Online Puja Services

గణపతి ముందు గుంజీళ్ళు

3.128.199.162

గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే..............!!

పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. 
ఒకసారి శ్రీ మహావిష్ణువు తన భావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు.
వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, 
గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. 
అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. 
గణపతి చాలా అల్లరివాడు. 
బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, 
మౌనంగా కూర్చున్నాడు.

మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. '
ఏం వెతుకుతున్నావు మావయ్యా!' అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకున్నా అన్నాడు 
శ్రీ మహావిష్ణువు. 
ఇంకేక్కడుంది మావయ్యా చక్రం! నేను తినేశాగా 
అని నవ్వేశాడు గణపతి.

విష్ణువుకేమొ గణపతి అంటే మహాఇష్టం. 
గణపతిని ఏమి అనలేడు. 
అందువల్ల 'బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహాసుదర్శనం, 
దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా' అని నానారకాలుగా బ్రతిమాలాడు విష్ణువు. 
గణపతి పట్టువదల్లేదు.

ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడిచెవిని పట్టుకుని 
గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు. 
విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా, 
విపరీతమైన నవ్వు తెప్పించింది. 
గణపతి కడుపు నొప్పిచేంతగా నవ్వాడు.

ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు 
శ్రీ మహావిష్ణువు. 
అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది. 
గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే.

ఈ విధంగా శ్రీమహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీళ్ళలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. 
గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore