Online Puja Services

అనుగ్రహనాడి వినాయకుడు

18.190.156.80
తమిళనాడు లో కుట్రాళం - శెంగోట్టై  మార్గంలో సిధ్ధేశ్వరీ పీఠమఠం వుంది. ఈ పీఠానకి అధిపతి మౌనస్వామి అనబడే శ్రీ  మౌనానంద సరస్వతీ స్వామివారు.  వారు సిధ్ధిపొంది చాలాకాలమయింది.  ఈ స్వామి సిధ్ధి పొందిన సమాధి  యీ ప్రదేశంలో వున్నది. ఈ మౌనస్వామి గొప్ప సిధ్ధుడు.
తన మహిమతో భక్తుల కష్టాలు  తీర్చేవారు  ఈ సిధ్ధేశ్వరిమఠంలో వున్నది  అనుగ్రహనాడి 
 వినాయకుని సన్నిధి వుంది. శ్రీమౌనానంద స్వామివారు వున్న కాలంలోనే  యీ మఠంలో సిధ్ధి వినాయకుని ప్రతిష్ట జరిగినది.

ఆ విఘ్ననాయకునికి కర్పూర హారతి యిచ్చేటప్పుడు  యీ విగ్రహమూర్తి కదులుతుందట. ఈ వినాయకుని యొక్క తొడలోని జీవనాడి కొట్టుకుంటుందని చెప్తారు. వైద్యులెందరో ఈ వినాయకుని తమ స్టెత్ స్కోపులతో పరీక్షలు జరిపి చూశారు.  చివరకు వినాయకునికి నాడి  కొట్టుకోవడం నిజమేనని నిర్ధారించారట. వరసగా నాలుగు రోజులపాటు  వినాయకుని నాడి స్పందించడం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారట. బ్రిటిష్ వారి కాలంలో  గవర్నర్గా వున్న హార్స్ పాల్ దొర ఆయన సతీమణి  కూడా శ్రీ సిధ్ధేశ్వరి మఠానికి వచ్చి  నాడీ వినాయకుని దర్శించి ఈ అద్భుతానికి విస్తుపోయారట. 

శ్రీ వేంకట సుబ్రహ్మణ్య అయ్యర్ అనే ఆయన వ్రాసిన " శ్రీ మౌన స్వామి చరిత్ర '" గ్రంధములో
యీ సమాచారం అంతా వున్నది. 

శేషశ్రీ
 

Quote of the day

A small body of determined spirits fired by an unquenchable faith in their mission can alter the course of history.…

__________Mahatma Gandhi