అర్థ, కామం, మోక్షం సాధించడానికి నాలుగు చేతులు, కోరికలను అదుపులో పెట్టుకోవడానికి ప్రతీకగా ఎలుక వాహనం.

🌿 ఆ వినాయకుడి ఆకృతి నుంచి మనం ఏమేమి తెలుసుకోవచ్చో, ఎలా జీవించాలో చూద్దాం...

🌿 వినాయకుడి తల -ఏనుగు తల :
విఘ్నేశ్వరుడి శిరస్సు ఏనుగు శిరం దీని అర్ధం... అటు బలమైన కార్యాలను, ఇటు బుద్ధికి సంబంధించిన కార్యాల్నీ రెండింటిని నిర్వహించగల సామర్థ్యం గల ఏకైక జీవి ఏనుగు. అటువంటి ఏనుగు తలను ధరించిన గణపతి బుద్ధి భావాలకు చక్కని ప్రతీక అని చెప్పబడుతున్నది.

🌿 వినాయకుడి పెద్ద చెవులు - చిన్ని కళ్ళు
ఇక విఘ్నేశ్వరుడి చెవులు పెద్దవి, కళ్ళు చిన్నవి. ఎంతటి చిన్న విషయాల్ని అయినా పెద్ద చెవులతో వినాలని ఆయన చెవులు చెప్తుంటే, కామానికి మూలమైన కళ్లు చిన్నవిగా ఉండాలని, జన్మ పరంపరల్ని ఆపాలంటే కళ్లను ఎక్కువ సమయం తెరిచి ఉండకుండా ధ్యానముద్రలో మూసి ఉంచాలని కళ్ళు చెప్తుంటాయి.

🌿 వినాయకుడి పొట్ట రహాస్యం :
ఇక విఘ్నేశ్వరుని ఉదరం బహు పెద్దది. మనిషి దీర్ఘాయువుగా ఉండాలంటే పొట్ట పెద్దదిగా ఉండాలని పతంజలి యోగ శాస్త్రం చెపుతుంది. పెద్ద పొట్టను-సృష్టి రహస్యాల్ని, యోగ రహస్యాల్ని దాచే పరికరంగా చెప్పారు.

🌿 వినాయకుని పాదాలు :
ఇదేవిధంగా నిత్యకర్మాచరణాన్ని అనుసరించే ఎవరైనా మన చరణాలకు నమస్కరించడం జరుగుతుందని చెప్పడానికే వినాయకుని పాదాలు చిన్నవిగా ఉంటాయి.

🌿 వినాయకుని రూపం:
అలాగే విఘ్నేశ్వరుని తల విఘ్ననాశిని, చిన్ని కళ్ళు-సూక్ష్మ దృష్టిని, తుండం-ఆత్మాభిమానాన్ని, పెద్ద చెవులు- సహనంగా అన్నింటిని వినడాన్ని, దంతాలు- పరులకు హాని చేయకపోవడాన్ని, చిన్న నాలుక-ఆత్మపరిశీలనకు, పెద్ద పొట్ట-జ్ఞాన భాండాగారానికి సూచకాలు.

🌿 నాలుగు చేతులు :
ఇంకా నాలుగు చేతులు-చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు, చిన్నినోరు- తక్కువ మాట్లాడటానికి, ఎలుక వాహనం- కోరికలను అదుపులో ఉంచుకోవాలని చెప్పాయని పురోహితులు అంటున్నారు.

🌿 వక్రతుండుడు :
లంబోదరుడు, వక్రతుండుడు అని పిలువబడే వినాయకుడు ఉద్భవించిన రోజున ఇళ్లల్లో, వ్యాపార సంస్థల్లో సిద్ధి బుద్ధి అని రెండు వైపులా రాసి స్వస్తిక పద్మం లిఖించడం ద్వారా శుభాన్ని ఆకాంక్షించవచ్చును. ఈ గుర్తు గీసి “అస్మిన్ స్వస్తిక పద్మే శ్రీ మహాగణపతిం ఆవాహయామి” అని ఆవాహన చేసి మహాగణపతికి పూజలందిస్తారు.

🌿 విజ్ఞ రాజు :
కార్యాలను సిద్దింప చేసే విజ్జ రాజు వినాయకుడు :
దీనిని బట్టి మహాగణపతికి, స్వస్తిక పద్మానికి అవినాభావ సంబంధం ఉంది. హోమమే కాక ప్రతిష్ట లేక అనుష్టానాదులతో కూడా నవగ్రహాలతో పాటు గణపతి స్థానంలో స్వస్తిక పద్మం వేసి గణపతిని ఆరాధించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెబుతున్నారు.

🖋 Sruthi Venugomula

 

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna