అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం

3.238.125.76
అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం
 
ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోవడం, రావలసిన డబ్బులు, ఉద్యోగాలు, లాభాలు చేతిదాకా వచ్చి చేయిదాటిపోవడం జరుగుతోందా? అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం అంటే ఇప్పుడు చూద్దాము.
 
కొబ్బరి నూనెతో విఘ్నేశ్వరుడికి ఒక్కొక్క కుందె లో 3 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా కేవలం బుధవారమే కాకుండా రోజు ప్రతి రోజు దీపం పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా విఘ్నేశ్వరుడు మనకి వచ్చిన ఆటంకాలు మరియు విఘ్నాలు తొలగిస్తాడు.
 
గణపతికి ఎన్నో రూపాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాము. అయితే దానిలో విఘ్నరాజాధీపతి అయిన వినాయక రూపం. అయితే మళ్ళి ఆ విఘ్నాలు కలిగించి తొలగించేది కూడా వినాయకుడే అందుకే మన పనిలో ఆటంకాలు పోవడానికి “ఓం శ్రీ వినాయకాయ నమో నమః” 
 
విఘ్నేశ్వరుడికి ఎర్రని పువ్వులు అంటే ఎంతో ప్రీతికరమైనవి. వినాయకుడికి చాలా ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ, గరికతో గణపతి స్తోత్రం చదివి నైవేద్యంగా బెల్లం పెట్టాలి.
 
- జానకి తిప్పభట్ల 

Quote of the day

Music fills the infinite between two souls.…

__________Rabindranath Tagore