గణపతికి స్త్రీ రూపం కూడా వుందా?

3.238.125.76

శ్రీ విద్యాగణపతి :-- 

గణపతికి స్త్రీ రూపం కూడా ఉన్నదని తంత్రం శాస్త్రం తెలియజేస్తోంది . ఈ రూపాన్ని వినాయికి అనే పెరుతో పిలుస్తారు . అయితే తంత్రం శాస్త్రం లో శ్రీ విద్యా గణపతి అనే పేరు గల ఒక స్త్రీ గణపతి రూపం ఉన్నది . ఈ రూపం యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే బీజ మంత్రాన్ని శ్రీ విద్యిగణపతి వాంఛా కల్పలత మంత్రం అని పిలుస్తారు .ఈ మంత్రం మహశక్తివంతమైనది అని మహారాష్ట్రకు చెందిన ఓ తంత్రం శాస్త్ర పండితుడు తెలియజేశారు .ఈ మంత్రంలో , విభిన్నమైన దేవతల మరియు దైవాలయొక్క బీజాక్షరాలు కనిపిస్తాయి . ఆ కారణంగానే ఈ మంత్రం కోరిన కోర్కెలు తీరుస్తుందని చెబుతారు ..

|| ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఐం హ స ఏ ఈ ల హ్రీం తత్ సవిత్సవరేణ్యం గణపతయే క్లీం హ స క హ ల హ్రీం భర్గోదేవస్య ధీమహి వర వరద సౌ స క ల హ్రీం థియో యోనః ప్రచోదయాత్ సర్వ జనమ్మే వశమానయ స్వాహా || 

వాంచ అనగా కొరిక అని , కల్పలత అనగా కోరినది ఇచ్చేది అని అర్థం వాంచా కల్పలత గణపతి అనగా కొరిన కోర్కెలను తీర్చే గణపతి అని అర్థం . మహాగణపతి మంత్రాన్ని 444 సార్లు పఠిస్తే ఎంతటి ఫలితాలు ఉంటాయో అంత ఫలితాలు ఈ వాంచా గణపతి ని పూజించటం వల్ల వివాహ సంబంధమైన సమస్యలకు అనగా వివాహం ఆలస్యం కావడం , దాంపత్య పరంగా విభేదాలు ఏర్పడటం లాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి . ఇంకా వృత్తి రీత్యా మరియు ఉద్యోపరంగా ఎదురయ్యే సమస్యల్ని , సంతానం కలగకపోవడం , విద్యాపరంగా అభివృద్ధి లేకపోవడం లాంటి సమస్యలతో బాధపడేవారికి ఈ విద్యాగణపతిని పై మంత్రాన్ని గురుముఖతః తీసుకుని గణపతికి జపం , తర్పణం , లాంటి మరియు తాంత్రిక , వామాచార విధానం లో ఆచరించడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు . 

ఇది ఓ అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది .

Quote of the day

Music fills the infinite between two souls.…

__________Rabindranath Tagore